subbaraju
-
నటుడు సుబ్బరాజు పెళ్లాడిన స్రవంతి ఎవరు? బ్యాక్ గ్రౌండ్ డీటైల్స్ ఇవే! (ఫొటోలు)
-
ఎట్టకేలకు పెళ్లి చేసుకున్న సుబ్బరాజు
-
ఎట్టకేలకు పెళ్లి చేసుకున్న యాక్టర్ సుబ్బరాజు (ఫొటోలు)
-
47 ఏళ్ల వయసులో నటుడు సుబ్బరాజ్ పెళ్లి}!
టాలీవుడ్లో మరో సీనియర్ నటుడు పెళ్లి చేసుకున్నాడు. ఎన్నో సినిమాల్లో విలన్, సహాయ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న సుబ్బరాజు.. ఓ ఇంటివాడయ్యాడు. సడన్ సర్ప్రైజ్ అన్నట్లు ఏకంగా తన పెళ్లి ఫొటోని పోస్ట్ చేశాడు. బీచ్ దగ్గర పెళ్లి గెటప్లోని పిక్ షేర్ చేసి, ఫైనల్లీ పెళ్లయిపోయిందని చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: హీరో అఖిల్‌తో ప్రేమ-నిశ్చితార్థం.. ఎవరీ జైనాబ్?)ఈ క్రమంలోనే సుబ్బరాజుకి నెటిజన్లు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. అంతా బాగానే ఉంది కానీ అమ్మాయి ఎవరు? ఏంటనేది మాత్రం సుబ్బరాజు బయటపెట్టలేదు. చూస్తుంటే ఇది పెద్దల కుదిర్చిన పెళ్లిలా అనిపిస్తుంది. ఏదేమైనా 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవడం ఆసక్తికరంగా మారింది.భీమవరంకి చెందిన సుబ్బరాజు స్వతహాగా సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఓ రోజు కంప్యూటర్ రిపేర్ కోసం డైరెక్టర్ కృష్ణవంశీ ఇంటికి వెళ్లాడు. అలా నటుడు అయిపోయాడు. 2003లో ఇండస్ట్రీకి వచ్చాడు. ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో బోలెడన్ని మూవీస్ చేశాడు. కెరీర్ ప్రారంభంలో విలన్ పాత్రలు చేశాడు గానీ రీసెంట్ టైంలో మాత్రం ఫన్ రోల్స్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తున్నాడు. (ఇదీ చదవండి: 'పుష్ప' నటుడు శ్రీ తేజ్‌పై పోలీసు కేసు) View this post on Instagram A post shared by Subba Raju (@actorsubbaraju) -
రొయ్య రైతుల సమాఖ్య ఆవిర్భావం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రొయ్య రైతుల సమాఖ్య (ఏపీ పీఎఫ్ఎఫ్) ఆవిర్భవించింది. విజయవాడలో మంగళవారం జరిగిన రాష్ట్ర రొయ్య రైతుల సమావేశంలో జాతీయ రొయ్య రైతుల సమాఖ్యకు అనుబంధంగా దీనిని ఏర్పాటు చేశారు. ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా) కో–వైస్ చైర్మన్ వడ్డి రఘురామ్ సమక్షంలో నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. సమాఖ్య అధ్యక్షునిగా కె.భాస్కరరాజు (కృష్ణా), ప్రధాన కార్యదర్శిగా జీవీ సుబ్బరాజు (పశ్చిమ గోదావరి), ఉపాధ్యక్షులుగా ఎం.వెంకటేశ్వరరావు (కృష్ణా), ఆర్.నానిరాజు (అంబేడ్కర్ కోనసీమ), ఆర్గనైజింగ్ కార్యదర్శిగా డి.గోపీనాథ్ (ప్రకాశం), కోశాధికారిగా వై.వెంకటానందం (అంబేడ్కర్ కోనసీమ), సహాయ కార్యదర్శులుగా ఇ.ఇమ్మానియేల్ (బాపట్ల), యు.రాంబాబు (పశ్చిమ గోదావరి) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సమాఖ్య గౌరవ అధ్యక్షునిగా అప్సడా వైస్ చైర్మన్ వడ్డి రఘురామ్, సలహాదారులుగా జాతీయ రొయ్య రైతుల సమాఖ్య అధ్యక్షుడు ఐపీఆర్ మోహనరాజు, శ్రీనాథ్‌రెడ్డి, నాగభూషణం, సీహెచ్ సూర్యారావు, డీవీ లక్ష్మీపతిరాజు వ్యవహరిస్తారు. గతంలో ఎన్నడూలేని విధంగా గడిచిన నాలుగేళ్లుగా ఆక్వా రంగానికి, ఆక్వా రైతులకు అన్ని విధాలుగా చేయూతనిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఏపీ రొయ్య రైతుల సమాఖ్య నూతన కార్యవర్గం కృతజ్ఞతలు తెలిపింది. కాగా, రొయ్యల స్థానిక వినియోగం పెంచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే ఫ్రాన్ ఫెస్టివల్స్‌కు జిల్లా రొయ్య రైతు సంఘాల ఆధ్వర్యంలో ఉచితంగా రొయ్యలు సరఫరా చేయాలని నిర్ణయించారు. -
సునీల్ రోడ్డు మధ్యలో కారుని ఆపి డాన్సులు చేసేవాడు
-
ఎన్నో అవార్డులు తెచ్చిన జిగర్తాండ సీక్వెల్ రిలీజ్ ఎప్పుడంటే
తమిళంలో సూపర్ హిట్ సాధించిన జిగర్తాండ సినిమాను ఇప్పటికే పలు భాషల్లో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో తమిళ హీరో సిద్ధార్థ్, బాబీ సింహా ప్రధాన పాత్రల్లో నటించగా.. బాక్సాఫీసు వద్ద ఈ మూవీ కాసుల వర్షం కురిపించడమే కాకుండా ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఇక ఇదే సినిమాను తెలుగులో వరుణ్ తేజ్ హీరోగా గద్దలకొండ గణేశ్ పేరుతో తెరకెక్కింది. హరీశ్ శంకర్ దీనిని రీమెక్ చేయగా.. టాలీవుడ్లో కూడా మంచి విజయాన్ని సాధించింది. (ఇదీ చదవండి: అక్కడ మరొకరు ఉన్నా లిప్‌లాక్ చేసేదాన్ని:నటి) తాజాగా దీనికి సిక్వెల్ రెడీ చేశారు డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు. సుమారు 8 ఏళ్ల తర్వాత ఆ చిత్రానికి సీక్వెల్‌గా జిగర్తాండ డబుల్ ఎక్స్ రూపొందుతోంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తూ తన స్టోన్ బెంచ్ ఫిలింస్‌పై అలంకార్ పాండియన్‌కు చెందిన ఇన్వలియో ఆరిజిన్ సంస్థతో కలిసి నిర్మిస్తున్నారు. దీనికి కార్తికేయన్ సంతానం సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. లారెన్స్, ఎస్జే సూర్య ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని, తిరు చాయాగ్రహణ అందిస్తున్నారు. జిగర్తాండ డబుల్ ఎక్స్ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యిందని యూనిట్ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. (ఇదీ చదవండి:విజయ్ను డైరెక్ట్ చేసే లాస్ట్ ఛాన్స్ ఆ దర్శకుడికే..) ఈ సందర్భంగా మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో చిత్రం సంతృప్తికరమైన అనుభవాన్ని కలిగించిందని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెలిపారు. చిత్రాన్ని పలు ప్రాంతాల్లో భారీ వ్యయంతో రూపొందించినట్లు చెప్పారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలకు సిద్ధం అవుతున్నట్లు తెలిపారు. జిగర్తాండ డబుల్ ఎక్స్ చిత్రాన్ని దీపావళికి థియేటర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. తెలుగులో కూడా ఈ సినిమా రానుంది. -
డ్రగ్స్ కేసులో నన్ను లోపలేసినా పోయేదేం లేదు: సుబ్బరాజు
'ఖడ్గం'తో తన కెరీర్‌ను మొదలుపెట్టాడు నటుడు సుబ్బరాజు. అమ్మానాన్న ఓ తమిళమ్మాయి, శ్రీ ఆంజనేయం, చంటి.. ఇలా అనేక చిత్రాలతో పాపులారిటీ దక్కించుకున్నాడు. పోకిరి, దేశముదురు.. వంటి సినిమాలతో టాప్ హీరోలతోనూ నటించాడు. తక్కువ కాలంలోనే ప్రధాన క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎదిగాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను గురించి పంచుకున్నాడు. ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లవుతోంది. ఫిట్నెస్ను కాపాడుకుంటూ మంచి పాత్రలు చేస్తున్నాను. రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేస్తూ ఫిట్‌గా ఉంటే మంచి రోల్స్ చేయొచ్చు, లేదంటే తండ్రి పాత్రలు చేయాల్సి వస్తుంది. భీమవరంలో నాన్న డీఎన్ఏ కాలేజీలో లెక్చరర్. సైకిల్ స్పీడ్‌గా తొక్కినా కూడా ఏంటి అంత వేగంగా తొక్కుతున్నావని అడిగేవారు. చిన్నప్పుడు గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారా? అని అడుగుతుంటారు. కానీ నాకు ఫ్రెండ్సే తక్కువ, అలాంటిది గర్ల్‌ఫ్రెండ్స్ కూడానా! ప్రేమించి కొన్నాళ్లు ఆరాధించడం తప్ప అంతకుమించేమీ లేదు. పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నాకు రాలేదు, అందుకే ఇంకా వివాహం చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయాను. నాకు మంచి పాత్రలివ్వమని డైరెక్టర్లను అడగబుద్ధి కాదు. నాకు మొహమాటం ఎక్కువ. డ్రగ్స్ కేసులో చాలా డిస్టర్బ్ అయ్యాను. నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనే దానికంటే నా పేరెంట్స్ ఎఫెక్ట్ అవుతారన్న బాధ ఎక్కువైంది. వాళ్లకు ఏం చెప్పి ధైర్యం చెప్పాలి? ఇంటి తలుపు తట్టి మరీ మీ అబ్బాయి డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడంటగా అని అడుగుతారు. అయినా నన్ను ఇరికించి లోపల పడేసినా పెద్ద పోయేదేం లేదు' అని చెప్పుకొచ్చాడు సుబ్బరాజు. చదవండి: తండ్రి వైద్యం కోసం అభిమాని ఎదురుచూపులు, ఆదుకున్న బన్నీ -
అల్లు అర్జున్‌పై ట్రోల్స్, నెటిజన్ల మండిపాటు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి ట్రోల్స్ బారిన పడ్డాడు. తాజాగా బన్నీ నటించిన జోమాటో యాడ్‌పై నెటిజన్లు, సౌత్ సినీ ప్రియులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో బన్నీ చెప్పిన ఓ డైలాగ్పై సౌత్ ఇండియా సినీ ప్రేక్షకుల మండిపడుతున్నారు. ఇంతకి అసలు విసయం ఎంటంటే.. అల్లు అర్జున్ తాజాగా నటించిన ఈ కమర్షియల్ యాడ్‌లో నటుడు సుబ్బరాజు కూడా నటించిన సంగతి తెలిసిందే. చదవండి: Allu Arjun Zomato Ad: మనసు కోరితే తగ్గేదేలే.. అదరగొట్టిన అల్లు అర్జున్.. ఇందులో ఇద్దరి మధ్య ఫైటింగ్ సీన్ ఉంటుంది. ఈ ప్రకటనలో బన్నీ, సుబ్బరాజును అమాంతం గాల్లోకి ఎత్తేస్తాడు. దీంతో తనను త్వరగా కిందకు దించాలని సుబ్బరాజు అడుగుతాడు. అప్పుడు బన్నీ ‘సౌత్ సినిమా కదా. ఎక్కువ సేపు ఎగరాలి అని డైలాగ్ చెబుతాడు. ఇప్పుడు ఇదే తీవ్ర విమర్శలకు కారణమయ్యింది. ఈ డైలాగ్‌తో సౌత్ ఇండియా సినిమాలను బన్నీ కించపరిచాడంటూ సౌత్ సినీ ప్రియులు, ప్రేక్షకులు విమర్శలు గుప్పిస్తున్నారు. దక్షిణాది నుంచే స్టార్ స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్.. మూలాలు మరిచిపోతే ఎలా.. అంటూ ఓ నెటిజన్ ఈ యాడ్‌పై కామెంట్ చేశాడు. చదవండి: టాలీవుడ్ ప్రముఖుల మధ్య కోల్డ్‌వార్, వరస ట్వీట్స్‌తో మాటల యుద్ధం.. దీంతో అల్లు అర్జున్ సౌత్ సినిమాను అవమానించారంటూ.. జొమాటో యాప్‌ను అన్ఇన్స్టాల్ చేస్తున్నట్టు ట్వీట్లో మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇలా బన్నీ మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి కారణమయ్యాడు. గతంలోనూ.. బన్నీ నటించిన ఓ యాడ్ వివాదానికి కారణమైంది. రాపిడో సంస్థకు చెందిన ఈ ప్రకటనలో.. ఆర్టీసీని అవమానించారంటూ.. తీవ్ర విమర్శలు వచ్చాయి. తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా.. డైరెక్ట్ గా విమర్శలు చేశారు. ఇప్పుడు అదే బన్నీ అంబాసిడర్ గా నటించిన జొమాటో యాడ్ వంతు వచ్చింది. దీనికి ఎండ్ కార్డ్ ఎలా పడుతుంది.. బన్నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. manasu korithe, thaggedele! 🔥 @alluarjun pic.twitter.com/i30UGZEQKD — zomato (@zomato) February 4, 2022 -
మనసు కోరితే తగ్గేదేలే.. అదరగొట్టిన అల్లు అర్జున్..
ఇంతకముందు కేవలం సినిమాల వల్ల వచ్చే పారితోషికాల ద్వారా మాత్రమే సినీ నటులు డబ్బులు సంపాందించేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. సినిమాల ద్వారానే కాకుండా వ్యాపారాలు, వివిధ వాణిజ్య ప్రకటనల్లో నటించి కూడా కోట్ల సంపాదిస్తున్నారు. నిజానికి కొంతమంది తమ క్రేజ్‌ను ఉపయోగించుకొని సినిమాల కంటే కమర్షియల్ యాడ్స్‌లో నటించడం ద్వారానే ఎక్కువ ఆదాయాన్ని గడిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం టాలీవుడ్లో సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఎక్కువ వాణిజ్య ప్రకటనలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. తాజాగా మహేశ్ కోవలోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వచ్చి చేరుతున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆయన చేతికి మరో బ్రాండ్ వచ్చి చేరింది. ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జోమాటో బ్రాండ్ అంబాసిడర్‌గా బన్నీ మారారు. హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్లో ఈ యాడ్ షూట్ చేశారు. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రకటన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో బన్నీతోపాటు నటుడు సుబ్బరాజ్ కూడా కనిపించారు. చదవండి: ‘పుష్ప’ మూవీపై విరుచుకుపడ్డ గరికపాటి.. కడిగిపారేస్తా.. వీరిద్దరి మధ్య ఫైట్ సీన్ జరగుతుండగా.. బన్నీ సుబ్బరాజ్‌ను ఒక్క కిక్కుతో గాల్లోకి లేపుతాడు. ఆ షాట్ స్లో మోషన్లో ఉండగా సుబ్బరాజ్..‘బన్నీ నన్ను కొంచెం తొందరగా కింద పడేయవా.. గోంగూర మటన్ తినాలని ఉంది. కింద పడేలోగా రెస్టారెంట్లు క్లోజ్ అవుతాయి’ అని కోరగా..‘ ఎప్పుడు ఏం కావాలన్నా జొమాటో ఉందిగా’ అంటూ బన్నీ చెప్తాడు. ‘ఏం కావాలన్నా.. ఎప్పుడు కావాలన్నా జొమాటో అందిస్తుంది సూపర్ ఫాస్ట్‌గా.. మనసు కోరితే తగ్గేదేలే’ అంటూ పుష్ప స్టైల్లో బన్నీ చెప్పే డైలాగ్‌తో యాడ్ ముగుస్తోంది. ప్రస్తుతం ఈ యాడ్ నెట్టింట హల్చల్ చేస్తోంది. సుబ్బరాజ్.. బన్నీ మధ్య సంభాషణ నెటిజన్ల ముఖాలపై నవ్వులు పూయిస్తోంది. అంతేగాక ఈ యాడ్‌లో బన్నీ లుక్ సూపర్ స్టైల్లో అదిరిపోయిందనే చెప్పాలి. చదవండి: అవును ఫర్హాన్ రెండో పెళ్లి చేసుకుంటున్నాడు, ఆమె వధువు: తండ్రి క్లారిటీ manasu korithe, thaggedele! 🔥 @alluarjun pic.twitter.com/i30UGZEQKD — zomato (@zomato) February 4, 2022 -
రఘురామా కు దమ్ముంటే టీడీపీ హయాం లో అవినీతి గురించి మాట్లాడాలి
-
పెళ్లిపై కామెంట్స్.. నచ్చావ్ సుబ్బరాజు
వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ టాలీవుడ్లో తన కంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న నటుడు సుబ్బరాజు. 2003లో తెరంగేట్రం చేసిన ఈయన తొలి ఏడాదే ఖడ్గం, అమ్మనానా ఓ తమిళ అమ్మాయి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓ వైపు నెగటీవ్ రోల్స్ చేసుకుంటూనే మరోవైపు విభిన్న పాత్రలతో ఆకట్టుకుంటున్నాడు. బాహుబలిలో కుమార వర్మగా అభిమానుల గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోయే పాత్ర చేశాడు. అయితే ఆయన రియల్ లైఫ్ విషయానికొస్తే అందరికీ తెలియని నిజం ఒకటుంది. 43 ఏళ్ల వయసున్న సుబ్బరాజు ఇంకా పెళ్లి మాత్రం చేసుకోకుండా బ్యాచిలర్ గానే ఉండి పోయాడు. దీంతో అతడి పెళ్లి గురించి టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుబ్బరాజు తన పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘పెళ్లి చేసుకోవాలంటే కేవలం వయసు మాత్రమే ఆధారం కాదు. 25ఏళ్లు వచ్చాక అందరూ పెళ్లి చేసుకోవాలని అనుకుంటుండటంతో నేను కూడా అలా చేసుకోవాలి అనుకోవడం సరికాదు. జీవిత భాగస్వామికి నేను బెస్ట్ ఇవ్వగలను, ఎలాంటి లోటు రాకుండా చూసుకోగలనని నాకు అనిపించినప్పుడ మాత్రమే పెళ్లి చేసుకుంటా’అని సుబ్బరాజు పేర్కొన్నాడు. ఇక పెళ్లిపై సుబ్బరాజు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ‘ఈ వ్యాఖ్యలతో మీరు ఇంకా నచ్చారు సుబ్బరాజు గారు’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ప్రస్తుతం అనుష్క, మాధవన్, అంజలి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘నిశ్శబ్దం’ చిత్రంలో సుబ్బరాజు కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: నిఖిల్ పెళ్లి మరోసారి వాయిదా.. రాఘవ.. నువ్వు రియల్ హీరోవి var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_691245605.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మౌనం వీడారు
ఈపాటికి యూఎస్‌లో సైలెంట్‌గా ‘సైలెన్స్’ టీమ్ షూటింగ్ చేసుకుంటూ ఉండాల్సింది. కానీ జరగలేదు. ఈ విషయంపై ఇంతకాలం సైలెంట్‌గా ఉన్న టీమ్ ఇప్పుడు మౌనం వీడారు. ఈ నెలాఖర్లో షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ‘వస్తాడు నా రాజు’ ఫేమ్ హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ‘సైలెన్స్’ చిత్రం తెరకెక్కనుంది. అనుష్కా, మాధవన్, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజులతో పాటు హాలీవుడ్ యాక్టర్ మైఖేల్ మ్యాడ్సన్ ముఖ్య తారాగణంగా కోనవెంకట్, టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 24న ప్రారంభించనున్నట్లు దర్శకుడు హేమంత్ వెల్లడించారు. ఈ సినిమా షూటింగ్ అంతా ఆల్మోస్ట్ యూఎస్‌లోనే జరగుతుందని తెలిసింది. కొంతమంది అమెరిక్ యాక్టర్స్ కూడా ఈ సినిమాలో నటించనున్నారు. ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. ‘సైలెన్స్’ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
ఆ నటుడికి జపనీయుల బర్త్‌డే విషెస్
బాహుబలి సినిమాతో ప్రపంచానికి భారతీయ సినిమా సత్తాను చాటిచెప్పారు. ఈ సినిమా ప్రపంపవ్యాప్తంగా భారీ క్రేజ్‌ను సంపాదించుకుంది. ముఖ్యంగా జపాన్‌లో ఈ సినిమా రికార్డులు సృష్టించింది. ఈ సినిమాలోని హీరో, విలన్‌కే గాక.. ఓ పాత్రలో నటించిన ఆర్టిస్ట్‌కు సైతం విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. తన నటనతో అందరినీ మెప్పించిన సుబ్బరాజుకు జపాన్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. నిన్న (ఫిబ్రవరి 27) సుబ్బరాజు పుట్టినరోజు. బాహుబలితో జపాన్‌లో క్రేజ్ సంపాదించుకున్న సుబ్బరాజుకు.. అక్కడి అభిమానులు వినూత్నంగా పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలియజేశారు. వారంతా కేక్‌ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అలాగే సుబ్బరాజు కార్టూన్ బొమ్మలతో కూడిన ఫోటోలను షేర్ చేశారు. అంతేకాకుండా బోలెడన్ని గిఫ్ట్‌లను సుబ్బరాజుకు పంపించారు. వీటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో సుబ్బరాజు షేర్ చేశాడు. Thank u soo very much for this unconditional ❤️ 🙏🙏🙏🙏 pic.twitter.com/mcgaYM0k6K — subbaraju (@actorsubbaraju) February 27, 2019 Just received all the love from japan 🇯🇵 💃❤️🎁🍭 pic.twitter.com/VZpgtvSeAq — subbaraju (@actorsubbaraju) February 27, 2019 -
‘కుమార వర్మ’కు జపనీయుల జేజేలు
భారతీయ సినిమా స్టామినాను ప్రపంచానికి చాటిచెప్పిన బాహుబలికి.. భారత్‌లోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా అభిమానులు ఉన్నారు. అందులోని నటీ నటులకు కూడా అదే స్థాయిలో గుర్తింపు లభించింది. బాహుబలి 2లో కుమార వర్మ పాత్ర పోషించిన సుబ్బరాజుకు జపాన్ అభిమానులు ఫిదా అయిన సంగతి తెలిసిందే. సుబ్బరాజు పాత్ర వారిని విపరీతంగా ఆకట్టుకుంది. ఆయన కోసం సోషల్ మీడియాలో సైతం విపరీతమైన చర్చ నడించింది. ఇటీవల జపాన్ వెళ్లిన సుబ్బరాజ్‌కు అక్కడి అభిమానులు జేజేలు పలికారు. సుబ్బరాజు కూడా కుమార వర్మ వేషంలోనే బహుబలి 2 స్పెషల్ స్క్రీనింగ్‌కు వెళ్లి సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బాహుబలి టీమ్ ట్విటర్లో షేర్ చేసింది. మా కుమార వర్మపై మీ ప్రేమకు ధన్యవాదాలు.. అతని ఆనందాన్ని చూసి ఆశ్చర్యపోతున్నాం అంటూ పేర్కొంది. సుబ్బరాజు జపాన్ వెళ్లడంపై అక్కడి అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుబ్బరాజ్ కూడా వారితో ఫొటోలు దిగుతూ సందడి చేశారు. అక్కడి అభిమానుల కోరిక మేరకు బాహుబలి 2లోని కత్తితో చెక్కను రెండుగా చీల్చే సన్నివేశాన్ని సరాదాగా చేసి చూపించారు. సుబ్బరాజు జపాన్ రావడంపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని తెలియజేస్తున్నారు. ఈ చిత్రంలో బల్లాలదేవ పాత్రలో నటించిన రానా కూడా సుబ్బరాజుకు ట్విటర్లో అభినందనలు తెలిపారు. -
సుబ్బరాజుకు జపాన్ అభిమానులు ఫిదా
-
తిరుపతి కళాకారుల గిన్నిస్ రికార్డ్
తిరుపతి కల్చరల్: చిత్తూరు జిల్లా తిరుపతి కళాకారులు ఆదివారం రాత్రి గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకు న్నారు. చరిత్రాత్మక ‘అహో ఆంధ్రభోజ’ పద్యనాటకాన్ని తిరుపతి మహతి కళాక్షేత్రంలో 120 మంది కళాకారులతో ప్రద ర్శించారు. సుబ్బరాజు నాట్యకళా పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నాటకం ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమై నిరాటంకంగా 4.20 గంటల పాటు సాగింది. కార్యక్రమానికి వరల్డ్ రికార్డ్స్ ఇండియా కో–ఆర్డినేటర్ డాక్టర్ కేవీ.రమణారావు, సౌత్ ఇండియన్ కో–ఆర్డి నేటర్ డాక్టర్ తాళ్లపాక సందీప్‌కుమార్ రికార్డు ప్రతినిధులుగా వచ్చారు. తిరుపతి కళాకారుల నాటక ప్రదర్శన రికార్డును నమోదుచేశారు. అనంతరం కళాకారులకు ప్రశంసా పత్రాలు అందించారు -
నాకు తెలిసింది చెప్పా : సుబ్బరాజు
హైదరాబాద్: డ్రగ్స్ మాఫియా కేసులో మూడోరోజు సుబ్బరాజును సిట్ విచారించింది. ఈ కేసుకు సంబంధించి నోటీసులు అందుకున్న సుబ్బరాజు విచారణ నిమిత్తం శుక్రవారం అబ్కారీ కార్యాలయానికి వచ్చారు. ఆయనను సిట్ అధికారులు సుమారు 13 గంటలకు పైగా విచారించారు. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్‌తో గల సంబంధాలపై సిట్ అధికారులు ఆరా తీశారు. తమ దగ్గర ఉన్న సాక్ష్యాలను చూపించి ఆయనపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. తన దగ్గర ఉన్న సమాచారం సిట్ అధికారులతో చెప్పినట్టు సుబ్బరాజు తెలిపారు. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను. మళ్ళీ ఎప్పుడు పిలిచినా తన దగ్గర ఉన్న సమాచారం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని సుబ్బరాజు చెప్పారు. విచారణకు సుబ్బరాజు సహకరించాడని సిట్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఉస్మానియా వైద్య బృందం సుబ్బరాజుకు రెండు సార్లు వైద్య పరీక్షలు నిర్వహించింది. -
కొనసాగుతున్న సుబ్బరాజు విచారణ
హైదరాబాద్ : డ్రగ్స్ మాఫియా కేసులో మూడోరోజు సిట్ విచారణ ఇంకా కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి నోటీసులు అందుకున్న సుబ్బరాజు విచారణ నిమిత్తం ఇవాళ ఉదయం (శుక్రవారం) అబ్కారీ కార్యాలయానికి వచ్చారు. ఆయనను సిట్ అధికారులు సుమారు ఎనిమిది గంటలకు పైగా విచారణ జరుపుతున్నారు. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్‌తో గల సంబంధాలపై సిట్ అధికారులు ఆరా తీశారు. తమ దగ్గర ఉన్న సాక్ష్యాలను చూపించి ఆయనపై సిట్ అధికారులు ప్రశ్నలు వర్షం కురిపించారు. ఓ దశలో సుబ్బరాజు విచారణ ముగిసిందని వార్తలు వెలువడ్డా... మరికొన్ని గంటల పాటు సుబ్బరాజు ప్రశ్నిస్తామని ఎక్సైజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తెలిపారు. కొద్దిసేపు బ్రేక్ ఇచ్చామని, అనంతరం విచారణ కొనసాగుతుందన్నారు. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 70 పబ్‌లకు నోటీసులు ఇచ్చామని, రేపు పబ్‌లు, బార్ల యజమానులతో సమావేశం కానున్నట్లు ఆయన తెలిపారు. తమ అదుపులో ఉన్న పలువురు పబ్‌లో డ్రగ్స్ అమ్ముతున్నట్లు సమాచారం ఇచ్చారని, 16 పబ్‌ల్లో డ్రగ్స్ అమ్ముతున్నారని వాళ్లు వెల్లడించారన్నారు. రేపు నటుడు తరుణ్‌ను విచారణ చేస్తామని పేర్కొన్నారు. అలాగే ఈ నెల 27న ముమైత్ ఖాన్ విచారణకు పిలిచామన్నారు. విచారణ పూర్తయిన తర్వాతే వివరాలు వెల్లడిస్తామని అకున్ సబర్వాల్ స్పష్టం చేశారు. అంతకు ముందు ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ మాట్లాడుతూ సుబ్బరాజు విచారణకు సహకరిస్తున్నారని తెలిపారు. సుబ్బరాజును ప్రశ్నిస్తుంటే కీలక విషయాలు బయటపడుతున్నాయని, ఇవాళ కీలక విషయాలు తెలుస్తాయని భావిస్తున్నట్లు ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ అభిప్రాయపడ్డారు. డ్రగ్స్ కేసులో లోతుగా విచారణ చేయాల్సి ఉందని, ప్రత్యేక ప్రశ్నావళి ద్వారా వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. ఆ వివరాల గురించి విచారణ అనంతరం వెల్లడిస్తామన్నారు. డ్రగ్స్ మాఫియాతో టాలీవుడ్ లింకులపై ఆధారాలు లభిస్తున్నాయని, అలాగే నోటీసులు అందుకున్న ముమైత్‌ఖాన్, ఛార్మీ కూడా విచారణకు హాజరు అవుతారని ఆయన తెలిపారు. మరోవైపు సుబ్బరాజు రక్తనమునా సేకరణ కోసం ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. సిట్ అధికారులు వరుసగా నోటీసులు ఇచ్చినవారిని విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు పూరీ జగన్నాథ్, కెమెరామెన్ శ్యాం కె నాయుడును విచారణ చేశారు. శనివారం నటుడు తరుణ్ సిట్ ఎదుట హాజరు అవుతారు. -
ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడను: సుబ్బరాజు
హైదరాబాద్: డ్రగ్స్ రాకెట్ వ్యవహారంలో తన పేరు ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదని టాలీవుడ్ నటుడు సుబ్బరాజు అన్నారు. తనకు ఎన్ఫోర్స్మెంట్ విభాగం నుంచి నోటీసులు అందినట్లు ఆయన తెలిపారు. సుబ్బరాజు మీడియాతో మాట్లాడుతూ.. 'ఓ పోలీసు అధికారి ఇంటికి వచ్చి నోటీసులు నేరుగా చేతికే అందజేశారు. నాకు ఇచ్చిన నోటీసులు ఇంట్లో ఉన్నాయి. అందులో కొన్ని డ్రగ్స్ జాబితాను పేర్కొన్నారు. దాదాపు ఆరేడు రకాల డ్రగ్స్ పేర్లున్నాయి. విచారణకు ఈ నెల 21న రావాలని ఉంది. సినీ ఇండస్ట్రీకి డ్రగ్స్‌తో సంబంధాలుంటాయనే విషయం చిన్నప్పటి నుంచీ వింటున్నాను. ఇంకా చెప్పాలంటే సినీ ఇండస్ట్రీ వాళ్లకు మాత్రమే కాదు ప్రతి ఇండస్ట్రీకి డ్రగ్స్ అలవాటు ఉంటుందని' ఆయన అభిప్రాయపడ్డారు. పది మంది డ్రగ్స్ తీసుకున్నారని వారికి నోటీసులు అందాయని చెబుతున్నారు కానీ తనకు తెలిసినంత వరకు ఈ జాబితాలో ఎవరూ డ్రగ్స్ తీసుకోరని సుబ్బరాజు చెప్పారు. ఆరోగ్యం పట్ల నేను ఎంత శ్రద్ధ తీసుకుంటానో సినీ ఇండస్ట్రీలో అందరికీ తెలుసునన్నారు. ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడని తనకు డ్రగ్స్ అలవాటు చేసుకోవాల్సిన అవసరమే లేదని పేర్కొన్నారు. ఎక్స్ట్రా సంతోషం తనకు అవసరం లేదని, ప్రస్తుతం హ్యాపీగా ఉన్నట్లు చెప్పారు. ఇండస్ట్రీకి చెందిన వాళ్ల ఫోన్ నెంబర్లు చాలా మంది దగ్గర ఉంటాయని, అదే విధంగా కెల్విన్ అనే వ్యక్తి మొబైల్లో తన ఫోన్ ఫోన్ నెంబర్ ఉండే ఛాన్స్ ఉందని చెప్పారు. కెల్విన్ నుంచి డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌కు, పూరీ నుంచి ఇతరులకు డ్రగ్స్ అందాయన్న ఆరోపణలను సుబ్బరాజు కొట్టిపారేశారు. మాకు సంబంధం ఉందని భావిస్తే ఆధారాలతో ప్రూవ్ చేయాలన్నారు. వ్యవస్థకు తాను ఎప్పుడూ వ్యతిరేకంగా వెళ్లనని విచారణకు కచ్చితంగా హాజరవనున్నట్లు ఆర్టిస్ట్ సుబ్బరాజు తెలిపారు. -
మిషన్ సుబ్బారావు మనుమడు అని పిలుస్తారు
కిక్ ఇచ్చే పాత్రలను పోషించి ప్రేక్షకులను మెప్పిస్తేనే నటుడికి గుర్తింపు లభిస్తుందని సినీ క్యారెక్టర్ నటుడు సుబ్బరాజు అన్నారు. ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని శనివారం ఆయన సందర్శించారు. శ్రీవారు, అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణలో విలేకరులతో ముచ్చటించారు. మీ స్వస్థలం విశాఖపట్నం సమీపంలోని లింగరాజుపాలెం మీ సినీరంగ ప్రవేశం పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న సమయంలో దర్శకుడు కృష్ణవంశీతో పరిచయమైంది. కర్ణ సినిమాలో ఆయన నాకు టైస్ట్ పాత్ర ఇచ్చారు. దీంతో గుర్తింపు లభించింది. తర్వాత కొంతకాలం ప్రతినాయకుడు పాత్రలతో మెప్పించాను. ఇప్పటి వరకు 200 సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించాను. మీకు బాగా గుర్తింపు తెచ్చిన సినిమాలు ‘అమ్మా.. నాన్న.. ఓ తమిళమ్మాయి’ మంచి బ్రేక్ ఇచ్చింది. ఆర్య, పోకిరి, బుజ్జిగాడు, ఖలేజా సినిమాల్లో పాత్రలకు బాగా గుర్తింపు వచ్చింది. మిర్చీలో పాత్ర మరో బ్రేక్ ఇచ్చింది. కేవలం ప్రతి నాయకుడి పాత్రలే మీరు చేస్తున్నారెందుకు.. నాకు నటనంటే చాలా ఇష్టం. అలాగని హీరో పాత్ర చేయాలని లేదు. అయితే ఎన్నో పాజిటివ్ రోల్స్ కూడా చేశా. హీరో ఒక్క సినిమా చేసే సమయంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ నాలుగైదు సినిమాలు చేసే అవకాశం ఉంటుంది. మీ సినీరంగ ప్రవేశంలో కుటుంబ సభ్యుల ప్రోత్సాహం.. మా తాత మిషన్ సుబ్బారావు అంటే మా ప్రాంతంలో మంచి గుర్తింపు ఉంది. నన్ను మిషన్ సుబ్బారావు మనుమడిగా పిలుస్తారు. నా తండ్రి రామకృష్ణంరాజు, అలాగే సోదరుడు కళాశాలల్లో లెక్చరర్లుగా పనిచేస్తున్నారు. నా తల్లి గృహిణి. చిన్ననాటి నుంచి సినిమాలపై ఉన్న ఆసక్తిని గుర్తించిన మా కుటుంబం ఈ రంగంలోకి వచ్చేందుకు ప్రోత్సహించింది. మీకు నచ్చిన నటులు.. పాతతరంలో భానుమతి అంటే చాలా ఇష్టం. మా కుటుంబ సభ్యులకు సైతం ఆమె నటనంటే చాలా మక్కువ. ప్రస్తుతం పరిశ్రమలో ఉన్న పలువురి నటన నన్ను ఆకట్టుకుంటోంది.