Agnathavasi
-
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మహేశ్ సినిమా చైల్డ్ ఆర్టిస్.. ఎవరో కనిపెట్టారా?
తెలుగు మూలలున్న అమ్మాయి. పుట్టిపెరిగింది అంతా అమెరికాలోనే అయినప్పటికీ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. మహేశ్, పవన్ కల్యాణ్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. పర్లేదు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడేమో సడన్‌గా హాలీవుడ్లో వరస మూవీస్ చేస్తూ బిజీ అవుతోంది. ఇంకా టీనేజీలోనే ఉన్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా? లేదా మమ్మల్నే చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు అవంతిక వందనాపు. ఈమె తల్లిదండ్రులది హైదరాబాద్. కాకపోతే కాలిఫోర్నియాలో సెటిలైపోయారు. ఆ తర్వాత 2005లో ఈమె పుట్టింది. పదేళ్ల వయసులోనే ఈమెకి తెలుగు సినిమాల్లో ఛాన్సులొచ్చాయి. నాని 'కృష్ణగాడి వీర ప్రేమగాధ' సినిమాల్లో ఓ చైల్డ్ ఆర్టిస్టుగా అవంతికనే చేయాల్సింది గానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయింది. అలా మహేశ్ 'బ్రహ్మోత్సవం' చిత్రంతో చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చింది. (ఇదీ చదవండి: రెండో రోజుకే భారీగా తగ్గిపోయిన 'గుంటూరు కారం' కలెక్షన్స్) మహేశ్ సినిమాలో నటించిన తర్వాత ఈమెకు వరస ఛాన్సులొచ్చాయి. మనమంతా, ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం, బాలకృష్ణుడు, ఆక్సిజన్, అజ్ఞాతవాసి తదితర చిత్రాల్లో పలు క్యారెక్టర్స్ చేసి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మధ్యలో కొన్ని యాడ్స్‌లోనూ నటించింది. వీటి తర్వాత తెలుగు చిత్రాలకు టాటా చెప్పేసిన అవంతిక.. పూర్తిగా కాలిఫోర్నియా షిఫ్ట్ అయిపోయింది. 2020 నుంచి హాలీవుడ్‌లోనే పలు సినిమాలు, ఆల్బమ్ సాంగ్స్ లాంటివి చేస్తూ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉంది. ప్రస్తుతం ఈమె వయసు 18 ఏళ్లు. కాకపోతే లేటెస్ట్ ఫొటోలు చూస్తుంటే మాత్రం అలా కనిపించట్లేదు. అలానే చైల్డ్ ఆర్టిస్టు ఫొటోలతో పోల్చి చూస్తే గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించింది. అందుకే ఈమెని తెలుగు ఆడియెన్స్ తొలుత గుర్తుపట్టలేకపోయారు. ఈమె ఎవరో తెలిసేసరికి అవాక్కవుతున్నారు. (ఇదీ చదవండి: సంక్రాంతి మూవీస్.. ఆమె నటిస్తే హిట్ కొట్టడం గ్యారంటీనా?) View this post on Instagram A post shared by avantika (@avantika) -
గుంటూరు కారం రిలీజ్.. ట్రెండింగ్‌లో అజ్ఞాతవాసి.. ఎందుకంటే?
మహేశ్‌బాబు, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మరో చిత్రం గుంటూరు కారం. అభిమానుల భారీ అంచనాల మధ్య ఈ సినిమా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో రిలీజైంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన సినీ ప్రియుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. కొందరు అభిమానులు బ్లాక్ బస్టర్ హిట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో గుంటూరు కారం అంత ఘాటు.. సినిమాలో కనిపించలేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా అభిమానుల నుంచి మహేశ్ బాబు గుంటూరు కారం సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. అయితే ఒకవైపు గుంటూరు కారం థియేటర్లలో అలరిస్తుండగా.. మరోవైపు పవన్ కల్యాణ్ నటించిన అజ్ఞాతవాసి ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. గుంటూరు కారం సినిమాను అజ్ఞాతవాసి చిత్రంతో పోలుస్తున్నారు సినీ ప్రేక్షకులు. ఇవాళ విడుదలైన గుంటూరు కారం చూస్తే.. పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి గుర్తుకు వస్తోందని కొందరు ఆడియన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆరేళ్ల క్రితం రిలీజైన పవన్ సినిమా క్రియేట్ చేసిన ఓవర్సీస్ కలెక్షన్స్ రికార్డును గుంటూరు కారం క్రాస్ చేయలేదని మరికొందరు ట్వీట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ రెండు చిత్రాలను త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కినవే కావడం మరో విశేషం. మరీ సంక్రాంతి బరిలో నిలిచిన గుంటూరు కారం మూవీతో మరో చిత్రం హనుమాన్ బాక్సాఫీస్ వద్ద పోటీపడుతోన్న సంగతి తెలిసిందే. పొంగల్ పోటీని తట్టుకుని ఎవరు సక్సెస్ సాధిస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. Edi endhuku EPPUDU 😭#GunturKaaram #Agnyaathavaasi 💔@PawanKalyan @urstrulyMahesh pic.twitter.com/5clG1sQ8zb — Joh№y (@Johnny__007) January 12, 2024 #Agnyaathavaasi Trending 🙂pic.twitter.com/pobebEsBcj — Kobali🌊 (@kobali778) January 12, 2024 -
'పవన్ కల్యాణ్ సినిమాతో కష్టాలు వస్తే.. జూ.ఎన్టీఆర్ తిరిగి నిలబెట్టాడు'
పవన్‌కల్యాణ్- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన 'అజ్ఞాతవాసి' 2018 జనవరిలో విడుదలైంది. ఈ చిత్రాన్ని హారిక & హాసినీ క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కింది. ఈ సినిమా పవన్ కెరీర్లోనే అత్యంత చెత్త సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. సినిమాను చూసేందుకు ప్రేక్షకులు లేక కొన్నిచోట్ల మొదటి రెండురోజుల్లోనే ఈ సినిమా అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. అలా ఈ సినిమా వల్ల భారీ నష్టాలు వచ్చాయి. కొన్ని చోట్ల తమన ఆదుకోవాలని డిస్ట్రిబ్యూటర్లు కూడా రోడ్డెక్కారు. ఆ సినిమా తర్వాత పవన్ కూడా సుమారు 3 ఏళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగానే ఉన్నాడు. మళ్లీ 2021లో 'వకీల్‌సాబ్'గా కనిపించాడు. దీనికి సంబంధించి నిర్మాత నాగవంశీ ఒక ఆసక్తికరమైన సంగతి పంచుకున్నారు. అజ్ఞాతవాసి పోయాక ఆ బాధలోనే టీమ్ రెండు నెలలు గడిపేసిందని ఆయన చెప్పాడు. భారీ అంచనాలతో జనవరిలో రిలీజైన ఈ సినిమా ఫలితం చూశాక తప్పెక్కడ జరిగిందో ఎవరికీ అంతు చిక్కని పరిస్థితి అయింది. అలా ఒకరకమైన డిప్రెషన్లో ఉండగా తమకు జూ. ఎన్టీఆర్ ధైర్యం ఇలా ఇచ్చారని నాగవంశీ చెప్పాడు. 'వెంటనే ఆ మూడ్‌లో నుంచి బయటికి వచ్చేయమని, ఇదే సంవత్సరం మనం హిట్టు కొడుతున్నామని చెప్పి 'అరవింద సమేత వీర రాఘవ'కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలా త్రివిక్రమ్- తారక్ కాంబోలో తక్కువ రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసి బ్లాక్ బస్టర్ కొట్టేశాం. దీంతో హారిక & హాసినీ ఇండస్ట్రీలో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయిన ఫీలింగ్ వచ్చేసింది.' అని ఒక జాతీయ వెబ్ వీడియో మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగవంశీ పంచుకున్నారు. 'అరవింద సమేత వీర రాఘవ' 2018 అక్టోబర్‌లో దసరా కానుకగా విడుదలైన విషయం తెలిసిందే. (ఇదీ చదవండి: సమంత- నాగ చైతన్య మళ్లీ కలుసుకోబోతున్నారా.. ఫోటోలు వైరల్) ఇండస్ట్రీలో ఒక నిర్మాతగా తమకు ఇలాంటి సంఘటనలో ఎన్నో ఎదరయ్యాయని అన్నీ బహిరంగంగా చెప్పుకోలేమని ఆయన చెప్పాడు. నాగవంశీ సోదరి హారిక నిర్మించిన ‘మ్యాడ్’ సినిమా అక్టోబరు 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ఎన్టీఆర్ బావ మరిది నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించారు. కల్యాణ్ శంకర్ దీనిని తెరకెక్కించారు. -
కాపీ అయినా సరిగా చేయండి : ఫ్రెంచ్ డైరెక్టర్
ఇటీవల కాలంలో సినిమాల మీద కాపీ ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. మన దర్శకులు ఇంగ్లీష్, ఫ్రెంచ్ సినిమాలను ఎలాంటి అనుమతులు తీసుకోకుండా యదాతథంగా ఫ్రీమేక్ (అనుమతులు లేకుండా రీమేక్) చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. తాజాగా సాహో సినిమా విషయంలోనూ ఇలాంటి ఆరోపణలే వినిపిస్తున్నాయి. ఏకంగా ఫ్రెంచ్ దర్శకుడు జెరోమ్ సల్లే సాహోను ఉద్దేశిస్తూ తన సినిమాను మరోసారి ఫ్రీమేక్ చేవారంటూ ట్వీట్ చేశాడు. గతంలో అజ్ఞాతవాసి సినిమాను జెరోమ్ తెరకెక్కించిన లార్గో వించ్ సినిమా ఆధారంగా తెరకెక్కించారన్న ఆరోపణలు వినిపించాయి. కథతో పాటు కథనం కూడా యదాతథంగా ఉండటంతో అప్పట్లో జెరోమ్‌కు పెద్ద ఎత్తున మద్ధతు లభించింది. తాజాగా సాహో కథనం ట్రీట్మెంట్ భిన్నంగా ఉన్నా.. మూల కథ దాదాపు లార్గో వించ్‌ను పోలి ఉండటంతో మరోసారి జెరోమ్ స్పందించారు. తన సినిమాను కాపీ చేసి తెరకెక్కించిన రెండు సినిమాలకు నెగెటివ్ రావటంతో కనీసం కాపీ అయినా సరిగా చేయండి అంటూ వెటకారంగా ట్వీట్ చేశాడు జెరోమ్. అంతేకాదు ఇండియాలో తన కెరీర్ చాలా ఆశాజనకంగా ఉండే అవకాశం ఉందన్నాడు జెరోమ్. అయితే టాక్ ఎలా ఉన్న ప్రభాస్ సాహో మాత్రం కలెక్షన్ల పరంగా సంచలనాలు నమోదు చేస్తోంది. ఇప్పటికే మూడు వందల కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకుపోతోంది. -
24 గంటలూ షోలే.. షోలు
అత్యాశవాసి.. సారీ అజ్ఞాతవాసికి ఇప్పుడు జై సింహ తోడయ్యాడు. ఒకరేమో అధికార పార్టీకి మిత్రసేనుడిగా సుపరిచితుడు.. ఇంకొకరేమో ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యే.. అందునా.. స్వయానా సీఎం చంద్రబాబుకు బావమరిది, మంత్రి లోకేష్‌కు మామ.. ఇంకేం.. మిత్రసేనుడి సినిమాకు ఇచ్చినట్లే.. బంధుజనుడి సిన్మాకూ ఉదారంగా అదనపు షోలకు అనుమతులిచ్చేశారు. ఐదు రోజులపాటు ఏకధాటిగా సదరు సిన్మా ఆడించేసుకోవచ్చంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో విడుదల చేసేసింది. థియేటర్లు ఫుల్ అయినా.. కాకున్నా పోటీపడి వరుసగా ఏడు షోలు ఆడించడం వల్ల కలెక్షన్ల దందా ఏమో గానీ.. ఏమాత్రం రెస్ట్ లేకుండా పని చేస్తున్న థియేటర్ల సిబ్బంది మాత్రం చెప్పుకోలేని ‘హింస’ అనుభవిస్తున్నారు. పండుగపూట ఇంటిపట్టున ఉండనివ్వకుండా అదనపు షోలతో సేవ చేయించుకున్నందుకు తగిన ఆర్థిక ప్రతిఫలం విషయాన్ని మాత్రం అటు సర్కారు గానీ.. ఇటు యాజమాన్యాలు గానీ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : పవన్ స్టార్ అజ్ఞాతవాసి మాదిరిగానే నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన జైసింహ సినిమాకు కూడా సర్కారు ఇష్టారాజ్యంగా ఏడు షోలకు అనుమతినిచ్చేసింది. ఏదో ఒక్క రిలీజ్ రోజు కాకుండా ఏకంగా ఈ నెల 12 నుంచి 16వ తేదీ వరకు ఐదు రోజుల పాటు 24 గంటలూ బొమ్మ ఆడించుకోవచ్చని సర్కారు తెర ఎత్తేయడం వివాదాస్పదమవుతోంది. ఇప్పటికే అజ్ఞాతవాసికి వరుసగా వారంరోజుల పాటు ఏడు షోలకు అనుమతివ్వడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఇక సినిమా టికెట్ల రేట్లు కూడా ఇష్టారాజ్యంగా పెంచడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నగరంలో ఈ రెండు సినిమాలు ఆడే థియేటర్లలో టికెట్ల రేట్లు ఏకంగా రూ.200కి పెంచేశారు. సినిమా టాక్ ఎలా ఉన్నా కేవలం పండుగ రోజుల్లో దండుకునే పర్వానికి తెర లేపేందుకే 24గంటలూ షోలకు అనుమతిచ్చారన్నది నిర్వివాదాంశం. నాలుగు షోలకే జనం లేరట!.. ఏకంగా ప్రభుత్వం నుంచి జీవో తెప్పించుకుని ఏడు షోలు వేసుకున్నా చూసే వాడే లేకుంటే?!.. ప్రస్తుతం అజ్ఞాతవాసికి ఇదే పరిస్థితి ఎదురవుతోంది. సినిమాపై డివైడ్ టాక్‌తో మామాలుగా నాలుగు షోలకే హాలు నిండే పరిస్థితి లేదంటున్నారు. హైప్ క్రియేట్ చేసి భారీ అంచనాలతో రిలీజ్ చేసినా మొదటిరోజు తప్ప ఆ తర్వాత ఏడు షోలకూ టికెట్లు తెగట్లేదని ధియేటర్ల సిబ్బంది చెబుతున్నారు. విశాఖ నగరంలోని చాలా థియేటర్లలో ఇదే పరిస్థితి కాగా.. పెందుర్తిలో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. గురువారం సాయంత్రం పెందుర్తిలోని ఓ ధియేటర్లో టికెట్లు తెగక సినిమా ప్రదర్శనే నిలిపివేశారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. థియేటర్ల సిబ్బంది గోడు వినేదెవరు?.. ఏడు షోలతో ఆయా సినిమాలు కలెక్షన్లు కొల్లగొట్టడం(?) ఏమో గానీ ధియేటర్ల ఉద్యోగులు, సిబ్బంది మాత్రం అల్లాడిపోతున్నారు. సాధారణంగా రోజుకి నాలుగు షోలు ఆడే థియేటర్లో ఒకేసారి ఏడు షోలు ఆడిస్తున్నా.. సిబ్బందిని మాత్రం యాజమాన్యాలు పెంచలేదు. పోనీ కనీసం వారి వేతనాలు కూడా పెంచలేదని తెలుస్తోంది. కేవలం వారం రోజులేగా పనిభారం.. అన్న భావనలో ధియేటర్ల యజమానులు ఉన్నారు. అదనపు షోలకు ఉదారంగా అనుమతులిచ్చిన ప్రభుత్వం సైతం సిబ్బంది పనిభారం, అదనపు వేతనాల చెల్లింపు విషయాన్ని పట్టించుకోలేదు. కలెక్షన్లు ‘ఫుల్లు’ గా ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. కానీ ఇప్పటికైతే ఒక సినిమా పరిస్థితి తేలిపోయింది. రెండో రోజు నుంచే కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి. కేవలం పండుగ మూడురోజుల కలెక్షన్లపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇక బాలకృష్ణ సినిమా ఫలితం నేడు తేలనుంది. సినిమా ఫలితాలు ఎలా ఉన్నా... ఏడు షోల దెబ్బకు రాత్రనక, పగలనక సిబ్బంది పనిభారంతో ‘హింస’ పడుతున్నారన్నది వాస్తవం. అడ్వాన్స్ బుకింగ్ నిలిపివేత పెందుర్తి: అజ్ఞాతవాసి ఇచ్చిన షాక్‌తో పెందుర్తిలోని లక్ష్మికాంత్ థియేటర్ యాజమాన్యం జైసింహా సినిమా అడ్వాన్స్ బుకింగ్ నిలుపుదల చేసింది. అజ్ఞాతవాసి కోసం రెండు రోజుల ముందుగా బుధ, గురువారాల ఆటలకు అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వారు థియేటర్ వాళ్లకే టికెట్లు తిరిగి ఇచ్చేశారు. తిరిగి డబ్బులు కూడా అడగలేదు. ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న వారు క్యాన్సిల్ చేసుకున్నారు. కొందరైతే హాల్ ముందే రూ.200 టికెట్‌ను రూ.20, రూ.30కి ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. దీంతో శుక్రవారం విడుదల అయిన జైసింహా పరిస్థితి కూడా ఇదే అయితే ప్రేక్షకులు తమ థియేటర్‌కు ఏ హాని తలపెడతారో అన్న భయంతో యాజమాన్యం జైసింహాకు అడ్వాన్స్ బుకింగ్‌ను పూర్తిగా రద్దు చేసింది. శుక్రవారం ఉదయమే కౌంటర్లో టికెట్లు అమ్మేందుకు సన్నద్ధమయ్యారు. ప్రస్తుత కాలంలో థియేటర్లు అడ్వాన్స్ బుకింగ్ రద్దు చేయడం ఎక్కడా లేదు. మరోవైపు గురువారం సాయంత్రం లక్ష్మికాంత్ హాల్లో ప్రేక్షకులు రాకపోవడంతో రెండు స్క్రీన్లలో ఆటలు రద్దు చేశారు. రెండు స్క్రీన్లకు కలిపి పది మంది మాత్రమే వచ్చారు. ఈ థియేటర్ ప్రారంభం నాటి నుంచి ఎన్నడూ లేని విధంగా కలెక్షన్లు లేక ఆటను రద్దు చేయడం ఇదే ప్రథమం. -
పవన్ కోసం 10, త్రివిక్రమ్ కోసం 3సార్లు..
సాక్షి, హైదరాబాద్ : త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన అజ్ఞాతవాసి చిత్రం చాలా చాలా బాగుందని జబర్దస్త్ కమేడియన్ హైపర్ ఆది పేర్కొన్నారు. తమ్ముడు, తొలిప్రేమ సమయంలో పవన్ లో ఉన్న కామెడీ టైమింగ్ మళ్లీ ఈ చిత్రంలో చూడొచ్చని తెలిపారు. ఈ సినిమా గురించి పూర్తిగా చెప్పాలంటే పవన్ కోసం పదిసార్లు, త్రివిక్రమ్ కోసం మూడుసార్లు, కీర్తీ సురేష్, అను ఇమ్మాన్యూల్, మురళీ శర్మ, రావు రమేష్‌ల కోసమైతే వీలున్నప్పుడల్లా వెళ్లి చూడొచ్చన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే అజ్ఞాతవాసి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అన్నారు. సీరియస్‌గా చాలా చాలా బాగుందని చెప్పారు. ఈ చిత్రంలో బొమన్ ఇరానీ చెప్పిన 'రాజ్యం మీద ఆశలేనివాడికంటే గొప్ప రాజు ఎవడుంటాడు' అనే డైలాగ్ బాగుందన్నారు. ఇలాంటివి సినిమాలో చాలా డైలాగులుంటాయని తెలిపారు. -
’అజ్ఞాతవాసి’పై హైపర్ ఆది కామెంట్స్
-
డీఎస్పీ చొరవతో సద్దుమణిగిన టిక్కెట్ల లొల్లి
నెల్లూరు(క్రైమ్): అభిమానుల మధ్య తలెత్తిన టిక్కెట్ల వివాదం డీఎస్పీ చొరవతో సద్దుమణిగింది. పవన్‌కల్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమా విడుదల నేపథ్యంలో జనసేన పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు బ్లాక్‌లో టిక్కెట్లు విక్రయిస్తున్నారని ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే థియేటర్ యాజమాన్యాలు, అభిమాన సంఘ నాయకులతో సమావేశం నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలని నగర డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణను ఆదేశించారు. దీంతో సోమవారం రాత్రి డీఎస్పీ తన కార్యాలయంలో థియేటర్ యాజమాన్యాలు, చిరంజీవి యువత, జనసేన పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. వేల సంఖ్యలో టిక్కెట్లు ఇవ్వడం కుదరదని డీఎస్పీ తేల్చిచెప్పారు. దీంతో సమావేశం అర్ధంతరంగా ముగిసింది. మంగళవారం చిరంజీవి యువత నాయకులు మెగా బ్రదర్ నాగబాబు, ఎంఎల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డితో పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్లు చేయించారు. మరోమారు డీఎస్పీ తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. నెల్లూరు నగరంలో ఉన్న థియేటర్లు, వాటి సీటింగ్ సామర్థ్యాలను డీఎస్పీ అడిగి తెలుసుకొన్నారు. సగం టిక్కె ట్లు అభిమాన సంఘాలకు ఇవ్వాలని, మిగిలిన టిక్కెట్లు థియేటర్లో క్యూలో, ఆన్లైన్లో విక్రయించాలని సూచించారు. తొలి మూడు షోలకు మాత్రమే టిక్కెట్లు ఇస్తామని చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. -
‘అజ్ఞాతవాసి’ ట్రైలర్ విడుదల
-
‘అజ్ఞాతవాసి’ప్రత్యేక ప్రదర్శనలకు రాష్ట్ర సర్కారు అనుమతి
సాక్షి, అమరావతి: పవన్ కల్యాణ్ హీరోగా నటించిన అజ్ఞాతవాసి సినిమా ప్రత్యేక ప్రదర్శనలకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం అనుమతి మంజూరు చేసింది. ఈ నెల 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ప్రతిరోజూ రాత్రి 1 గంట నుంచి ఉదయం 10 గంటల వరకు స్పెషల్ షోలకు అనుమతించారు. -
వారి కోసం 'అజ్ఞాతవాసి' స్పెషల్ షో?
పవన్ కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన చిత్రం 'అజ్ఞాతవాసి'. ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుని ఈ నెల 10 న విడుదలకు సిద్ధమైంది. ఒక్కరోజు ముందే అంటే 9వ తేదీన యూఎస్‌లో ప్రీమియర్ షో పడిపోనుంది. అయితే ఈ సినిమా స్పెషల్ షోకి రావాల్పిందిగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత రాధాకృష్ణలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని ఆహ్వానించినట్లు సమాచారం. అదేవిధంగా రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను సచివాలయంలో కలిసి ఆహ్వానించారు. మెగా ఫ్యామిలీ కోసం రెండు రోజుల ముందుగానే 'అజ్ఞాతవాసి' స్పెషల్ స్క్రీనింగ్ వేయనున్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో పవన్ సరసన కీర్తి సురేష్, అనూ ఇమ్మాన్యూయేల్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. కుష్బూ, ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మరోవైపు అగ్రహీరో వెంకటేష్ కూడా ఓ పాత్రలో మెరవబోతున్నారనే టాక్ ఉంది. హారిక హాసిని క్రియేషన్స్‌లో ఎస్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ పవన్ కెరీర్లో 25వ చిత్రంగా విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. -
కత్తిపై పవన్ కల్యాణ్ పరోక్ష ట్వీట్.. కత్తి కౌంటర్!
సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానులు, ప్రముఖ సినీ విమర్శకుడు, బిగ్‌బాస్ కంటెస్టెంట్ కత్తి మహేశ్ మధ్య ఎడతెగని వివాదం కొనసాగుతూనే ఉంది. కత్తి మహేశ్ పవన్ కల్యాణ్ రాజకీయ విధానాలపై విమర్శలు చేయడం.. దానికి బదులుగా పవన్ అభిమానులు కత్తిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ దుర్భాషలాడటం కొనసాగుతూనే ఉంది. ఈ వివాదం ఇలా ఉండగానే తాజాగా పవన్ కల్యాణ్ చేసిన ఓ ట్వీట్ ఆసక్తి రేపుతోంది. ’ వ్యక్తిత్వంలో నిన్ను ఓడించడం చేతకాని వాళ్లు..నీ కులం, ధనం, వర్ణం గురించి మాట్లాడతారు. (ఎవరు చెప్పారో తెలియదు కానీ ఓ సీనియర్ జర్నలిస్టు ఉదయాన్నే నాకు పంపించారు. బాగుందని షేర్ చేస్తున్నా’ అని పవన్ పేర్కొన్నారు. వ్యక్తిత్వంలో నిన్ను ఓడించడం చేతకాని వాళ్లు..నీ కులం, ధనం, వర్ణం గురించి మాట్లాడతారు.(Dont know who said it but a respectable & senior journalist has greeted me today morning with the above quote.Felt like sharing.Good day! — Pawan Kalyan (@PawanKalyan) January 6, 2018 పరోక్షంగా కత్తి మహేశ్‌ను ఉద్దేశించి పవన్ కల్యాణ్ ఈ ట్వీట్ చేసినట్టు భావిస్తున్నారు. దీనిని రీట్వీట్ చేసిన పలువురు నెటిజన్లు సైతం ఇది కత్తి మహేశ్‌కు పవన్ ఇచ్చిన కౌంటర్ అని కామెంట్ పెట్టారు. మరోవైపు కత్తి మహేశ్ సైతం పవన్ ట్వీట్‌పై ఘాటుగా స్పందించారు. ‘ధనం, వర్ణం, కులం గురించి మాట్లాడుతున్నది నీ ఫ్యాన్స్, ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్. నేను కాదు. కాబట్టి పెట్టె గడ్డేదో వాళ్ళకి పెట్టు. ఇక వ్యక్తిత్వం గురించి అంటావా...అది నువ్వు మాట్లాడకపోతేనే బెటర్! అనవసరంగా కడుపు చించుకుంటే కాళ్ళమీద పడుతుంది. జాగ్రత్త!’ అంటూ ఘాటుగా బదులిచ్చారు. పవన్ రాజకీయ విధానాలను కత్తి మహేశ్ ఘాటుగా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో పవన్ అభిమానులను ఆగడాలను సైతం ఆయన ఫేస్బుక్లో ఎండగడుతున్నారు. పవన్ ఫ్యాన్స్ పేరిట కొందరు చేస్తున్న దుర్భాషలను ఫేస్బుక్ వేదికపై బహిర్గతం చేస్తున్నారు. ఈ వివాదం ఎడతెగకుండా కొనసాగుతూనే ఉంది. అజ్ఞాతవాసిపై కత్తి ఫైర్.. పవన్ తాజా సినిమా ‘అజ్ఞాతవాసి’ కత్తి మహేశ్ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ‘అజ్ఞాతవాసి సినిమా ప్రీమియర్లు విచ్చలవిడిగా వేసుకోవచ్చు. టికెట్ రేట్లు పెంచుకోవచ్చు. ఎక్స్ట్రా షోలు కూడా పర్మిటెడ్. ప్రజల డబ్బులు ఘరానాగా దోచుకునే ప్లాన్ రెడీ. పవన్ కళ్యాణ్ సలాం ఒకరికి, గులాంగిరి మరొకరి చేసి సాధించుకున్న హక్కులు ఇవి. కానీ పాపం, త్రివిక్రమ్ సినిమాని కాపీకొట్టి ఇబ్బందులపాలు చేశాడని వినికిడి. టి.సిరీస్ వేసిన కేసుతో ట్రైలర్ రిలీజ్ చెయ్యలేక. సినిమాకు కోర్టులో ఎలాంటి ఇబ్బందులు వస్తాయో తేలిక సతమతం అవుతున్న నిర్మాత. చాలా బాధాకరమైన వార్త. కానీ ఏం చేద్దాం! అప్పుడప్పుడు బాధ కూడా మంచిదే!’ అని తాజాగా తన ఫేస్బుక్లో కామెంట్ పెట్టారు. -
ఇలా ఖర్సైపోతే ఎలా కోటేశ్వర్రావా! : కత్తి
సాక్షి, హైదరాబాద్ : సినీ విమర్శకుడు మహేశ్ కత్తి.. ‘అజ్ఞాతవాసి’ సినిమా డైరెక్టర్ త్రివిక్రమ్‌పై సోషల్ మీడియాలో కామెంట్లు పోస్ట్ చేశారు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ విడుదలయినపుడు అది ఓ హాలీవుడ్ సినిమాకు కాపీ అని అర్థం వచ్చేలా ఉందని, 2008లో వచ్చిన హాలీవుడ్ సినిమా `లార్జో వించ్` అనే సినిమా ట్రైలర్‌లా ఉందని తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ‘ త్రివిక్రమ్ కాపీ దెబ్బకి రెండోసారి ఒకే ప్రొడక్షన్ హౌస్ బలి అయ్యిందట పాపం. నవలని, పాత సినిమాని ఎత్తేస్తే కాస్త ఖర్చుతో పోయింది. ఈసారి ఏకంగా యూరోపియన్ సినిమా. వాళ్ళ కరెన్సీ యూరోలు మరి. ఇలా ఖర్సైపోతే ఎలా కోటేశ్వర్రావా!!!’ అని పోస్ట్ పెట్టారు. పవన్ అభిమానులకు కత్తి హెచ్చరిక! గత కొద్దిరోజులుగా కత్తి మహేశ్, పవన్ అభిమానుల మధ్య మాటల యుద్దం నడుస్తోన్న విషయం తెలిసిందే. ‘మీరు తిట్టే ప్రతి బూతు. కూసే ప్రతికూతా. చేసే ప్రతి కాల్. వచ్చే ప్రతి బెదిరింపు ఇప్పుడు మీ పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తుకు ఘోరీ కట్టడానికి వాడతాను. గుర్తుపెట్టుకోండి.’ అని తాజాగా తన ఫేస్బుక్ వేదికగా కత్తి కామెంట్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా జనవరి 10న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘అజ్ఞాతవాసి’ సినిమా విడుదల కానుంది. -
సెన్సార్‌కు పవన్ కల్యాణ్ 'అజ్ఞాతవాసి'..
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ తాజా సినిమా 'అజ్ఞాతవాసి' డిసెంబర్ 30న సెన్సార్ పూర్తి చేసుకోనుంది. ప్రపంచవ్యాప్తంగా జనవరి 10న విడుదల కానుంది. త్రివిక్రమ్-పవన్ కాంబినేషన్లో వస్తోన్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదివరకే వీరి కాంబినేషన్లో జల్సా, అత్తారింటికి దారేది లాంటి హిట్ సినిమాలు వచ్చాయి. ముచ్చటగా మూడోసారి హిట్ కొట్టడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే రిలీజైన పాటలు హిట్ అయ్యాయి. ఇందులో పవన్ అజ్ఞాతంలో ఉండే ధనవంతుడి పాత్రను పోషిస్తున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కీర్తి సురేశ్, అను ఇమాన్యుయేల్ పవన్‌కు జోడిగా నటిస్తున్నారు. ఆది పినిశెట్టి, కుష్బూ, బొమన్ ఇరానీ, మురళీ శర్మ, రావు రమేశ్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే పవన్ పాడిన ‘కొడుక కోటీశ్వర రావు’ పాట ట్రైలర్ వైరల్‌గా మారింది. -
అజ్ఞాతవాసిలో అందుకే నటించలేదు : సునీల్
సాక్షి, హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్‌ల సెల్యులాయిడ్ ‘అజ్ఞాతవాసి’ చిత్రంలో నటించకపోవడానికిగల కారణాలు ఏమిటో ప్రముఖ తెలుగు హీరో సునీల్ చెప్పారు. హాస్య నటుడిగా చిత్ర రంగంలోకి అడుగుపెట్టిన ఆయన సొంతకాళ్లపై నిలబడి హీరోగా రాణిస్తున్నారు. ఆయన హీరోగా నటించిన ‘టూ కంట్రీస్’ చిత్రం శుక్రవారం(డిసెంబర్ 29) విడుదల కాబోతోంది. ఎన్.శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మనీషారాజ్ కథానాయికగా నటించింది. దీంతో సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ అజ్ఞాతవాసి చిత్రంలో నటించకపోవడానికి కారణాలు చెప్పారు. తమ మధ్య చర్చలు జరిగాయని, అప్పటికే స్క్రిప్ట్ పూర్తయిందని, ఆ సినిమాలో తన పాత్ర ఆశించినట్లుగా తీర్చిదిద్దడం సాధ్యం కాలేదన్నారు. అందుకే నటించలేదని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి హాస్యనటుడిగా కూడా చేస్తానని, అలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలో కూడా సినిమా చేస్తానని స్పష్టం చేశారు. ‘త్రివిక్రమ్ ఇప్పుడు వరల్డ్ కప్ ఆడుతున్నాడు. మనం అప్పట్లో గల్లీ క్రికెట్ ఆడాం కదా, మళ్లీ ఆడుదాం రా అని నేను పిలవకూడదు. త్రివిక్రమ్ మార్కెట్ అంతకంతకూ పెరుగుతోంది. త్రివిక్రమ్ సినిమా ఎంత ఆలస్యమైతే అంత మేలు’అని సునీల్ చెప్పారు. -
‘అజ్ఞాతవాసి’ లో పాట పాడిన పవన్ కల్యాణ్
-
‘కొడుకా కోటేశ్వర్రావు..’ అంటోన్న పవన్ కల్యాణ్!
సాక్షి, సినిమా : అతను ఆగర్భశ్రీమంతుడు.. అయినా సరే ఆడంబరాలకుపోడు! రాకుమారుడైనా కఠినరాతిపై పవళించేందుకు వెనుకాడడు!! అతనికి పేదలంటే ప్రాణం. పేదలను దోచుకునే పెద్దలంటే అసహ్యం. ఆ భావనలోనుంచి పుట్టుకొచ్చిన ఆవేశం పాటలా మారితే? అవును, తన అప్‌కమింగ్ మూవీ ‘అజ్ఞాతవాసి’ కోసం ‘పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పాడిందిగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోన్న పాట సరిగ్గా అలానే ఉంది. ‘అజ్ఞాతవాసి’ తనదైన శైలిలో డబ్బున్న మారాజులను దెప్పిపొడుస్తున్నట్లుగా ఉన్న ఆ పాట.. ‘‘కొడుకా కోటేశ్వర్రావు.. బంగళాలు వదిలేసి బైటికొచ్చి చూడరా..’ అని మొదలవుతుంది. ‘కొడుకా కోటేశ్వర్రావు.. కారులోంచి బైటికొచ్చి కళ్లు తెరిచి చూడరా..’ తరహాలో కొనసాగుతుంది. అయితే ఒరిజినల్ పాట ఇదేనా, కాదా అన్న విషయం తేలాలంటే డిసెంబర్ 31 వరకు ఆగాల్సిందే. ‘అజ్ఞాతవాసి’ కోసం పీకే పాడిన ప్రత్యేక గీతాన్ని నూతన సంవత్సరం కానుకగా డిసెంబర్ 31న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. పవన్ చాలా ఏళ్లుగా తన సినిమాల్లో ఒకటీ అరా పాటలు పాడుతుండటం, వాటికి విపరీతమైన ఆదరణ లభిస్తుండటం తెలిసిందే. ఇంతకుముందు త్రివిక్రమ్-పవన్ కాంబినేషన్లో వచ్చిన ‘అత్తారింటికి దారేది’లో ‘కాటమరాయుడా..’ పాట ఏరేంజ్‌లో హిట్టైందీ విదితమే. ఇక మరికొద్దిరోజుల్లో విడుదలయ్యే కొత్త పాటపైనా అంచనాలు చాలానే ఉన్నాయి. పవన్ 25వ సినిమా ‘అజ్క్షాతవాసి’ జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. కీర్తి సురేశ్, అను ఇమ్మానుయెల్ ఈ సినిమాలో హీరోయిన్లు. అనిరుథ్ స్వరపర్చిన పాటలు ఇప్పటికే సంచలనం సృష్టిస్తున్నాయి. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పవన్ అజ్ఞాతవాసి.. షాకింగ్ న్యూస్!
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా జనవరి 10న విడుదలకు సిద్ధమవుతోన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘అజ్ఞాతవాసి’ సినిమా పైరసీ బారినపడింది. న్యాచురల్ స్టార్ నానీ ‘ఎంసీఏ’ కూడా పైరసీ అయిన సినిమాల జాబితాలో ఉంది. ఈ విషయమై అజ్ఞాతవాసి, ఎంసీఏ సినిమాల నిర్మాతలు రాధాకృష్ణ, దిల్ రాజులు బుధవారం హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. విడుదలకు సిద్ధంగా ఉన్న రెండు పెద్దసినిమాలు పైరసీ బారిన పడటంతో టాలీవుడ్లో కలకలం రేగింది. గతంలోనూ పవన్-త్రివిక్రమ్ కాబినేషన్లో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ సినిమా విడుదలకు ముందే పైరసీ బారిన పడిన సంగతి తెలిసిందే. దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు : ‘ఎంసీఏ’ పైరసీకారులపై ఫిర్యాదు చేసేందుకు సీసీఎస్ కార్యాలయానికి వచ్చిన నిర్మాత దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘నా ఎంసీఏ సినిమాను విడుదలకు ముందే పైరసీ చేస్తామని కొందరు బెదిరిస్తున్నారు. డబ్బుల కోసం డిమాండ్ చేస్తున్నారు. ఇంతకుముందు జవాన్ సినిమా అప్పుడు కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాను’’ అని దిల్ రాజు చెప్పారు. పైరసీల వల్ల దాదాపు ఇండస్ట్రీకి ఏటా వెయ్యికోట్ల మేర నష్టం జరుగుతోందని అంచనా. ప్రభుత్వానికి దాదాపు వందకోట్ల ఆదాయానికి గండిపడిందని విశ్లేషకుల అంచనా. -
పవన్‌లో నటవిశ్వరూపం చూస్తారు: త్రివిక్రమ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అజ్ఞాతవాసి సినిమా ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో నేడు (డిసెంబర్ 19) ఘనంగా జరుగింది. పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యూల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను 2018 జనవరి 10న రిలీజ్ చేయనున్నారు. దీనిని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. అనిరుధ్ బాణీలు అందించారు. ఈ సినిమాలో 5పాటలు మాత్రమే ఉన్నాయనుకుంటే పొరపాటే.. ఇందులో పవర్‌స్టార్ కూడా ఒక పాట పాడారు. అది కొత్త సంవత్సరం కానుకగా అభిమానులకు డిసెంబర్ 31న రిలీజ్ చేయనున్నారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ.. చిత్ర యూనిట్ మొత్తాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. పవన్‌తో కథ గురించి కేవలం రెండు నిమిషాలే చెప్పానన్నారు, ఈ సినిమాలో పవన్‌లో ‘నటవిస్వరూపం’ చూస్తారని చెప్పారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. అభిమానించే ప్రతి ఒక్కరినే గుండెల్లో పెట్టుకోవాలని ఉందని, సినిమాల ద్వారా మీ అందరికి చేరువైనందుకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఖుషి తరువాత చేసిన ఐదు సినిమాల తరువాత సినిమాలకి దురమవుదామనుకున్నానని చెప్పారు. కానీ అభిమానుల ప్రేమే నన్ను సినిమాల్లో ఉంచిందన్నారు. నేను ఎపుడూ ఓటమికి భయపడలేదని, గెలుపుకి పొంగిపోలేదని అన్నారు. నేను కష్టాల్లో ఉన్నపుడు నా వెన్నుతట్టి గుండెల్లో ధైర్యాన్ని నింపిన వ్యక్తి త్రివిక్రమ్ అని పొగిడారు. నా గుండె ఎప్పుడూ మీకోసం కొట్టుకుంటుందని, మీ ప్రేమాభిమానాలు నాకు ఎల్లపుడూ.. ఉండాలని కోరుకుంటూ జైహింద్ అని ముగించారు. -
ఒక్క పర్యటన.. రెండు లాభాలు.!
సాక్షి, హైదరాబాద్ : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై సినీ విమర్శకుడు మహేశ్ కత్తి మరోసారి విమర్శలు గుప్పించాడు. ఇటీవలే పవన్ కళ్యాణ్‌పై ప్రశ్నల వర్షానికి స్వల్ప విరామం ప్రకటించి.. అంతా అభిమానుల చేతుల్లోని ఉందని హెచ్చరించిన మహేశ్ కత్తి.. తన విమర్శల పర్వాన్ని మళ్లీ ప్రారంభించాడు. సోమవారం ‘ఒక సినిమాలో పక్కన మనిషి చెప్పులు మొయ్యాలి. మోకాలు భక్తితో పెట్టి మెట్లెక్కించే మరో సేవకుడు ఇంకో సినిమాలో... చేగువేరా ఎక్కడికి పోయాడో... ఈ బానిస ఫ్యూడల్ భావజాలాన్ని పెంపొందించే కమ్యూనిస్టు ఎవరో... హతవిధి! ఏమిటీ మీమాంస?, అజ్ఞాతవాసికి అగ్న్యాతవాసికి తేడా ఉంది త్రివిక్రమ్ గారూ!’అంటూ ‘అజ్ఞాతవాసి’ సినిమాపై వ్యంగ్యాస్త్రాలు విడిచిన ఆయన తాజాగా పవన్ కళ్యాణ్ పర్యటన అటు చంద్రబాబుకు, ఇటు పవన్ ‘అజ్ఞాతవాసి’ సినిమాకు కలిసొచ్చిందన్నాడు. ‘స్వామికార్యం స్వకార్యం అంటే జనాలు ఫీల్ అయ్యారుగాని, టీజర్‌కి వచ్చిన రెస్పాన్స్. ఇప్పుడు ఆడియో ఫంక్షన్ పాస్‌ల కోసం కొట్టుకుంటున్న విధానం చూస్తుంటే, పవన్ కళ్యాణ్ పర్యటన అటు చంద్రబాబుకు ఇటు కళ్యాణ్ బాబుకు ఇద్దరికీ వర్కౌట్ అయినట్లేగా! ఒకే దెబ్బకి రెండు పిట్టలు. రాజకీయానికి రాజకీయం. సినిమాకి సినిమా. కొన్ని కోట్ల ప్రమోషన్ ఆటోమేటిక్ గా జరిగిపోతేను!’ అని ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. కొద్దిరోజులుగా పవన్ అభిమానులకు మహేశ్ కత్తికి సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. మహేశ్ కత్తి మరోసారి ఫైర్ అవ్వడానికి పవన్ అభిమానులే కారణమణని ఆయన ఫాలోవర్స్ భావిస్తున్నారు. -
పవన్ అజ్ఞానవాసి: కత్తి మహేష్
సాక్షి, హైదరాబాద్ : సినీ విమర్శకుడు మహేశ్ కత్తి.. జనసేన పార్టీ అధ్యక్షుడు, హీరో పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ సినిమాపై సోషల్ మీడియాలో కామెంట్లు పోస్ట్ చేశారు. ఇప్పటివరకు కేవలం రాజకీయంగా మాత్రమే పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేసిన మహేష్ కత్తి తాజాగా `అజ్ఞాతవాసి` గురించి విమర్శలు చేశారు. ‘ఒక సినిమాలో పక్కన మనిషి చెప్పులు మొయ్యాలి. మోకాలు భక్తితో పెట్టి మెట్లెక్కించే మరో సేవకుడు ఇంకో సినిమాలో... చేగువేరా ఎక్కడికి పోయాడో... ఈ బానిస ఫ్యూడల్ భావజాలాన్ని పెంపొందించే కమ్యూనిస్టు ఎవరో... హతవిధి! ఏమిటీ మీమాంస?’ , ‘అజ్ఞాతవాసికి అగ్న్యాతవాసికి తేడా ఉంది త్రివిక్రమ్ గారూ!’ అంటూ తన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఇటీవల విడుదలైన టీజర్‌ను బేస్ చేసుకుని ‘అజ్ఞానవాసి’ పేరుతో ఒక వీడియోను పోస్ట్ చేశారు. `అజ్ఞాతవాసి` టీజర్ ఓ హాలీవుడ్ సినిమాకు కాపీ అని అర్థం వచ్చేలా ఉందని మరో పోస్ట్ పెట్టారు. 2008లో వచ్చిన హాలీవుడ్ సినిమా `లార్జో వించ్` అనే సినిమా ట్రైలర్‌ను తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేసి, `ఎందుకైనా మంచిది.. ఈ సినిమాను బాగా చూసి గుర్తు పెట్టుకోండి` అని పోస్ట్ చేశారు. గత కొద్దిరోజులుగా కత్తి మహేశ్, పవన్ అభిమానుల మధ్య మాటల యుద్దం నడుస్తోన్న విషయం తెలిసిందే. -
జెంటిల్ మెన్ పవన్ కళ్యాణ్ కు థాంక్స్
సాక్షి, సినిమా : త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా రూపొందిన 'అజ్ఞాతవాసి' చిత్రంలో సీనియర్ హీరోయిన్ ఖుష్బూ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖుష్బూ స్వయంగా చిత్ర యూనిట్ కు స్పెషల్ థాంక్స్ తెలియజేశారు. తను ఇలాంటి వైవిధ్యమైన పాత్రలకోసమే ఇన్నాళ్లు ఎదురుచూశానని ట్వీట్ చేసింది. 'ఇలాంటి మంచి పాత్రలు చేసేందుకే ఇన్నాళ్లు వెయిట్ చేశాను. నాపై ఇంత నమ్మకం ఉంచిన త్రివిక్రమ్ కు థ్యాంక్స్. పక్కా జెంటిల్ మేన్ పవన్ కల్యాణ్ కు, హారిక-హాసిని బ్యానర్ కు ధన్యవాదాలు.' తన అజ్ఞాతవాసి పోస్టర్ ను ఖుష్బూ ట్వీట్ చేసింది. రేపు జరిగే ఆడియో లాంచ్ లో ఆమె క్యారెక్టర్ పై మరింత క్లారిటీ రానుంది. 'అత్తారింటికి దారేది' సినిమాలో నదియా పాత్రను త్రివిక్రమ్ ఎంత పవర్ ఫుల్ గా తీర్చిదిద్దారో, ఈ సినిమాలో ఖుష్బూ పాత్రను అదే స్థాయిలో మలిచారని ప్రచారం జరుగుతోంది. ఈ నెల 19వ తేదీన ఆడియో వేడుక జరుపుకుని, వచ్చేనెల 10వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కీర్తి సురేశ్ అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఖుష్బూతోపాటు ఆది పినిశెట్టి కూడా ఓ కీలక పాత్ర పోషించాడు. I am glad I waited this long..Wanted to do something really worth giving my time to..thank you #Trivikram for having faith in me n your smiles..thank you @PawanKalyan for being a through gentleman n giving me the space to be me..n thank you @haarikahassine for being such a gem.❤ pic.twitter.com/4R37MdC27z — khushbusundar (@khushsundar) 17 December 2017 -
‘అజ్ఞాతవాసి’ వచ్చేశాడు..
సాక్షి, హైదరాబాద్ : అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ సినిమా టీజర్ వచ్చేసింది. పెద్దగా మాటల్లేని టీజర్.. మెలోడియస్ మ్యూజిక్‌తో ఆకట్టుకుంది. టీజర్లో చక్కని లుక్స్‌తో కనిపించిన పవన్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేస్తున్నారు. మధురా.. అని ప్రారంభమయ్యే పాట టీజర్ మొత్తం సాగుతుంది. చివర్లో పవన్.. ‘ఓ మై గాడ్’ అనే ఒక్కమాట మాత్రమే టీజర్లో ఉంది. కీర్తి సురేష్ పవన్ బుగ్గలు లాగే సన్నివేశం చిలిపిగా ఉంది. కాగా, అజ్ఞాతవాసి ఆడియో ఈ నెల 19వ తేదీన విడుదల కానుంది. ‘అజ్ఞాతవాసి’లో కీర్తి సురేశ్‌తోపాటు అను ఇమ్మాన్యుయేల్ మరో కథానాయికగా నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. అనిరుధ్ బాణీలు అందిస్తున్నారు. జనవరి 10న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ బ్లాక్‌బస్టర్స్ తర్వాత పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తోన్న చిత్రమిది. -
‘అజ్ఞాతవాసి’ వచ్చేశాడు..
-
పవర్ స్టార్ అభిమానులకు శుభవార్త
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అజ్ఞాత వాసి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా కావటంతో అజ్ఞాతవాసిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా చిత్రయూనిట్ కూడా అంచనాలను పెంచేస్తోంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ తో పాటు రెండు పాటలు కూడా రిలీజ్ అయ్యాయి. రిలీజ్ కూడా నెల రోజులే ఉండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచారు చిత్రయూనిట్. ఈ నెల 19న ఆడియో వేడుకను అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ లోగా ఫ్యాన్స్ కు ఓ సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు పవన్. డిసెంబర్ 16న టీజర్ ను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా టీజర్ ను రూపొందిస్తున్నారట. పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యూల్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. త్రివిక్రమ్ హోం బ్యానర్ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. -
‘పవన్ ఫస్ట్ లుక్ కన్నా శిరీష్ ఫస్ట్ లుక్ బెట్టర్’
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అజ్ఞాతవాసి సినిమా టైటిల్ లోగోతో పాటు ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అజ్ఞాతవాసి ఫస్ట్ లుక్‌పై రామ్‌గోపాల్ వర్మ తనదైన రీతిలో స్పందించారు. తన ట్విట్టర్లో ‘ నేను పవన్ కళ్యాణ్‌కు వీరాభిమానిని. అయితే, ఒక్క క్షణం ఫస్ట్ లుక్ చాలా అద్భుతంగా ఉంది. పీఎస్పీకే 25 ఫస్ట్ లుక్ కంటే ఒక్క క్షణం ఫస్ట్ లుక్ మిలియన్స్ టైమ్స్ బెట్టర్ అని‘ వర్మ ట్విట్ చేశారు. ఈ సారి అల్లు శిరీస్ పవన్ కళ్యాణ్‌పై పైచేయి సాధించాడని కూడా ఆ ట్విట్లో పేర్కొన్నారు వర్మ. వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక్క క్షణం చిత్రంలో హీరో అల్లు శిరీష్, హీరోయిన్ సురభిలు నటిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అజ్ఞాతవాసి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యూల్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను 2018 జనవరి 10న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తొలిసారిగా తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ స్వరాలందిస్తున్న ఈ సినిమాలో పవన్ ఓ మాస్ పాటను ఆలపించారన్న ప్రచారం జరుగుతోంది. -
నమష్కారం... నమస్కారం!
‘అందరికీ నమష్కారం.. నా పేరు...’ అంటూ తెలుగు రాని హీరోయిన్లు స్టేజీల మీద ముద్దు ముద్దుగా పలికే మాటలు వింటుంటాం. కొంతమంది తక్కువ సమయంలోనే ‘నమస్కారం’ అనడం నేర్చేసుకుంటారు. ఏకంగా తమ పాత్రకు డబ్బింగ్ కూడా చెప్పేసుకుంటారు. ఆ లిస్టులో ఇటీవల కీర్తీ సురేశ్ చేరారు. ఇప్పుడు అనూ ఇమ్మాన్యుయేల్ కూడా. పవన్ కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘అజ్ఞాతవాసి’. కీర్తీ సురేశ్, అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. ఈ సినిమా కోసం ఇటీవల కీర్తీ డబ్బింగ్ చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు అనూ ఇమ్మాన్యుయేల్. ‘‘తొలిసారిగా నా పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నాను. ఇది ‘అజ్ఞాతవాసి’ సినిమాతో సార్ట్ అయినందుకు సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు అను. ఈ చిత్రాన్ని జనవరి 10న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించారు. అనూ చిలక పలుకులు అప్పుడు వినొచ్చన్న మాట. -
'అజ్ఞాతవాసి' ఆడియో వచ్చేస్తోంది..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అజ్ఞాతవాసి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యూల్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను 2018 జనవరి 10న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల టైటిల్ లోగోతో పాటు ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేసిన చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. రిలీజ్ సమయం దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ ఆడియో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పటికే సినిమాలోని ఒక పాటను రిలీజ్ చేసిన త్రివిక్రమ్ టీం, త్వరలో పూర్తి ఆడియో రిలీజ్ ను గ్రాండ్ గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. తొలిసారిగా తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ స్వరాలందిస్తున్న ఈ సినిమాలో పవన్ ఓ మాస్ పాటను ఆలపించారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అజ్ఞాతవాసి ఆడియో కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా డిసెంబర్ 18న ఆడియో వేడుకను అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.