Allu Arjun Thanks His 7 Million Followers On Twitter, Pic Goes Viral - Sakshi
Sakshi News home page

Allu Arjun Twitter Followers: 'మీ ప్రేమకు థ్యాంక్యూ'.. అల్లు అర్జున్‌ ట్వీట్‌ వైరల్‌

Published Wed, Aug 17 2022 1:42 PM | Last Updated on Wed, Aug 17 2022 2:58 PM

Allu Arjun Thanks His 7 Million Followers On Twitter - Sakshi

పుష్ప సినిమాతో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అమాంతం పెరిపోయింది. దేశ వ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్నారాయన. తాజాగా ఆయన ట్విట్టర్‌లో 7మిలియన్‌ ఫాలోవర్లను సంపాదించుకున్నారు. ఈ సందర్భంగా తన అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ బన్నీ ట్వీట్‌ చేశాడు. కాగా ఈ ట్వీట్‌లో బన్నీ షేర్‌ చేసిన ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది.

చదవండి: బన్నీ భార్య స్నేహారెడ్డి ఫోటోపై కల్యాణ్‌ దేవ్‌ కామెంట్‌ వైరల్‌

బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫోటోలో బన్నీ యమ స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. ఇది ఒక యాడ్‌ షూట్‌ కోసం దిగిన ఫోటో అని తెలుస్తుంది. ప్రస్తుతం బన్నీ పుష్ప-2 కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. దీంతో పుష్ప-2 షూటింగ్‌ ప్రారంభం అవ్వడానికి ముందే బన్నీ ఈ యాడ్‌ షూటింగ్స్‌ అన్నీ కంప్లీట్‌ చేయనున్నట్లు తెలుస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement