special screening
-
13 ఏళ్ల తర్వాత కుటుంబంతో సినిమా చూశా!
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. గంభీరంగానే ఉంటూ అప్పుడప్పుడు సరదాగా వ్యవహరిస్తుంటారు. తాజాగా అక్షయ్ కుమార్ నటించిన ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ చిత్రాన్ని కుటుంబంతో పాటు వీక్షించారు అమిత్ షా. చాలా ఏళ్ల తర్వాత భార్యాపిల్లలతో కలిసి ఆయన సినిమా చూశారట ఆయన. అయితే చివర్లో జరిగిన ఓ ఘటన.. అక్కడ నవ్వులు పూయించింది. బుధవారం సాయంత్రం న్యూఢిల్లీలోని చాణక్య ఫిల్మ్ హాల్లో సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ జరిగింది. దీనికి అమిత్ షా తన కుటుంబంతో పాటు హాజరయ్యారు. దాదాపు 13 ఏళ్ల తర్వాత కుటుంబంతో అదీ థియేటర్లో ఓ సినిమా చూసినట్లు ఆయన వ్యాఖ్యానించారు. చివర్లో తన ప్రసంగం ముగిసిన వెంటనే అమిత్ షా బయటకు వెళ్తుండగా.. ఆయన భార్య సోనాల్ మాత్రం కాస్త గందరగోళానికి గురై అక్కడే అటు ఇటు చూస్తూ ఉండిపోయారు. దీంతో ‘చలియే హుకుం’ అని గాంభీర్యమైన స్వరంతో అన్నారు అమిత్ షా. ఆ మాటకు ఆమె సిగ్గుతో తలదించుకోగా.. అక్కడున్న వాళ్లంతా గోల్లున నవ్వారు. ఆ తర్వాత షా తనయుడు జై షా తన తల్లిని దగ్గరుండి తండ్రి దగ్గరకు తీసుకెళ్లాడు. ఇక సినిమా చూశాక.. సామ్రాట్ పృథ్వీరాజ్ యూనిట్‌పైనా అమిత్ షా ప్రశంసలు గుప్పించారు. భారతీయ సంప్రదాయాన్ని.. ముఖ్యంగా మహిళా సాధికారికత.. వాళ్లను గౌరవించడం గురించి సినిమాలో అద్భుతంగా చూపించారంటూ మెచ్చుకున్నారు. 2014లో భారతదేశంలో సాంస్కృతిక మేల్కొలుపు ప్రారంభమైందని, ఇది భారతదేశాన్ని ఒకప్పటిలా శిఖరాలకు తీసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారాయన. జూన్ 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
స్పెషల్ స్క్రీనింగ్: వైల్డ్ డాగ్ మామూలుగా లేదంటున్న దర్శకులు
2007లో హైదరాబాద్‌లో జరిగిన జంట పేలుళ్లకు కొన్ని కల్పిత అంశాలు జోడించి వస్తోన్న చిత్రం 'వైల్డ్‌డాగ్'. నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి 'ఊపిరి'కి కో రైటర్‌గా పని చేసిన అహిషోర్ సాల్మన్ దర్శకత్వం వహించాడు. నిరంజన్‌రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. మరో రెండు రోజుల్లో ఈ సినిమా థియేటర్లలోకి అడుగు పెడుతుండటంతో ప్రమోషన్ల స్పీడు పెంచింది చిత్రయూనిట్. ఈ క్రమంలో పలువురు టాలీవుడ్, బాలీవుడ్ దర్శకులకు స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. సినిమా చూసిన అనంతరం వారి అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకోకుండా ఉండలేకపోయారు. సినిమా మామూలుగా లేదని రాసుకొచ్చారు. ► ఇప్పుడే సినిమా చూశాను. సీటు నుంచి కదలనివ్వని థ్రిల్లర్ చిత్రమది. టాలీవుడ్లో ఇలాంటి సినిమా వస్తున్నందుకు మాకు గర్వకారణంగా ఉంది ఘాజీ దర్శకుడు సంకల్ప్ ► వైల్డ్‌డాగ్ ఎంజాయ్ చేశాను. చాలా సస్పెన్స్డ్గా ఉంది. తెర నుంచి చూపు తిప్పుకోలేకపోయాను. నాగార్జున సర్‌లో ఈ కోణం చూడలేదు. ఈ సినిమాలో ఆయన మరో లెవల్లో కనిపిస్తారు. క్షణం, కృష్ణా అండ్ హిజ్ లీలా డైరెక్టర్ రవికాంత్ పెరు ► ఊహించని కథనం, యాక్షన్ సీక్వెన్స్ సీటుకు అతుక్కుపోయేలా చేస్తాయి. ఈ సినిమాను ఎంతో అంకితభావంతో చేశారు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ డైరెక్టర్ స్వరూప్ ఆర్ఎస్జే కాగా‘వైల్డ్‌డాగ్ ఏప్రిల్ 2న విడుదల కానుంది. గతంలో నాగార్జున ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘‘వైల్డ్‌డాగ్’ కథ నాకు నచ్చడానికి కారణం ఏసీపీ విజయ్‌వర్మ క్యారెక్టర్. విజయ్ వర్మ మంచి తండ్రి, మంచి మానవతావాది, మంచి భర్త, మంచి టీమ్ లీడర్. ప్రేమించిన దానికోసం ఏమైనా చేస్తాడు. అతను ప్రేమించేది భారతదేశాన్ని. నేను చేసిన సినిమాల్లో వన్నాఫ్ ది స్ట్రాంగ్ క్యారెక్టర్స్ విజయ్ వర్మ అని చెప్పుకొచ్చాడు. ఇది ప్రయోగాత్మక చిత్రంతో పాటు ఎంటర్టైన్మెంట్ మూవీ కూడా అని చెప్పాడు. చదవండి: నాగ్ సార్ బిర్యాని తెస్తే.. ఓ పట్టుపట్టా: హీరోయిన్ ఆ వార్తాకథణం ప్రేరణతో వైల్డ్ డాగ్ కథ రాశాను -
అభిమానులతో కలిసి సినిమా చూసిన బాలయ్య
-
అనాధ పిల్లల కోసం స్పైడర్ మ్యాన్ షో
-
‘కుమార వర్మ’కు జపనీయుల జేజేలు
భారతీయ సినిమా స్టామినాను ప్రపంచానికి చాటిచెప్పిన బాహుబలికి.. భారత్‌లోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా అభిమానులు ఉన్నారు. అందులోని నటీ నటులకు కూడా అదే స్థాయిలో గుర్తింపు లభించింది. బాహుబలి 2లో కుమార వర్మ పాత్ర పోషించిన సుబ్బరాజుకు జపాన్ అభిమానులు ఫిదా అయిన సంగతి తెలిసిందే. సుబ్బరాజు పాత్ర వారిని విపరీతంగా ఆకట్టుకుంది. ఆయన కోసం సోషల్ మీడియాలో సైతం విపరీతమైన చర్చ నడించింది. ఇటీవల జపాన్ వెళ్లిన సుబ్బరాజ్‌కు అక్కడి అభిమానులు జేజేలు పలికారు. సుబ్బరాజు కూడా కుమార వర్మ వేషంలోనే బహుబలి 2 స్పెషల్ స్క్రీనింగ్‌కు వెళ్లి సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బాహుబలి టీమ్ ట్విటర్లో షేర్ చేసింది. మా కుమార వర్మపై మీ ప్రేమకు ధన్యవాదాలు.. అతని ఆనందాన్ని చూసి ఆశ్చర్యపోతున్నాం అంటూ పేర్కొంది. సుబ్బరాజు జపాన్ వెళ్లడంపై అక్కడి అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుబ్బరాజ్ కూడా వారితో ఫొటోలు దిగుతూ సందడి చేశారు. అక్కడి అభిమానుల కోరిక మేరకు బాహుబలి 2లోని కత్తితో చెక్కను రెండుగా చీల్చే సన్నివేశాన్ని సరాదాగా చేసి చూపించారు. సుబ్బరాజు జపాన్ రావడంపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని తెలియజేస్తున్నారు. ఈ చిత్రంలో బల్లాలదేవ పాత్రలో నటించిన రానా కూడా సుబ్బరాజుకు ట్విటర్లో అభినందనలు తెలిపారు. -
సుబ్బరాజుకు జపాన్ అభిమానులు ఫిదా
-
చిరు కోసం 'అజ్ఞాతవాసి' స్పెషల్ షో!
పవన్ కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన చిత్రం 'అజ్ఞాతవాసి'. ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. యూ బై ఏ సర్టిఫికెట్ తో లైన్ క్లియర్ చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 10 న విడుదలకు సిద్ధమైంది. ఒక్కరోజు ముందే అంటే 9వ తేదీన యూఎస్‌లో ప్రీమియర్ షో పడిపోనుంది. అయితే మెగా ఫ్యామిలీ కోసం రెండు రోజుల ముందుగానే 'అజ్ఞాతవాసి' స్పెషల్ స్క్రీనింగ్ వేయనున్నట్టు సమచారం. దీంతో మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా చూసి ఎలా స్పందిస్తారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ సరసన కీర్తి సురేష్, అనూ ఇమ్మాన్యూయేల్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. కుష్బూ, ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మరోవైపు అగ్రహీరో వెంకటేష్ కూడా ఓ పాత్రలో మెరవబోతున్నారనే టాక్ ఉంది. హారిక హాసిని క్రియేషన్స్‌లో ఎస్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ పవన్ కెరీర్లో 25వ చిత్రంగా విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. -
కమిటీ ముందు స్క్రీనింగ్‌కు భన్సాలీ ఓకే
సాక్షి,న్యూఢిల్లీ: పద్మావతి చుట్టూ ముసురుకున్న వివాదం కొత్త మలుపు తిరిగింది. డిసెంబర్ 1న సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొస్తున్న క్రమంలో విడుదలకు ముందు ప్రత్యేక కమిటీ కోసం మూవీని ప్రదర్శించేందుకు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ అంగీకరించినట్టు సమాచారం. చరిత్రను వక్రీకరించారని ఆరోపిస్తూ పద్మావతి మూవీపై గత కొద్దిరోజులుగా రాజ్పుట్ సంఘాలు, హిందూ సంస్థలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. చిత్రంలో అభ్యంతరకర దృశ్యాలుంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని, థియేటర్లను దగ్ధం చేస్తామని నిరసనకారులు హెచ్చరిస్తున్నారు. విడుదలకు ముందు తమకు చిత్రాన్ని ప్రదర్శించాలని డిమాండ్ చేస్తూ ముంబయిలో భన్సాలీ కార్యాలయాన్ని అఖండ్ రాజ్‌పుటానా సేవా సంఘ్ కార్యకర్తలు ముట్టడించారు. సెన్సార్‌కు వెళ్లే ముందుగానే తమకు ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాటు చేయాలని వీరు డిమాండ్ చేశారు. పద్మావతిపై నెలకొన్నవివాదాలకు స్వస్తి పలికేందుకు సినిమాను ప్రత్యేక కమిటీకి ప్రదర్శించేందుకు భన్సాలీ అంగీకరించినట్టు తెలిసింది. నవంబర్ 15 నుంచి 18 మధ్య సినిమాను తమకు ప్రదర్శిచేందుకు భన్సాలీ సిద్ధమని ఆయన తరపు ప్రతినిధులు తమకు స్పష్టం చేశారని రాజ్పుట్ సేవా సంఘ్ జాతీయ అధ్యక్షుడు మహవీర్ జైన్ వెల్లడించినట్టు మిడ్డే వెబ్సైట్ పేర్కొంది.దీపికా పదుకొనే ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకురానుంది. -
పోలీసులకు ఆహ్వానం!
ఐపీయస్ ఆఫీసర్ అంటే ఎలా ఉండాలి? చూడగానే రౌడీల గుండెల్లో గుబులు పుట్టాలి. తప్పు చేయాలనుకునేవాళ్లు హడలిపోవాలి. అలా అవ్వాలంటే ఆ ఐపీయస్ ఆఫీసర్ కండలు తిరిగిన దేహంతో ఉండాలి. చూపులు షార్ప్‌గా ఉండాలి. మీసకట్టులో పవర్ కనిపించాలి. రామ్‌చరణ్ ప్రస్తుతం అలానే కనిపిస్తున్నారు. తమిళ చిత్రం ‘తని ఒరువన్’ తెలుగు రీమేక్ ‘ధృవ’లో ఆయన ఐపీయస్ ఆఫీసర్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ ఆరంభించే ముందు కొంతమంది ఐపీయస్ ఆఫీసర్స్‌ని పర్సనల్‌గా చరణ్ కలిశారట. కొన్ని సలహాలు అడిగి తెలుసుకున్నారట. అందుకే ఈ చిత్రాన్ని పలువురు పోలీసాఫీసర్లకు చూపించాలనుకుంటున్నారట. ఎవరి దగ్గరైతే సలహాలు తీసుకున్నారో వాళ్లనే కాకుండా దక్షిణాదికి చెందిన పలు జిల్లాల్లోని ఆఫీసర్లను కూడా ఈ ప్రత్యేక షోకు ఆహ్వానించాలనుకుంటున్నారని సమాచారం. ఆఫీసర్లతో పాటు వాళ్ల కుటుంబ సభ్యులకు కూడా ఈ చిత్రాన్ని చూపించాలనుకుంటున్నారట. ఈ చిత్రాన్ని దసరాకి విడుదల చేయాలనుకున్నారు. అయితే, వాయిదా వేయాలనుకుంటున్నారన్నది తాజా సమాచారం. రాజీపడకుండా చిత్రీకరించడంవల్ల ఎక్కువ రోజులు పట్టే అవకాశం ఉందట. -
సినిమా చూసిన రాష్ట్రపతి
షూజిత్ సర్కార్ దర్శకత్వంలో రూపొంది, విమర్శకుల ప్రశంసలు అందుకున్న 'పికూ' సినిమాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చూశారు. ఆయన కోసం ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఆయనకు ఈ సినిమాతో పాటు సినిమాలో బెంగాలీ యాసలో ఉన్న హిందీ కూడా బాగా నచ్చిందని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అన్నారు. తండ్రీకూతుళ్ల మధ్య ఉండే చక్కటి అనుబంధాన్ని ఈ సినిమాలో చూపించారు. ఇందులో కూతురి పాత్ర పోషించిన దీపికా పడుకొనే.. తన సొంత జీవితాన్ని సైతం పక్కన పెట్టి, తండ్రి (అమితాబ్) చెప్పే కథలు వింటూ ఉంటుంది. ఇర్ఫాన్ ఖాన్ కూడా ఓ ముఖ్యపాత్రలో నటించిన ఈ సినిమా మే 8వ తేదీన విడుదలైంది. ఆదివారం రాత్రి రాష్ట్రపతి భవన్లో ప్రణబ్ ముఖర్జీ కోసం ఈ సినిమాను ప్రత్యేకంగాప్రదర్శించారు. ఈ విషయాన్ని అమితాబ్ బచ్చన్ తన బ్లాగులో రాశారు.