
మెగాస్టార్ చిరంజీవి తన వివాహా వార్షికోత్సవాన్ని చాలా సింపుల్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. విమానంలో తన సన్నిహితులు, స్నేహితులతో కలిసి జరుపుకున్నారు. ఫ్టైట్‌లో దుబాయ్ వెళ్తూ తమ పెళ్లి రోజును సెలబ్రేట్ చేసుకున్నామని మెగాస్టార్ ట్వీట్ చేశారు. ఈ వేడుకల్లో అక్కినేని నాగార్జున, అమల దంపతులు కూడా ఉన్నారు. తాజాగా చిరు తమ పెళ్లి రోజు వేడుకకు సంబంధించిన ఫోటోలు షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.
చిరంజీవి తన ట్వీట్‌లో రాస్తూ..' ప్రియమైన స్నేహితులతో కలిసి విమానంలో మా వివాహ వార్షికోత్సవాన్ని చాలా జరుపుకుంటున్నాం. సురేఖ లాంటి డ్రీమ్ లైఫ్ పార్ట్‌నర్ దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఆమె నా బలం, నా యాంకర్ కూడా. ప్రపంచంలోని అద్భుతమైన నాకు తెలియని వాటిని నావిగేట్ చేయడానికి ఎల్లప్పుడూ సహాయం చేస్తుంది. తను నా పక్కన ఉంటే సౌకర్యంతో పాటు అద్భుతమైన ప్రేరణ కూడా. ఈ సందర్భంగా నా సోల్‌మేట్ సురేఖకు ధన్యవాదాలు. నీ పట్ల నాకున్న ప్రేమ, అభిమానాన్ని తెలియజేయడానికి ఇలాంటివీ మరిన్నీ సందర్భాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా శుభాకాంక్షలు తెలిపిన మిత్రులు, అభిమానులు, కుటుంబ సభ్యులు, నా శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు.' అంటూ పోస్ట్ చేశారు. ఇక సినిమాల విషయానికొస్తే మెగాస్టార్ ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి బింబిసార్ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు.
Celebrating our wedding anniversary on a flight with some very dear friends
en route Dubai ! 🎉
I always feel I am very fortunate to have found a dream life partner in Surekha.
She is my strength, my anchor and the
wind beneath my wings. Always helps me navigate through the… pic.twitter.com/h4gvNuW1YY— Chiranjeevi Konidela (@KChiruTweets) February 20, 2025
Comments
Please login to add a commentAdd a comment