Netizens Trolls On Allu Arjun Over His Comments In Zomato Advertisement - Sakshi
Sakshi News home page

Allu Arjun Zomato Ad: అల్లు అర్జున్‌పై ట్రోల్స్‌, నెటిజన్ల మండిపాటు

Published Fri, Feb 4 2022 9:21 PM | Last Updated on Sat, Feb 5 2022 9:07 AM

Netizens Troll Allu Arjun Over His Comments In Zomato Advertisement - Sakshi

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ మరోసారి ట్రోల్స్‌ బారిన పడ్డాడు. తాజాగా బన్నీ నటించిన జోమాటో యాడ్‌పై నెటిజన్లు, సౌత్‌ సినీ ప్రియులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో బన్నీ చెప్పిన ఓ డైలాగ్‌పై సౌత్‌ ఇండియా సినీ ప్రేక్షకుల మండిపడుతున్నారు. ఇంతకి అసలు విసయం ఎంటంటే.. అల్లు అర్జున్‌ తాజాగా నటించిన ఈ కమర్షియల్‌ యాడ్‌లో నటుడు సుబ్బరాజు కూడా నటించిన సంగతి తెలిసిందే.

చదవండి: Allu Arjun Zomato Ad: మనసు కోరితే తగ్గేదేలే.. అదరగొట్టిన అల్లు అర్జున్‌..

ఇందులో ఇద్దరి మధ్య ఫైటింగ్ సీన్ ఉంటుంది. ఈ ప్రకటనలో బన్నీ, సుబ్బరాజును అమాంతం గాల్లోకి ఎత్తేస్తాడు. దీంతో తనను త్వరగా కిందకు దించాలని సుబ్బరాజు అడుగుతాడు. అప్పుడు బన్నీ ‘సౌత్ సినిమా కదా. ఎక్కువ సేపు ఎగరాలి అని డైలాగ్‌ చెబుతాడు. ఇప్పుడు ఇదే తీవ్ర విమర్శలకు కారణమయ్యింది. ఈ డైలాగ్‌తో సౌత్ ఇండియా సినిమాలను బన్నీ కించపరిచాడంటూ సౌత్‌ సినీ ప్రియులు, ప్రేక్షకులు విమర్శలు గుప్పిస్తున్నారు. దక్షిణాది నుంచే స్టార్‌ స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్.. మూలాలు మరిచిపోతే ఎలా.. అంటూ ఓ నెటిజన్ ఈ యాడ్‌పై కామెంట్‌ చేశాడు.

చదవండి: టాలీవుడ్‌ ప్రముఖుల మధ్య కోల్డ్‌వార్‌, వరస ట్వీట్స్‌తో మాటల యుద్ధం..

దీంతో అల్లు అర్జున్‌ సౌత్ సినిమాను అవమానించారంటూ.. జొమాటో యాప్‌ను అన్ఇన్‌స్టాల్‌ చేస్తున్నట్టు ట్వీట్‌లో మరో నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. ఇలా బన్నీ మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి కారణమయ్యాడు. గతంలోనూ.. బన్నీ నటించిన ఓ యాడ్ వివాదానికి కారణమైంది. రాపిడో సంస్థకు చెందిన ఈ ప్రకటనలో.. ఆర్టీసీని అవమానించారంటూ.. తీవ్ర విమర్శలు వచ్చాయి. తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా.. డైరెక్ట్ గా విమర్శలు చేశారు. ఇప్పుడు అదే బన్నీ అంబాసిడర్ గా నటించిన జొమాటో యాడ్ వంతు వచ్చింది. దీనికి ఎండ్ కార్డ్ ఎలా పడుతుంది.. బన్నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement