ఒక్క షెడ్యూల్‌.. 40 కోట్లు! | Ram Charan Spending Huge For Action Scenes | Sakshi
Sakshi News home page

Published Thu, Jun 28 2018 1:30 PM | Last Updated on Wed, Apr 3 2019 8:51 PM

Ram Charan Spending Huge For Action Scenes - Sakshi

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్‌ కం‍పెనీ  బ్యానర్‌పై మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. చారిత్రక చిత్రం కావటంతో దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతున్నట్టుగా తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబధించిన పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. కీలకమైన ఈ సీన్స్‌ కోసం ఏకంగా 40 కోట్లు ఖర్చు చేస్తున్నారట. స్కైఫాల్‌, హ్యారీపొటర్‌ సిరీస్‌లకు యాక్షన్‌ డైరెక్టర్‌గా పనిచేసిన గ్రెగ్‌ పావెల్‌     ఈ సన్నివేశాలకు యాక్షన్‌ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. నైట్‌ ఎఫెక్ట్‌ లో షూట్‌ చేస్తున్న ఈ సీన్స్‌ కోసం భారీ గా ఖర్చుచేస్తున్నారట. చిరు సరసన నయతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, సుధీప్‌, విజయ్‌ సేతుపతి, తమన్నాలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement