ఏప్రిల్‌ 8న ‘అల..వైకుంఠపురములో’ | Allu Arjuns Ala Vaikunthapurramuloo Digital Platform Release Date Fix | Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌ 8న ‘అల..వైకుంఠపురములో’

Published Sun, Feb 16 2020 3:12 PM | Last Updated on Sun, Feb 16 2020 3:12 PM

Allu Arjuns Ala Vaikunthapurramuloo Digital Platform Release Date Fix - Sakshi

ఈ ఏడాది సంక్రాంతి బరిలోకి దిగి సంచలనాలు సృష్టిస్తోన్న చిత్రం ‘అల.. వైకుంఠపురములో’. తొలుత పాటలు సెన్సేషన్‌ సృష్టించగా.. ఆ తర్వాత సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ టాక్‌తో కలెక్ష​న్ల వర్షం కురిపిస్తోంది. టాలీవుడ్‌ స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, బుట్ట బొమ్మ పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నాన్‌బాహుబలి రికార్డులను తిరగరాస్తోంది. ఇక ఈ సినిమా డిజిటల్‌, శాటిలైట్‌ రైట్స్‌ను భారీ మొత్తం చెల్లించి జెమిని టీవీ దక్కించుకున్న విషయం తెలిసిందే. కాగా, ముందుగా అనుకున్న ప్రకారం ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 8న డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌ సన్‌ నెక్ట్స్‌లో ప్రసారం కానుంది. 

ఇక ఈ చిత్రంపై బాలీవుడ్‌ కన్నుపడింది. ఈ సినిమా రీమేక్‌ రైట్స్‌ ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత ఏకంగా రూ.8 కోట్లకు కైవసం చేసుకున్నాడని సమాచారం. అంతేకాకుండా బాలీవుడ్‌ రీమేక్‌లో కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ నటిస్తాడని సమాచారం. దక్షిణాది చిత్రాలపై మక్కువ ఎక్కువ చూపే సల్మాన్‌కు ‘అల.. వైకుంఠపురములో’స్టోరీ బాగా నచ్చడంతో ఈ సినిమా రీమేక్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడట. అసలే వరుస పరాజయాలతో సతమతమవుతున్న సల్మాన్‌ ఈ రీమేక్‌ చిత్రం విజయం సాధించి పెడుతుందో వేచి చూడాలి. అయితే ఇక్కడే ఓ ట్విస్టు ఏర్పడింది. అయితే ఈ సినిమాను బాలీవుడ్‌లో నేరుగా తానే నిర్మిస్తానని అల్లు అరవింద్‌ భావిస్తున్నాడట. ఈ విషయంపై రాధాకృష్ణ, త్రివిక్రమ్‌లతో అల్లు అరవింద్‌ చర్చిస్తున్నట్లు టాలీవుడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో బాలీవుడ్‌ రీమేక్‌ రైట్స్‌పై నెలకొన్న సందిగ్దత వీడాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. 

చదవండి:
‘సామజవరగమన’ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌​​​​​​​
‘అల.. వైకుంఠపురములో’ మూవీ రివ్యూ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement