Trivikraman Srinivas
-
Guntur Kaaram Review: ‘గుంటూరు కారం’ మూవీ రివ్యూ
టైటిల్: గుంటూరు కారం నటీనటులు: మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరీ, జగపతి బాబు, రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్, రావు రమేష్, ఈశ్వరీరావు, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్ తదితరులు నిర్మాణ సంస్థ: హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మాత: ఎస్ రాధాకృష్ణ(చినబాబు) రచన, దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాటోగ్రఫి: మనోజ్ పరమహంస, పీఎస్ వినోద్ సంగీతం:తమన్ ఎడిటింగ్: నవీన్ నూలి విడుదల తేది: జనవరి 12, 2024 కథేంటంటే.. జనదళం పార్టీ అధినేత వైరా వెంకట సూర్య నారాయణ(ప్రకాశ్ రాజ్) కూతురు వైరా వసుంధర(రమ్యకృష్ణ) మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికవుతుంది. కూతుర్ని మంత్రి చేయాలని సూర్య నారాయణ భావిస్తాడు. అదే సమయంలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కాటా మధు(రవి శంకర్) కూడా మంత్రి పదవి ఆశిస్తాడు. తనను కాదని కూతురికి మంత్రి పదవి ఇస్తే.. ఆమెకు రెండో పెళ్లి అయిన విషయాన్ని.. అలాగే మొదటి భర్తతో కలిగిన సంతానం గురించి బయటపెడతా అని బెదిరిస్తాడు. అయినా కూడా కుతూరినే మంత్రి చేస్తాడు సూర్యనారాయణ. ముందుచూపుగా వసుంధర మొదటి కొడుకు వీర వెంకట రమణ అలియాస్ రమణ(మహేశ్ బాబు)ను పిలిపించి తల్లితో తనకు ఎలాంటి సంబంధం లేదని రాసిన బాండ్ పేపర్స్ మీద సంతకం పెట్టించాలని ప్రయత్నిస్తాడు. అయితే రమణ మాత్రం సంతకం చేయడానికి అంగీకరించడు. తండ్రి రాయల్ సత్యం(జయరామ్) చెప్పినా వినకుండా.. గుంటూరులోనే ఉంటూ మిర్చి యార్డ్‌ని నడిపిస్తుంటాడు. అసలు వసుంధర మొదటి భర్త రాయల్ సత్యంకు ఎందుకు విడాకులు ఇచ్చింది? పదేళ్ల కొడుకును వదిలేసి రెండో పెళ్లి ఎందుకు చేసుకుంది? పాతికేళ్ల కొడుకు ఇంటి ముందుకు వచ్చినా.. చూడడానికి ఎందుకు నిరాకరించింది? అముక్త మాల్యద అలియాస్ అమ్ము(శ్రీలీల)తో రమణ ఎలా లవ్‌లో పడ్డాడు? మరదలు మరదలు రాజి (మీనాక్షి చౌదరి) పాత్ర ఏమిటి? చివరకు రమణ తల్లి ప్రేమను ఎలా పొందాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. త్రివిక్రమ్ సినిమాల్లో బంధాలు, భావోద్వేగాలది ప్రధాన పాత్ర ఉంటుంది. కథంతా ఓ ప్యామిలీ చుట్టూ తిరుగుతుంది. గుంటూరు కారం సినిమా కూడా అదే పంథాలో సాగుతుంది. అనుకోకుండా జరిగిన ఓ ప్రమాదం కారణంగా చెల్ల చెదురైన ఓ మంచి కుటుంబం.. మళ్లీ ఎలా కలిసింది? దూరమైన తల్లి, కొడుకు చివరకు ఎలా దగ్గరయ్యారు అనేది ఈ సినిమా కథ. ఇలాంటి కథలు తెలుగు తెరకు కొత్తేమి కాదు... ఇంకా చెప్పాలంటే త్రివిక్రమ్ శ్రీనివాసే ఈ తరహా కాన్సెప్ట్‌లో సినిమాలను తెరకెక్కించాడు. అల.. వైకుంఠపురములో, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి సినిమాల తాలుకు ఛాయలు ఇందులో కనిపిస్తాయి. అంతేకాదు త్రివిక్రమ్ సంభాషణల్లోనూ కొత్తదనం కొరవడింది. అయితే కామెడీ విషయంలో మాత్రం ఎక్కడ తగ్గలేదు. పంచ్ డైలాగ్స్, పరుగులు పెట్టించే స్క్రీన్‌ప్లేతో బోర్ కొట్టించకుండా కథనాన్ని నడిపించాడు. సినిమా ప్రారంభంలోనే అసలు కథ ఏంటి? కథనం ఎలా సాగబోతుందనేది రివీల్ చేసేశాడు. మహేశ్ బాబు ఎంట్రీ అదిరిపోతుంది.తనదైన కామెడీ టైమింగ్‌తో ఇరగదీశాడు. ఇక ‘నాది నెక్లెస్ గొలుసు’ పాటకు మహేశ్, శ్రీలీల వేసే స్టెప్పులు ఫ్యాన్స్‌ని అలరిస్తాయి. ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ ఎపిసోడ్, ఎమోషనల్ సీన్ ఆకట్టుకుంటుంది. హీరోకి తల్లి ఎందుకు దూరమైందనే విషయాన్ని మాత్రం ఫస్టాఫ్‌లో రివీల్ చేయకుండా సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ.. సెకండాఫ్‌పై ఆసక్తి పెంచేలా చేశాడు. ఫస్టాఫ్‌లో కథేమి ఉండడు. ‘కిటికిలో నుంచి చూసే నాన్న.. తలుపులు మూసుకునే అమ్మ.. రోడ్డు మీద తిరిగే కొడుకు’ సింపుల్‌గా చెప్పాలంటే ఇదే ఫస్టాఫ్ కథ. ఇక సెకండాఫ్ కాస్త హిలేరియస్‌గా సాగుతుంది. లేడిస్‌తో హీరో చేసే యాక్షన్ ఎపిసోడ్, అజయ్ క్యారెక్టర్‌తో పండించే కామెడీ బాగానే వర్కౌట్ అయింది. అయితే సినిమాకు ముగింపు ఎలా ఉంటుందో ముందే ఊహించొచ్చు. చెప్పుకోవడానికి పెద్ద ట్విస్టులు కూడా లేవు. తల్లి కొడుకులు విడిపోయేలా పన్నాగం పన్నిన వ్యక్తి, దానికి గల కారణం ఏంటనేది చివరి వరకు పసిగట్టకుండా జాగ్రత్త పడ్డాడు. చివర్లో తల్లి-కొడుకు( రమ్యకృష్ణ- మహేశ్‌బాబు) మధ్య జరిగే సంభాషణలు హృదయాలను హత్తుకుంటాయి. కొడుకుని ఎందుకు దూరం పెట్టారనేది కూడా కన్విన్సింగ్‌గానే అనిపిస్తుంది. ఎవరెలా చేశారంటే.. రమణ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేశాడు మహేశ్ బాబు. యాక్షన్‌తో పాటు డ్యాన్స్ కూడా ఇరగదీశాడు. డైలాగ్ డెలివరీలోనూ కొత్తదనం చూపించాడు. తెరపై స్టైలీష్‌గా కనిపించాడు. అమ్ము పాత్రలో శ్రీలీల ఒదిగిపోయింది. ఎప్పటి మాదిరే డ్యాన్స్ ఇరగదీసింది. చీరకట్టులో తెరపై చాలా అందంగా కనిపించింది. ఇక వైరా వసుంధరగా రమ్యకృష్ణ మరోసారి గుర్తిండిపోయే పాత్రలో నటించింది. ఫస్టాఫ్‌లో ఆమె పాత్ర సాదాసీదాగా ఉన్నప్పటికీ.. సెకండాఫ్‌లో మాత్రం తనదైన నటనతో ఆకట్టుకుంది. హీరో మరదలుగా మీనాక్షి చౌదరి నిడివి తక్కువే అయినా ఉన్నంతలో చక్కగా నటించింది. జగపతి బాబు, రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్, రావు రమేష్, ఈశ్వరీరావు, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. తమన్ సంగీతం బాగుంది. పాటలతో పాటు మంచి నేపథ్య సంగీతాన్ని అందించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. ఏదేమైనా గుంటూరు కారం ఘాటు మాత్రం కాస్త తగ్గిందనే చెప్పాలి. -
అల్లు అర్జున్ కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇప్పటి వరకు జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో వంటి సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే. తాజాగా మాటల మాంత్రిక్రుడు త్రివిక్రమ్ కాంబోలో భారీ పాన్ ఇండియా చిత్రం రానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. చాలా రోజుల నుంచి వీరిద్దరి కాంబోలో నాలుగో చిత్రం రానుందని ప్రచారం జరిగింది. (ఇదీ చదవండి: ఆమెకు దూరంగా ఉండాలంటూ సోనూసూద్‌కు సలహాలిస్తున్న ఫ్యాన్స్) దీనిని నిజం చేస్తూ తాజాగా గీతా ఆర్ట్స్ , హారికా- హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా అల్లు అర్జున్- త్రివిక్రమ్‌లతో సినిమా నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. నిర్మాత నాగవంశీ కూడా ఈ సినిమాకు సంబంధించి ట్వీట్ చేశారు. నేడు (జులై 3)న ఉదయం 10 గంటల 8 ని.లకు వీడియో ద్వారా వారు మూవీకి సంబంధించి అప్డేట్ ఇచ్చారు. ఇప్పటికే పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న బన్నీకి ఈ సినిమా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో అతిపెద్ద ప్రాజెక్టులలో ఒకటిగా ఉంటుందని సమాచారం. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను చిత్రబృందం త్వరలో ప్రకటించనుంది. We are elated to reunite the much celebrated duo. It's the Icon Star @alluarjun garu & our Darling Director #Trivikram garu coming together for the 4th time 🤩🌟 More Details Soon 🖤 #AlluAravind #SRadhaKrishna @haarikahassine @geethaarts pic.twitter.com/xO7P05IBgY — Naga Vamsi (@vamsi84) July 3, 2023 -
మహేష్ బాబు మూవీ నుంచి శ్రీలీల అవుట్
-
టాలీవుడ్ లో సంక్రాంతి సందడి
-
SSMB28 షూటింగ్ మళ్ళీ వాయిదా..!
-
ఫ్యాన్స్ కి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మహేష్ బాబు
-
త్రివిక్రమ్ కి ఏమైంది ..?
-
మహేశ్ కోసం ‘కోబ్రా’ విలన్‌ను రంగంలోకి దింపిన త్రివిక్రమ్?
సూపర్ స్టార్ మహేశ్ బాబు తన తదుపరి చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేయబోతున్న సంగతి తెలిసిందే. మహేశ్ 28వ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం ప్రీప్రోడక్షన్, స్క్రిప్ట్ వర్క్‌ను జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి రానుంది. చెప్పాలంటే ఈ నెలలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలు కానుందని వినికిడి. ఇందుకు సంబంధించిన పనులు కూడా శరవేగంగా జరుతున్నాయట. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. చదవండి: రీసెంట్గా విడాకుల ప్రకటన.. ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్ చెప్పిన బాలీవుడ్ జంట ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రకిగాను తివిక్రమ్ మలయాళ ఇండస్ట్రీకి చెందిన ఓ విలక్షణ నటుడిని రంగంలోకి దింపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఇప్పటికే ఈ సినిమాలో విలన్‌గా కొంతమంది పేర్లు బయటకు రాగా అందులో తెలుగు నటుడు తరుణ్ పేరు కూడా వినిపించింది. అయితే ఇందులో వాస్తవం లేదని తరుణ్ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మలయాళ నటుడు రోషన్ మాథ్యూను త్రివిక్రమ్ విలన్‌గా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. రోషన్ మాథ్యూ ఎవరో కాదు .. రీసెంట్గా విడుదలైన చియాన్ విక్రమ్ 'కోబ్రా' సినిమాలోని మెయిన్ విలన్. చదవండి: విషాదం.. యువ నటి ఆత్మహత్య, వైరల్‌గా మారిన సూసైడ్ నోట్ 2015లో మాలీవుడ్‌లో నటుడిగా కెరియర్ మొదలు పెట్టిన రోషన్ అనతి కాలంలోనే విలక్షణ నటుడిగా గుర్తింపు పొందాడు. ఇక 'కోబ్రా' సినిమాతో తమిళ, తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యాడు. నాని 'దసరా' సినిమాలోను రోషన్ మాథ్యూ ఓ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రోషన్‌ను మహేశ్ మూవీలో మెయిన్ విలన్ పాత్రకి గాను త్రివిక్రమ్ తీసుకున్నాడని ఫిలిం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై ప్రకటన కూడా వెలుడనుంది. మరి ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. కాగా ఈ సినిమా మహేశ్ సరసన పూజ హెగ్డే అలరించనున్న సంగతి తెలిసిందే. -
ఓటీటీలో 'భీమ్లా నాయక్'.. ఎప్పుడు, ఎక్కడంటే
Bheemla Nayak OTT Release Date: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'భీమ్లా నాయక్'. మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సాగర్ కే చంద్ర తెరకెక్కించారు. డైరెక్టర్ త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా నిత్యామీనన్, రానాకు జోడీగా సంయుక్తా మీనన్ నటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా అభిమానులకు చిత్ర బృందం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. గత నెల 25న విడుదలైన భీమ్లా నాయక్ సరిగ్గా నెల రోజుల తర్వాత ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు. మార్చి25న ఈ సినిమాను ఒకేసారి డిస్నీ+ హాట్‌స్టార్‌తో పాటు ఆహాలో రిలీజ్ చేయనున్నారు. ఇదే విషయాన్ని ట్విట్టర్లో అధికారికంగా ప్రకటించారు. కాగా మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రోజు భీమ్లా నాయక్ సైతం ఓటీటీలో విడుదల కానుంది. Vastunnadu #BheemlaNayakOnHotstar. Get ready for the ultimate battle of duty and power from 25th March. https://t.co/WpAm1tEKJc@PawanKalyan @RanaDaggubati #Trivikram @saagar_chandrak @MenenNithya @iamsamyuktha_ @MusicThaman @NavinNooli @dop007 @vamsi84 @DisneyPlusHSTel pic.twitter.com/8XDb7f27Ir — DisneyPlus Hotstar Telugu (@DisneyPlusHSTel) March 17, 2022 Next friday ee time ki, power storm mee intiki vachesthundhi. dates mark cheskondi, calendar kaaliga unchukondi. #ahaLaBheemla from March25 nundi 🔥🔥#ahaLaBheemlaFromMarch25@pawankalyan @RanaDaggubati #Trivikram @saagar_chandrak @SitharaEnts @MenenNithya @MusicThaman pic.twitter.com/eO0lEuKnZm — aha on Duty (@ahavideoIN) March 17, 2022 -
#SSMB28 : మహేశ్-త్రివిక్రమ్ కొత్త చిత్రం ప్రారంభం (ఫోటోలు)
-
దుబాయ్‌లో మహేశ్‌ను కలిసిన త్రివిక్రమ్
Mahesh Babu And Trivikram Srinivas Are Chilling At Dubai: వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నట్లు వర్క్ ఫ్రమ్ వెకేషన్ అంటున్నారు హీరో మహేశ్‌బాబు. ‘సర్కారువారి పాట’ సినిమా షూటింగ్‌కు చిన్న బ్రేక్ ఇచ్చి కొన్ని రోజులుగా ఫ్యామిలీతో కలిసి మహేశ్‌బాబు దుబాయ్ వెకేషన్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ వెకేషన్‌లోనే త్రివిక్రమ్ దర్శకత్వంలో తాను చేయనున్న సినిమాకి సంబంధించిన చర్చల్లో పాల్గొన్నారు మహేశ్. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రం గురించిన చర్చల కోసం త్రివిక్రమ్ దుబాయ్ వెళ్లారు. ఈ చర్చల్లో సంగీత దర్శకుడు తమన్, నిర్మాత సూర్యదేవర నాగవంశీ కూడా పాల్గొన్నారు. ‘‘వర్క్ అండ్ చిల్. ఉపయోగకరమైన చర్చలతో సోమవారం మధ్యాహ్నం సాగింది’’ అంటూ ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు మహేశ్‌బాబు. ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్‌లో భాగంగా మహేశ్, త్రివిక్రమ్, తమన్ దుబాయ్‌లో కలుసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ ఆరంభం కానుంది. Work and chill... productive afternoon with the team!! #TrivikramSrinivas @vamsi84 @MusicThaman #Dubai pic.twitter.com/F11xtEM0GW — Mahesh Babu (@urstrulyMahesh) December 27, 2021 -
మహేశ్ బాబు సరసన మాస్ మహారాజా హీరోయిన్
సూపర్ స్టార్ మహేశ్ బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించినప్పుటి నుంచి దీనికి సంబంధించిన అప్డేట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన మరో ఆసక్తికర అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో మహేశ్ సరసన అప్‌కమింగ్ హీరోయిన్, మోడల్, మిస్ ఇండియా మీనాక్షి చౌదరి నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ‘ఇచట వాహనములు నిలుపరాదు’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె ఇప్పటికే మాస్ మహారాజా రవితేజ ‘ఖిలాడీ’ చిత్రంలో నటించే చాన్స్ కొట్టెసింది. ఈ క్రమంలో ఆమె త్రీవిక్రమ్-మహేశ్ కాంబినేషన్లో రాబోయే చిత్రంలో సెకండ్ హీరోయిన్గా ఆమెను ఎంపిక చేసినట్లు వినికిడి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా మీనాక్షిని ‘సలార్’లో ప్రభాస్‌కు సెకండ్ హీరోయిన్గా తీసుకుంటున్నట్లు వార్తలు వినిపించాయి. ప్రస్తుతం మహేశ్, డైరెక్టర్ పరశురాంతో చేస్తున్న సర్కారు వారి పాట షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ చిత్రాన్నిసెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్గా పూజ హెగ్డే పేరు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. -
'త్రివిక్రమ్ డైరెక్షన్లో బన్నీ'..కానీ సినిమా కోసం కాదు
Allu Arjun -Trivikram For An Add Shooting: అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇప్పటి వరకు జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో వంటి హిట్ చిత్రాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే. తాజాగా మాటల మాంత్రిక్రుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో బన్నీ మరోసారి నటించారు. అయితే ఇది సినిమా కోసం కాదు.. ఓ యాడ్ షూట్ కోసం. రాపిడో బైక్ ఆన్లైన్ అగ్రిగేటర్ యూడ్ కోసం వీరిద్దరి కలిసి పనిచేశారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో దీనికి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. త్వరలోనే ఈ యాడ్ ప్రసారం కానుంది. కాగా త్రివిక్రమ్ బడా సినిమాలే కాకుండా పలు వాణిజ్య ప్రకటనలను కూడా రూపొందిస్తుంటారన్న విషయం తెలిసిందే. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్వకత్వంలో పుష్ప సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది క్రిస్మస్ నాడు ఈ సినిమా ఫస్ట్ పార్ట్ థియేటర్స్‌లో విడుదల కానుంది. చదవండి : కమెడియన్ అలీ ఇంటిని ఎప్పుడైనా చూశారా? సల్మాన్‌తో ఇప్పటికీ టచ్‌లోనే ఉంటా : సల్లు భాయ్ మాజీ ప్రేయసీ -
SSMB28: స్టోరీ అవుట్, ఆ సినిమాలో మహేశ్ పాత్రే టైటిల్!
సూపర్ స్టార్ మహేశ్ బాబు-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ‘ఎస్ఎస్ఎమ్బీ28’ చిత్రం నుంచి తాజా అప్డేట్ బయటకు వచ్చింది. ఇటీవల వీరిద్దరి కాంబోపై ఇటీవల ఆఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించిన ఎదోఒక అప్డేట్ వార్తల్లో నిలుస్తోంది. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ పక్కప్లాన్‌తో చేస్తున్న ఈ మూవీ స్టోరీలైన్, టైటిట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ‘ఎస్ఎస్ఎమ్బీ 28’ అనే వర్కింగ్ టైటిల్‌తో హరిక హాసిని బ్యానర్లో చినబాబు నిర్మిస్తున్న ఈ మూవీకి ‘పార్థు’ అనే టైటిల్‌ను ఖారారు చేశారని, ఇందులో మహేశ్ మధ్య తరగతి కటుంబానికి చెందిన యువకుడిగా కనిపించనున్నాడనే వార్త కూడా వైరల్ అవుతోంది. ఇందులో హీరో తండ్రి ఓ డాన్ అని, అది తెలియక హీరో కొన్ని పరిస్థితుల్లో తండ్రితోనే పోరాటం చేయడం జరుగుతుందట. ఇక ఆ తర్వాత అతడే తన తండ్రి అని తెలిశాక హీరో ఎలాంటి స్టేప్ తీసుకుంటానేది ఈ కథ అనే ప్రచారం జోరుగా సాగుతోంది. కాగా అతడు మూవీ మహేశ్ పాత్ర పేరు పార్థు అనే విషయం తెలిసిందే. డాన్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ తీసుకోవాలని భావిస్తున్నారట త్రివిక్రమ్. ఈ తండ్రీకొడుకుల వార్‌ను ఆసక్తికరంగా మలిచేందుకు త్రివిక్రమ్ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారట. ఇందులో మహేశ్ సరసన ఇప్పటికే పూజా హెగ్డె ఎంపికైన తెలిసిందే. మరో హీరోయిన్గా కియారా అద్వానీని తీసుకొనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం పరశురాం దర్శకత్వంతో ‘సర్కారు వారి పాట’ చిత్రంలో మహేశ్ నటిస్తున్నారు. ఇటీవల దుబాయ్ ఫస్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ కరోనా విజృంభణ కారణంగా వాయిదా పడింది. చదవండి: SSMB28: మరోసారి మహేశ్‌తో రొమాన్స్ చేయనున్న ఆ హీరోయిన్ SSMB28: వచ్చే ఏడాది సమ్మర్‌కు రానున్న క్రేజీ కాంబో -
ఫస్ట్ మహేశ్‌తోనే, ఆ తర్వాత ఎన్టీఆర్‌తో!
సూపర్ స్టార్ మహేశ్ బాబు-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ మరో క్రేజీ ప్రాజెక్ట్ సిద్దమవుతోంది. త్రివిక్రమ్‌తో ఓ మూవీ చేయనున్నట్లు మహేశ్ ఇప్పటికే పలు ఇంటర్య్వూలో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ‘మహేశ్ సర్కారు వారి పాట’ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో డైరెక్షన్లో ఓ మూవీ రూపొందాల్సి ఉంది. తాజా బజ్ ప్రకారం మహేశ్ రాజమౌళితో కంటే ముందే మాటల మాంత్రికుడితో జతకడుతున్నట్లు తెలుస్తోంది. ‘ఎస్ఎస్ఎమ్బీ28’ అనే వర్కింగ్ టైటిల్‌తో దర్శకుడు ఈ మూవీ రూపొందించేందుకు రేడి అయ్యాడట. దీంతో మహేశ్ ఫ్యాన్స్ ‘ఎస్ఎస్ఎమ్బీ28’ అనే హ్యాష్ ట్యాగ్‌ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. అంతేగాక నవంబర్ లేదా డిసెంబర్లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు కూడా తెలుస్తోంది. ఇందులో మహశ్‌కు జోడీగా మరోసారి బుట్టబోమ్మ జతకడుతోంది. ఇప్పటికే ‘మహర్షి’ మూవీలో పూజా హెగ్డె, మహేశ్‌లు జంటగా ప్రేక్షకులను అలరించారు. ఈ సారి త్రివిక్రమ్‌తో కలిసి ఈ జంట వెండితెరపై సందడి చేయనుంది. జీఎమ్ బెంటస్, హారిక హాసిన్ క్రియేషన్స్‌పై సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది. అయితే త్రివిక్రమ్ జూనీయర్ ఎన్టీఆర్‌తో కూడా ఓ చిత్రం చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీ వాయిదా పడినట్లు వార్తలు గుప్పుమనగా నిర్మాత నాగవంశీ ఈ వార్తల్లో నిజం లేదంటూ ట్వీట్ చేశాడు. కాగా త్రివిక్రమ్ మాత్రం ‘ఎన్టీఆర్30’ ప్రాజెక్ట్‌ను హోల్డ్‌లో ఉంచి ముందుగా మహేశ్ ‘ఎస్ఎస్ఎమ్బీ 28’ మూవీని పట్టాలేక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్లో టాక్. చదవండి: చూస్తుండగానే మోనాల్‌కు ముద్దు పెట్టిన కుర్ర మాస్టర్! మరో సారి మహేశ్‌తో జతకట్టనున్న పూజా? ఆ విషయంలో ఎన్టీఆర్ అసంతృప్తి.. త్రివిక్రమ్ మూవీకి బ్రేక్! -
మాటల మాంత్రికుడు, అల్లు అరవింద్‌కు కరోనా!
దేశంలో మరోసారి మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మహమ్మారి టాలీవుడ్‌కు సైతం వ్యాపించింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌లు కరోనా పాజటివ్‌గా పరీక్షించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరు హోం క్వారంటైన్లో ఉన్నారని వినికిడి. అయితే దీనిపై ఇప్పటికి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే అల్లు అరవింద్, త్రివిక్రమ్‌లు డాక్టర్ల సలహా మేరకు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారని, కరోనా నివారణకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా హీరోయిన్ నివేదా థామస్ సైతం తాజాగా కరోనా బారిన పడ్డారు.ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఆమె ట్వీట్ చేస్తూ.. ‘అందరికి నమస్తే.. నేను కరోనా పాజిటివ్‌గా పరీక్షించాను. డాక్టర్ సలహాతో అన్ని విధాల మెడికల్ ప్రోటోకాల్ పాటిస్తూ ఐసోలేషన్‌కు వెళ్లాను. ఇటీవల నన్ను కలిసి వారంత దయచేసి హోం క్వారంటైన్‌కు వెళ్లండి. ఈ కష్టకాలంలో నాకు సపోర్టుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా నా మెడికల్ టీంకు. నాపై ప్రత్యేక శ్రద్ధా చూపిస్తున్నా వారికి నిజంగా రుణపడి ఉంటాను’ అంటూ ఆమె ట్వీట్ చేశారు. pic.twitter.com/S6kh4filk3 — Nivetha Thomas (@i_nivethathomas) April 3, 2021 చదవండి: అయాన్ బర్త్‌డే: అల్లు అర్జున్ స్పెషల్ విషెస్ ఖమ్మంలో ‘బేబమ్మ’ సందడి.. ‘ఉప్పెన’లా ఎగసిపడ్డ జనం త్రివిక్రమ్ డైరెక్షన్లో ఎన్టీఆర్; మొత్తం 60 ఎపిసోడ్లు! -
వ్యవసాయం లాభసాటిగా మారాలి
‘‘జనాభా పెరిగే కొద్దీ తినేవాళ్ల సంఖ్య పెరుగుతోంది. అలాంటప్పుడు వ్యవ సాయం లాభసాటిగా మారాలి కానీ, నష్టాల్లో కూరుకుపోతోంది. దానికి పరిష్కారం చెప్పడానికి ‘శ్రీకారం’ ద్వారా ప్రయత్నం చేశాడు కిషోర్. ఈ చిత్రకథ ఆసక్తికరంగా ఉంది’’ అని డైరెక్టర్ త్రివిక్రమ్ అన్నారు. శర్వానంద్ హీరోగా కిషోర్ బి. దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్రీకారం’. రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన ఈ చిత్రం మార్చి 11న రిలీజ్ కానుంది. మిక్కీ జె. మేయర్ సంగీతం అందించిన ‘శ్రీకారం’ చిత్రంలోని టైటిల్ సాంగ్‌ని త్రివిక్రమ్ విడుదల చేశారు.‘‘నాలుగేళ్ల క్రితం షార్ట్ ఫిల్మ్ తీశాను. ‘శ్రీకారం’తో ఫ్యూచర్ ఫిల్మ్ చేశాను. ప్రతి ఒక్కర్నీ ఆలోచింపజేసే విధంగా చాలా విషయాలను ఈ సినిమాలో చూపించబోతున్నాం’’ అన్నారు బి. కిషోర్. ‘‘అత్యధిక థియేటర్స్‌లలో గ్రాండ్‌గా సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు రామ్ ఆచంట. -
జోడీ రిపీట్?
‘అరవిందసమేత వీరరాఘవ’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఎస్. రాధాకృష్ణ (చినబాబు), నందమూరి కల్యాణ్‌రామ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఇందులో కథానాయికగా ఇప్పటివరకు పూజా హెగ్డే, కియారా అద్వానీల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా ఈ చిత్రంలోని హీరోయిన్ పాత్ర కోసం శ్రుతీహాసన్ పేరు కూడా చిత్రబృందం పరిశీలిస్తోందనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. దాదాపు ఏడేళ్ల క్రితం వచ్చిన ‘రామయ్యా వస్తావయ్యా’ చిత్రంలో ఎన్టీఆర్ సరసన ఓ కథానాయికగా శ్రుతీహాసన్ నటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. మళ్లీ ఈ జోడీ కుదురుతుందా? వెయిట్ అండ్ సీ. -
ఎన్టీఆర్ చిత్రం.. పవర్ఫుల్ పొలిటీషియన్‌గా!
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో తాజాగా ఓ సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’చిత్రంతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ తర్వాత త్రివిక్రమ్ సినిమాను పట్టాలెక్కించే ఆలోచనలో ఈ నందమూరి హీరో ఉన్నారు. అయితే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ లేటేస్ట్ అప్డేట్ టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాను తెరకెక్కించాలని త్రివిక్రమ్ భావిస్తున్నారట. దీనిలో భాగంగా ఈ చిత్రంలో ఓ పవర్ ఫుల్ పొలిటీషియన్ క్యారెక్టర్ కోసం బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్‌ను చిత్రబృందం సంప్రదించిందని టాక్. అంతేకాకుండా సంజయ్ దత్‌కు త్రివిక్రమ్ వీడియో కాలింగ్ చేసి స్టోరీ నెరేట్ చేసినట్లు సమాచారం. ఎన్టీఆర్ పాత్రకు సరిసమానంగా ఉండే పవర్ ఫుల్ పాత్ర కావడంతో సంజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక త్రివిక్రమ్ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు తప్పక స్కోప్ ఉంటుంది. దీంతో ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన ఇద్దరు కథానాయికలు నటించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం బాలీవుడ్ నటి జాన్వీ కపూర్, పూజా హెగ్డేలను ఎంపిక చేశారని ఫిల్మ్‌వర్గాల సమాచారం. ప్రస్తుత రాజకీయాలను నేపథ్యంగా ఎంచుకుని తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే పేరును పరిశీలిస్తోంది చిత్రబృందం. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోల వచ్చిన ‘అరవింద సమేత వీరరాఘవ’ సూపర్ డూపర్ హిట్ సాధించడంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో నెలకొన్నాయి. ఈ సినిమాను హారికా హాసిని క్రియేషన్స్‌తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చదవండి: మరోసారి బుల్లితెరపై ఎన్టీఆర్ సందడి ‘కరోనా’ సందేశం.. పవన్, బన్నీ మిస్ -
‘అర్జున్ రెడ్డి పార్ట్-2’ అని పెట్టాను..
ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందకు వచ్చిన ‘అల.. వైకుంఠపురములో..’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రంలో సుశాంత్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుంచి డిలీట్ చేసిన ఓ సీన్‌ను చిత్ర బృందం సోషల్ మీడియాలో విడుదల చేసింది. అల్లు అర్జున్, సుశాంత్ మధ్య సాగే సన్నివేశాలను ఆ వీడియోలో చూపించారు. స్విమ్మింగ్ పూల్ వద్ద ఉన్న సుశాంత్ వద్దకు వచ్చిన బన్నీ.. తను షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నానని చెప్తాడు. సుశాంత్ మద్యం సేవిస్తున్న వీడియోని చూపించి.. దీనికి అర్జున్‌రెడ్డి పార్ట్ 2 అని పేరు పెట్టానని చెప్తాడు. దీంతో కంగారు పడిపోయిన సుశాంత్ నేనేం చేయాలి అని బన్నీని అగుడుతాడు. ఆ తర్వాత సుశాంత్ సిటీ బస్సు వెనక పరుగెడతాడు. అయితే ఈ వీడియోను చూసిన అభిమానులు ఈ సీన్ సినిమాలో పెట్టి ఉండాల్సిందని కామెంట్లు చేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ చిత్రంలో టబు, మురళీ శర్మ, సుశాంత్, సముద్రఖని, జయరామ్, నివేదా పేతురాజు ముఖ్య పాత్రల్లో నటించారు. అల్లు అరవింద్, రాధాకృష్ణ (చినబాబు)లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతమందించాడు. -
అయిననూ పోయి రావలె హస్తినకు?
‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా కోసం దర్శకుడు త్రివిక్రమ్, హీరో ఎన్టీఆర్ తొలిసారి కలిశారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. మరోసారి ఈ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుంది. హారికా హాసినీ, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై యస్. రాధాకృష్ణ, కల్యాణ్‌రామ్ ఈ సినిమాను నిర్మించనున్నారు. మే నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. 2021 ఏప్రిల్‌లో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో ఇది 30వ చిత్రం. ఈ సినిమాకు ‘అయిననూ పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని సమాచారం. కాంబినేషన్ కలవబోతున్న సంగతిని బుధవారం అధికారికంగా ప్రకటించారు. మరి టైటిల్ ఇదే షురూ అవుతుందా? వేచి చూడాలి. -
ఏప్రిల్ 8న ‘అల..వైకుంఠపురములో’
ఈ ఏడాది సంక్రాంతి బరిలోకి దిగి సంచలనాలు సృష్టిస్తోన్న చిత్రం ‘అల.. వైకుంఠపురములో’. తొలుత పాటలు సెన్సేషన్ సృష్టించగా.. ఆ తర్వాత సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్‌తో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, బుట్ట బొమ్మ పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నాన్‌బాహుబలి రికార్డులను తిరగరాస్తోంది. ఇక ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్‌ను భారీ మొత్తం చెల్లించి జెమిని టీవీ దక్కించుకున్న విషయం తెలిసిందే. కాగా, ముందుగా అనుకున్న ప్రకారం ఈ చిత్రాన్ని ఏప్రిల్ 8న డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ సన్ నెక్ట్స్‌లో ప్రసారం కానుంది. ఇక ఈ చిత్రంపై బాలీవుడ్ కన్నుపడింది. ఈ సినిమా రీమేక్ రైట్స్ ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఏకంగా రూ.8 కోట్లకు కైవసం చేసుకున్నాడని సమాచారం. అంతేకాకుండా బాలీవుడ్ రీమేక్‌లో కండలవీరుడు సల్మాన్‌ఖాన్ నటిస్తాడని సమాచారం. దక్షిణాది చిత్రాలపై మక్కువ ఎక్కువ చూపే సల్మాన్‌కు ‘అల.. వైకుంఠపురములో’స్టోరీ బాగా నచ్చడంతో ఈ సినిమా రీమేక్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అసలే వరుస పరాజయాలతో సతమతమవుతున్న సల్మాన్ ఈ రీమేక్ చిత్రం విజయం సాధించి పెడుతుందో వేచి చూడాలి. అయితే ఇక్కడే ఓ ట్విస్టు ఏర్పడింది. అయితే ఈ సినిమాను బాలీవుడ్లో నేరుగా తానే నిర్మిస్తానని అల్లు అరవింద్ భావిస్తున్నాడట. ఈ విషయంపై రాధాకృష్ణ, త్రివిక్రమ్‌లతో అల్లు అరవింద్ చర్చిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో బాలీవుడ్ రీమేక్ రైట్స్‌పై నెలకొన్న సందిగ్దత వీడాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. చదవండి: ‘సామజవరగమన’ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ ‘అల.. వైకుంఠపురములో’ మూవీ రివ్యూ -
పిట్ట కథకూ నాకూ లింక్ ఉంది
‘ఈ సినిమాతో నాకు ఓ చిన్న లింక్ ఉంది. అదేంటంటే నాకు ఈ చిత్రకథ తెలియటమే. కథ విన్నప్పుడు ఆసక్తిగా అనిపించింది. దీనికి ఎలాంటి టైటిల్ పెట్టాలి అనే ఆలోచన వచ్చినప్పుడు దర్శకుడికి రెండు, మూడు పేర్లు వచ్చాయి. వాటిలో ‘ఓ పిట్టకథ’ టైటిల్ నాకు బాగా నచ్చింది. ఇట్స్ ఎ లాంగ్ స్టోరీ అని క్యాప్షన్ పెట్టమని సలహా ఇచ్చాను. అదే ఈ సినిమాకు నా కంట్రిబ్యూషన్’’ అన్నారు దర్శకుడు త్రివిక్రమ్. చందు ముద్దు దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ సంస్థపై ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘ఓ పిట్టకథ’. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను త్రివిక్రమ్ విడుదల చేశారు. నిర్మాత ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘స్టార్ హీరోలతో చాలా కమర్షియల్ సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలు చేస్తున్నాను. అలాగే మళ్లీ కొత్తవాళ్లతో సినిమా చేద్దాం అనుకున్నప్పుడు దర్శకుడు చందు చెప్పిన చిన్న కథకు ఎగ్జయిట్ అయ్యాను. వెంటనే ఈ కథను సెట్స్ మీదకు తీసుకెళ్లాను. ఈ టైటిల్ పోస్టర్‌ను విడుదల చేసిన త్రివిక్రమ్‌కు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘కామెడీ, థ్రిల్లింగ్ అంశాలతో గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో సాగే సినిమా ఇది. షూటింగ్ పూర్తయింది. మార్చిలో సినిమాని విడుదల చేస్తాం’’ అని ఎగ్జిక్యూటివ్ నిర్మాత అన్నే రవి అన్నారు. ‘‘ఒక పల్లెటూరిలో జరిగే కథ ఇది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూనే మరోవైపు ఏం జరుగుతుందనే ఆసక్తిని రేకిత్తించే సినిమా’’ అన్నారు చందు ముద్దు. విశ్వంత్ దుద్దుంపూడి, సంజయ్రావు, నిత్యాశెట్టి తదితరులు నటించారు. -
మరోసారి త్రివిక్రమ్‌తో జూనియర్ ఎన్టీఆర్
మాటల మాంత్రికుడు, దర్శకుడు ‘త్రివిక్రమ్’ శ్రీనివాస్.. జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి మరో సినిమా చేయనున్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘అరవింద సమేత’ మంచి హిట్‌ను సంపాదించిన విషయం తెలిసిందే. మాస్ ఫాలోయింగ్ ఉన్న తారక్‌కు ఈ సినిమా మరింత ఫాలోయింగ్‌ను తీసుకు వచ్చింది. అయితే ఈ వేసవిలో మరోసారి వీరు జతకడుతున్నట్లు తెలుస్తోంది. ఇక త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన హ్యట్రిక్ మూవీ ‘అల వైకుంఠపురములో’ సైతం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్, అలియాభట్, ఒలియా ముఖ్యప్రాల్లో నటిస్తున్నారు. ఈ సినిమా అయిపోయిన వెంటనే తారక్ త్రివిక్రమ్ మూవీ షూటింగ్లో పాల్గొననున్నట్లు సమాచారం. -
‘అల.. వైకుంఠపురములో’ మ్యూజికల్ నైట్