
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు ఇంతవరకు టైటిల్ ను ఎనౌన్స్ చేయలేదు. పవన్ పుట్టిన రోజు సందర్భంగా చిన్న మ్యూజికల్ టీజర్ ను రిలీజ్ చేసిన యూనిట్, దీపావళికి టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తారని భావించారు. అయితే అభిమానులకు మరోసారి నిరాశే మిగిలింది.
ఇటీవల కేరళలో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర యూనిట్ త్వరలో యూరప్ వెళ్లనుందట. ప్రస్తుతం పవన్ రాజకీయ కార్యక్రమాల మీద దృష్టి పెట్టారు. ఆ తరువాత 15 రోజుల పాటు యూరప్ షెడ్యూల్ లో పాల్గొంటారు. ఈ షెడ్యూల్ పవన్, కీర్తీ సురేష్, అను ఇమ్మాన్యూల్ లపై పాటలను చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్ తో దాదాపుగా షూటింగ్ పూర్తవ్వనుందని తెలుస్తోంది. నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసి సంక్రాంతి కానుకగా 2018 జనవరి 10న సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment