Watch: Allu Arjun New Zomato Ad Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Allu Arjun Zomato Ad: మనసు కోరితే తగ్గేదేలే.. అదరగొట్టిన అల్లు అర్జున్‌..

Published Fri, Feb 4 2022 4:45 PM | Last Updated on Fri, Feb 4 2022 6:39 PM

Watch: Allu Arjun New Zomato Ad Goes Viral On Social Media - Sakshi

ఇంతకముందు కేవలం సినిమాల వల్ల వచ్చే పారితోషికాల ద్వారా మాత్రమే సినీ నటులు డబ్బులు సంపాందించేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్‌ మారింది. సినిమాల ద్వారానే కాకుండా వ్యాపారాలు, వివిధ వాణిజ్య ప్రకటనల్లో నటించి కూడా కోట్ల సంపాదిస్తున్నారు. నిజానికి కొంతమంది తమ క్రేజ్‌ను ఉపయోగించుకొని సినిమాల కంటే కమర్షియల్‌ యాడ్స్‌లో నటించడం ద్వారానే ఎక్కువ ఆదాయాన్ని గడిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం టాలీవుడ్‌లో సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు ఎక్కువ వాణిజ్య ప్రకటనలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. తాజాగా మహేశ్‌ కోవలోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వచ్చి చేరుతున్నారు.

ఇప్పటికే  అల్లు అర్జున్‌ పలు కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆయన చేతికి మరో బ్రాండ్‌ వచ్చి చేరింది. ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జోమాటో బ్రాండ్ అంబాసిడర్‌గా బన్నీ మారారు. హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్‌లో ఈ యాడ్‌ షూట్‌ చేశారు. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రకటన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో బన్నీతోపాటు నటుడు సుబ్బరాజ్ కూడా కనిపించారు.
చదవండి: ‘పుష్ప’ మూవీపై విరుచుకుపడ్డ గరికపాటి.. కడిగిపారేస్తా..

వీరిద్దరి మధ్య ఫైట్ సీన్‌ జరగుతుండగా.. బన్నీ సుబ్బరాజ్‌ను ఒక్క కిక్కుతో  గాల్లోకి లేపుతాడు. ఆ షాట్ స్లో మోషన్‌లో ఉండగా సుబ్బరాజ్..‘బన్నీ నన్ను కొంచెం తొందరగా కింద పడేయవా.. గోంగూర మటన్‌ తినాలని ఉంది. కింద పడేలోగా రెస్టారెంట్లు క్లోజ్‌ అవుతాయి’ అని కోరగా..‘ ఎప్పుడు ఏం కావాలన్నా జొమాటో ఉందిగా’ అంటూ బన్నీ చెప్తాడు. ‘ఏం కావాలన్నా.. ఎప్పుడు కావాలన్నా జొమాటో అందిస్తుంది సూపర్ ఫాస్ట్‌గా.. మనసు కోరితే తగ్గేదేలే’ అంటూ పుష్ప స్టైల్లో బన్నీ చెప్పే డైలాగ్‌తో యాడ్ ముగుస్తోంది. ప్రస్తుతం ఈ యాడ్ నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. సుబ్బరాజ్.. బన్నీ మధ్య సంభాషణ నెటిజన్ల ముఖాలపై నవ్వులు పూయిస్తోంది. అంతేగాక ఈ యాడ్‌లో బన్నీ లుక్ సూపర్‌ స్టైల్లో అదిరిపోయిందనే చెప్పాలి.
చదవండి: అవును ఫర్హాన్‌ రెండో పెళ్లి చేసుకుంటున్నాడు, ఆమె వధువు: తండ్రి క్లారిటీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement