రామ్ చరణ్కు టాప్ హీరో డబ్బింగ్ | Ajay Devgan Dubs For Ram Charan Dhruva | Sakshi
Sakshi News home page

రామ్ చరణ్కు టాప్ హీరో డబ్బింగ్

Published Sat, Jul 22 2017 11:32 AM | Last Updated on Tue, Sep 5 2017 4:38 PM

రామ్ చరణ్కు టాప్ హీరో డబ్బింగ్

రామ్ చరణ్కు టాప్ హీరో డబ్బింగ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ సినిమా ధృవ. తమిళ సూపర్ హిట్ తనీఒరువన్ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగునాట ఘనవిజయం సాధించటమే కాదు, రికార్డ్ వసూళ్లను సాధించింది. అయితే ధృవ సినిమా డబ్బింగ్ వర్షన్ లో రామ్ చరణ్ క్యారెక్టర్ కు ఓ బాలీవుడ్ టాప్ హీరో డబ్బింగ్ చెపుతున్నాడు. త్వరలో ఓ హిందీ టీవీ ఛానల్ లో ప్రసారం కానున్న ఈ సినిమా డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి.

జంజీర్ సినిమా ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన చరణ్ సినిమాలకు బాలీవుడ్ లో మంచి ఆదరణ ఉంది. అందుకే ధృవ సినిమాలో చరణ్ క్యారెక్టర్ అజయ్ దేవగన్ డబ్బింగ్ చెప్పేందుకు అంగీకరించాడు. సినిమాలో కీలకమైన విలన్ పాత్రకు సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ డబ్బింగ్ చెపుతున్నాడు. త్వరలో ధృవ డబ్బింగ్ వర్షన్ టీవీల్లో ప్రసారం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement