
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన సినిమా అరవింద సమేత. గత ఏడాది రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌తో మంచి వసూళ్లు సాధించింది. అయితే ఈసినిమా బుల్లితెర మీద మాత్రం ఆ స్థాయిలో సత్తా చాటలేకపోయింది. ఇటీవల టీవీలో ప్రసారమైన అరవింద సమేత సినిమా కేవలం 13.7 టీఆర్పీ రేటింగ్స్ మాత్రమే సాధించింది.
గతంలో ఎన్టీఆర్ టెంపర్ 25 టీఆర్పీ రేటింగ్ సాధించి రికార్డ్ సృష్టించింది. కానీ అరవింద సమేత మాత్రం ఆస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇప్పటి వరకు అత్యధిక టీఆర్పీ సాధించిన సినిమాగా 22.7 రేటింగ్‌తో బాహుబలి 2 టాప్ ప్లేస్‌లో నిలిచింది. తరువాత స్థానాల్లో మగధీర (22), బాహుబలి (21.8), డీజే (21.7), శ్రీమంతుడు (21.2), గీత గోవిందం (20.8) సినిమాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment