పోలీసులకు ఆహ్వానం! | Ram Charan's Dhruva special screening for police officers | Sakshi
Sakshi News home page

పోలీసులకు ఆహ్వానం!

Published Fri, Sep 9 2016 11:11 PM | Last Updated on Tue, Aug 21 2018 7:26 PM

పోలీసులకు ఆహ్వానం! - Sakshi

పోలీసులకు ఆహ్వానం!

ఐపీయస్ ఆఫీసర్ అంటే ఎలా ఉండాలి? చూడగానే రౌడీల గుండెల్లో గుబులు పుట్టాలి. తప్పు చేయాలనుకునేవాళ్లు హడలిపోవాలి. అలా అవ్వాలంటే ఆ ఐపీయస్ ఆఫీసర్ కండలు తిరిగిన దేహంతో ఉండాలి. చూపులు షార్ప్‌గా ఉండాలి. మీసకట్టులో పవర్ కనిపించాలి. రామ్‌చరణ్ ప్రస్తుతం అలానే కనిపిస్తున్నారు. తమిళ చిత్రం ‘తని ఒరువన్’ తెలుగు రీమేక్ ‘ధృవ’లో ఆయన ఐపీయస్ ఆఫీసర్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.

 సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ ఆరంభించే ముందు కొంతమంది ఐపీయస్ ఆఫీసర్స్‌ని పర్సనల్‌గా చరణ్ కలిశారట. కొన్ని సలహాలు అడిగి తెలుసుకున్నారట. అందుకే ఈ చిత్రాన్ని పలువురు పోలీసాఫీసర్లకు చూపించాలనుకుంటున్నారట.  ఎవరి దగ్గరైతే సలహాలు తీసుకున్నారో వాళ్లనే కాకుండా దక్షిణాదికి చెందిన పలు జిల్లాల్లోని ఆఫీసర్లను కూడా ఈ ప్రత్యేక షోకు ఆహ్వానించాలనుకుంటున్నారని సమాచారం.

 ఆఫీసర్లతో పాటు వాళ్ల కుటుంబ సభ్యులకు కూడా ఈ చిత్రాన్ని చూపించాలనుకుంటున్నారట. ఈ చిత్రాన్ని దసరాకి విడుదల చేయాలనుకున్నారు. అయితే, వాయిదా వేయాలనుకుంటున్నారన్నది తాజా సమాచారం. రాజీపడకుండా చిత్రీకరించడంవల్ల ఎక్కువ రోజులు పట్టే అవకాశం ఉందట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement