2007లో హైదరాబాద్‌లో జరిగిన జంట పేలుళ్లకు కొన్ని కల్పిత అంశాలు జోడించి వస్తోన్న చిత్రం 'వైల్డ్‌డాగ్'. నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి 'ఊపిరి'కి కో రైటర్‌గా పని చేసిన అహిషోర్ సాల్మన్ దర్శకత్వం వహించాడు. నిరంజన్‌రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. మరో రెండు రోజుల్లో ఈ సినిమా థియేటర్లలోకి అడుగు పెడుతుండటంతో ప్రమోషన్ల స్పీడు పెంచింది చిత్రయూనిట్. ఈ క్రమంలో పలువురు టాలీవుడ్, బాలీవుడ్ దర్శకులకు స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. సినిమా చూసిన అనంతరం వారి అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకోకుండా ఉండలేకపోయారు. సినిమా మామూలుగా లేదని రాసుకొచ్చారు.
► ఇప్పుడే సినిమా చూశాను. సీటు నుంచి కదలనివ్వని థ్రిల్లర్ చిత్రమది. టాలీవుడ్‌లో ఇలాంటి సినిమా వస్తున్నందుకు మాకు గర్వకారణంగా ఉంది
ఘాజీ దర్శకుడు సంకల్ప్
► వైల్డ్‌డాగ్ ఎంజాయ్ చేశాను. చాలా సస్పెన్స్‌డ్‌గా ఉంది. తెర నుంచి చూపు తిప్పుకోలేకపోయాను. నాగార్జున సర్‌లో ఈ కోణం చూడలేదు. ఈ సినిమాలో ఆయన మరో లెవల్‌లో కనిపిస్తారు.
క్షణం, కృష్ణా అండ్ హిజ్ లీలా డైరెక్టర్ రవికాంత్ పెరు
► ఊహించని కథనం, యాక్షన్ సీక్వెన్స్ సీటుకు అతుక్కుపోయేలా చేస్తాయి. ఈ సినిమాను ఎంతో అంకితభావంతో చేశారు.
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ డైరెక్టర్ స్వరూప్ ఆర్‌ఎస్‌జే
కాగా‘వైల్డ్‌డాగ్ ఏప్రిల్ 2న విడుదల కానుంది. గతంలో నాగార్జున ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘‘వైల్డ్‌డాగ్’ కథ నాకు నచ్చడానికి కారణం ఏసీపీ విజయ్‌వర్మ క్యారెక్టర్. విజయ్ వర్మ మంచి తండ్రి, మంచి మానవతావాది, మంచి భర్త, మంచి టీమ్ లీడర్. ప్రేమించిన దానికోసం ఏమైనా చేస్తాడు. అతను ప్రేమించేది భారతదేశాన్ని. నేను చేసిన సినిమాల్లో వన్నాఫ్ ది స్ట్రాంగ్ క్యారెక్టర్స్ విజయ్ వర్మ అని చెప్పుకొచ్చాడు. ఇది ప్రయోగాత్మక చిత్రంతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ కూడా అని చెప్పాడు.
చదవండి: నాగ్ సార్ బిర్యాని తెస్తే.. ఓ పట్టుపట్టా: హీరోయిన్
Comments
Please login to add a commentAdd a comment