చరణ్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వడట..! | Ram Charan, Sukumar Wont Miss This Dussera | Sakshi
Sakshi News home page

చరణ్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వడట..!

Published Wed, Feb 1 2017 1:40 PM | Last Updated on Tue, Sep 5 2017 2:39 AM

చరణ్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వడట..!

చరణ్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వడట..!

తన సినిమా రిలీజ్ డేట్లను ముందుగానే ప్రకటించే రామ్ చరణ్.. షూటింగ్ విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోడన్న టాక్ వినిపిస్తోంది. ఆలస్యంగా షూటింగ్ మొదలు పెట్టడంతో చరణ్ గత చిత్రాలు హడావిడిగా పూర్తి చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా గోవిందుడు అందరివాడేలే, బ్రూస్లీ చిత్రాలను అనుకున్న సమయానికి రిలీజ్ చేయడానికి చాలా కష్టపడ్డాడు చరణ్.

ఇక తాజా చిత్రం ధృవ విషయంలోనూ అదే తప్పు జరిగింది. ముందుగా ఈ సినిమాను దసరాకే రిలీజ్ చేయాలని భావించినా షూటింగ్ పూర్తి కాకపోవటంతో వాయిదా వేసి డిసెంబర్లో రిలీజ్ చేశారు. ఈ గ్యాప్లో పెద్ద నోట్ల రద్దు జరగటంతో ఆశించిన స్థాయిలో కలెక్షన్లు సాధించలేకపోయాడు. అదే ముందుగా అనుకున్నట్టుగా దసరాకే రిలీజ్ అయి ఉంటే ధృవ మరిన్ని రికార్డ్లు నమోదు చేసి ఉండేదని భావిస్తున్నారు.

దీంతో రాబోయే సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు చరణ్. మూడు నాలుగు నెలల్లో సినిమా పూర్తి చేయటం కష్టం అని భావించిన చెర్రీ, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాను ఫిబ్రవరిలోనే ప్రారంభిస్తున్నాడు. ఐదారు నెలల్లో సినిమాను పూర్తి చేసి ఎట్టి పరిస్థితుల్లో దసరాకి సినిమాను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement