యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం అరవింద సమేత వీర రాఘవ. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ఇప్పటికే ప్రారంభించారు చిత్రయూనిట్.
ఇప్పటికే టీజర్‌ను రిలీజ్ చేసిన యూనిట్ ఈ రోజు(శనివారం) ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. ‘అనగనగనగా’ అనే పాటను ఈ రోజు సాయంత్ర 4 గంటల 5 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. కథ మొదలు పెట్టేప్పుడు అనగనగనగా అంటూ ప్రారంభించినట్టుగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో ఈ పాటతో మరింత వేగం పెంచనున్నారు చిత్రయూనిట్. తమన్ సంగీత సారధ్యంలో అర్మన్ మాలిక్ అనగనగనగా పాటను ఆలపించారు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జగపతి బాబు, నాగబాబు, ఈషా రెబ్బా, సునీల్, రావూ రమేష్లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Special lyrical video of "Anaganaganaga" from #AravindhaSametha will be releasing today at 04:05pm. A @MusicThaman musical!@tarak9999 #Trivikram @hegdepooja #PSVinod @vamsi84 pic.twitter.com/0IF15QAIu0
— Haarika & Hassine Creations (@haarikahassine) 15 September 2018
Comments
Please login to add a commentAdd a comment