చిరు కోసం 'అజ్ఞాతవాసి' స్పెషల్‌ షో‌! | Pawan kalyan Agnyaathavaasi Movie Special Show For Chiranjeevi | Sakshi
Sakshi News home page

చిరు కోసం 'అజ్ఞాతవాసి' స్పెషల్‌ షో‌!

Published Tue, Jan 2 2018 1:21 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

 Pawan kalyan Agnyaathavaasi Movie Special Show For Chiranjeevi - Sakshi

పవన్‌​ కల్యాణ్‌ హీరోగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తెరకెక్కించిన చిత్రం 'అజ్ఞాతవాసి'. ఈ సినిమా సెన్సార్‌ పనులు పూర్తి చేసుకుంది. యూ బై ఏ సర్టిఫికెట్ తో లైన్‌ క్లియర్‌ చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 10 న విడుదలకు సిద్ధమైంది. ఒక్కరోజు ముందే అంటే 9వ తేదీన యూఎస్‌లో ప్రీమియర్‌ షో పడిపోనుంది. అయితే మెగా ఫ్యామిలీ కోసం రెండు రోజుల ముందుగానే 'అజ్ఞాతవాసి' స్పెషల్‌ స్క్రీనింగ్‌ వేయనున్నట్టు సమచారం. దీంతో మెగాస్టార్‌​ చిరంజీవి ఈ సినిమా చూసి ఎలా స్పందిస్తారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ చిత్రంలో పవన్‌ సరసన కీర్తి సురేష్‌, అనూ ఇమ్మాన్యూయేల్‌ హీరోయిన్లుగా నటిస్తుండగా.. కుష్బూ, ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మరోవైపు అగ్రహీరో వెంకటేష్‌ కూడా ఓ పాత్రలో మెరవబోతున్నారనే టాక్‌ ఉంది. హారిక హాసిని క్రియేషన్స్‌లో ఎస్‌  రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్‌ సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ పవన్ కెరీర్‌లో 25వ చిత్రంగా విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement