
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అజ్ఞాతవాసి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యూల్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను 2018 జనవరి 10న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల టైటిల్ లోగోతో పాటు ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేసిన చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచింది.
రిలీజ్ సమయం దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ ఆడియో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పటికే సినిమాలోని ఒక పాటను రిలీజ్ చేసిన త్రివిక్రమ్ టీం, త్వరలో పూర్తి ఆడియో రిలీజ్ ను గ్రాండ్ గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. తొలిసారిగా తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ స్వరాలందిస్తున్న ఈ సినిమాలో పవన్ ఓ మాస్ పాటను ఆలపించారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అజ్ఞాతవాసి ఆడియో కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా డిసెంబర్ 18న ఆడియో వేడుకను అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment