నాకు తెలిసింది చెప్పా : సుబ్బరాజు | drugs mafia case : subbaraju quesioned by sit | Sakshi
Sakshi News home page

నాకు తెలిసింది చెప్పా : సుబ్బరాజు

Published Fri, Jul 21 2017 11:57 PM | Last Updated on Tue, Nov 6 2018 4:42 PM

నాకు తెలిసింది చెప్పా : సుబ్బరాజు - Sakshi

నాకు తెలిసింది చెప్పా : సుబ్బరాజు

హైదరాబాద్‌:
డ్రగ్స్‌ మాఫియా కేసులో మూడోరోజు సుబ్బరాజును సిట్‌ విచారించింది. ఈ కేసుకు సంబంధించి నోటీసులు అందుకున్న సుబ్బరాజు విచారణ నిమిత్తం శుక్రవారం అబ్కారీ కార్యాలయానికి వచ్చారు. ఆయనను సిట్‌ అధికారులు సుమారు 13 గంటలకు పైగా విచారించారు. డ్రగ్స్‌ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్‌తో గల సంబంధాలపై సిట్‌ అధికారులు ఆరా తీశారు. తమ దగ్గర ఉన్న సాక్ష్యాలను చూపించి ఆయనపై సిట్‌ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు.

తన దగ్గర ఉన్న సమాచారం సిట్‌ అధికారులతో చెప్పినట్టు సుబ్బరాజు తెలిపారు. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను. మళ్ళీ ఎప్పుడు పిలిచినా తన దగ్గర ఉన్న సమాచారం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని సుబ్బరాజు చెప్పారు. విచారణకు సుబ్బరాజు సహకరించాడని సిట్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఉస్మానియా వైద్య బృందం సుబ్బరాజుకు రెండు సార్లు వైద్య పరీక్షలు నిర్వహించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement