‘కుమార వర్మ’కు జపనీయుల జేజేలు | Subbaraju Craze In Japan At Baahubali 2 Screening | Sakshi
Sakshi News home page

‘కుమార వర్మ’కు జపనీయుల జేజేలు

Jun 29 2018 1:06 PM | Updated on Jun 29 2018 2:26 PM

Subbaraju Craze In Japan At Baahubali 2 Screening - Sakshi

భారతీయ సినిమా స్టామినాను ప్రపంచానికి చాటిచెప్పిన బాహుబలికి.. భారత్‌లోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా అభిమానులు ఉన్నారు. అందులోని నటీ నటులకు కూడా అదే స్థాయిలో గుర్తింపు లభించింది. బాహుబలి 2లో కుమార వర్మ పాత్ర పోషించిన సుబ్బరాజుకు జపాన్‌ అభిమానులు ఫిదా అయిన సంగతి తెలిసిందే. సుబ్బరాజు పాత్ర వారిని విపరీతంగా ఆకట్టుకుంది. ఆయన కోసం సోషల్‌ మీడియాలో సైతం విపరీతమైన చర్చ నడించింది. ఇటీవల జపాన్‌ వెళ్లిన సుబ్బరాజ్‌కు అక్కడి అభిమానులు జేజేలు పలికారు. సుబ్బరాజు కూడా కుమార వర్మ వేషంలోనే బహుబలి 2 స్పెషల్‌ స్క్రీనింగ్‌కు వెళ్లి సందడి చేశారు.

ఇందుకు సంబంధించిన ఫొటోలను బాహుబలి టీమ్‌ ట్విటర్‌లో షేర్‌ చేసింది. మా కుమార వర్మపై మీ ప్రేమకు ధన్యవాదాలు.. అతని ఆనందాన్ని చూసి ఆశ్చర్యపోతున్నాం అంటూ పేర్కొంది. సుబ్బరాజు జపాన్‌ వెళ్లడంపై అక్కడి అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుబ్బరాజ్‌ కూడా వారితో ఫొటోలు దిగుతూ సందడి చేశారు. అక్కడి అభిమానుల కోరిక మేరకు బాహుబలి 2లోని కత్తితో చెక్కను రెండుగా చీల్చే సన్నివేశాన్ని సరాదాగా చేసి చూపించారు.  సుబ్బరాజు జపాన్‌ రావడంపై అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా తమ ఆనందాన్ని తెలియజేస్తున్నారు. ఈ చిత్రంలో బల్లాలదేవ పాత్రలో నటించిన రానా కూడా సుబ్బరాజుకు ట్విటర్‌లో అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement