పవన్‌కల్యాణ్- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన 'అజ్ఞాతవాసి' 2018 జనవరిలో విడుదలైంది. ఈ చిత్రాన్ని హారిక & హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కింది. ఈ సినిమా పవన్ కెరీర్‌లోనే అత్యంత చెత్త సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. సినిమాను చూసేందుకు ప్రేక్షకులు లేక కొన్నిచోట్ల మొదటి రెండురోజుల్లోనే ఈ సినిమా అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. అలా ఈ సినిమా వల్ల భారీ నష్టాలు వచ్చాయి. కొన్ని చోట్ల తమన ఆదుకోవాలని డిస్ట్రిబ్యూటర్లు కూడా రోడ్డెక్కారు. ఆ సినిమా తర్వాత పవన్ కూడా సుమారు 3 ఏళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగానే ఉన్నాడు. మళ్లీ 2021లో 'వకీల్‌సాబ్'గా కనిపించాడు.
దీనికి సంబంధించి నిర్మాత నాగవంశీ ఒక ఆసక్తికరమైన సంగతి పంచుకున్నారు. అజ్ఞాతవాసి పోయాక ఆ బాధలోనే టీమ్ రెండు నెలలు గడిపేసిందని ఆయన చెప్పాడు. భారీ అంచనాలతో జనవరిలో రిలీజైన ఈ సినిమా ఫలితం చూశాక తప్పెక్కడ జరిగిందో ఎవరికీ అంతు చిక్కని పరిస్థితి అయింది. అలా ఒకరకమైన డిప్రెషన్‌లో ఉండగా తమకు జూ. ఎన్టీఆర్ ధైర్యం ఇలా ఇచ్చారని నాగవంశీ చెప్పాడు.
'వెంటనే ఆ మూడ్‌లో నుంచి బయటికి వచ్చేయమని, ఇదే సంవత్సరం మనం హిట్టు కొడుతున్నామని చెప్పి 'అరవింద సమేత వీర రాఘవ'కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలా త్రివిక్రమ్- తారక్ కాంబోలో తక్కువ రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసి బ్లాక్ బస్టర్ కొట్టేశాం. దీంతో హారిక & హాసినీ ఇండస్ట్రీలో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయిన ఫీలింగ్ వచ్చేసింది.' అని ఒక జాతీయ వెబ్ వీడియో మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగవంశీ పంచుకున్నారు. 'అరవింద సమేత వీర రాఘవ' 2018 అక్టోబర్‌లో దసరా కానుకగా విడుదలైన విషయం తెలిసిందే.
(ఇదీ చదవండి: సమంత- నాగ చైతన్య మళ్లీ కలుసుకోబోతున్నారా.. ఫోటోలు వైరల్)
ఇండస్ట్రీలో ఒక నిర్మాతగా తమకు ఇలాంటి సంఘటనలో ఎన్నో ఎదరయ్యాయని అన్నీ బహిరంగంగా చెప్పుకోలేమని ఆయన చెప్పాడు. నాగవంశీ సోదరి హారిక నిర్మించిన ‘మ్యాడ్’ సినిమా అక్టోబరు 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ఎన్టీఆర్ బావ మరిది నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించారు. కల్యాణ్ శంకర్ దీనిని తెరకెక్కించారు.
Comments
Please login to add a commentAdd a comment