పెళ్లిపై కామెంట్స్‌.. నచ్చావ్‌ సుబ్బరాజు | Character Artist Subbaraju Interesting Comments On Marriage | Sakshi
Sakshi News home page

అప్పుడే పెళ్లి చేసుకుంటా: సుబ్బరాజు

Published Sun, May 3 2020 7:44 PM | Last Updated on Sun, May 3 2020 8:33 PM

Character Artist Subbaraju Interesting Comments On Marriage - Sakshi

వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ టాలీవుడ్‌లో తన కంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న నటుడు సుబ్బరాజు.  2003లో తెరంగేట్రం చేసిన ఈయన తొలి ఏడాదే ఖడ్గం, అమ్మనానా ఓ తమిళ అమ్మాయి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓ వైపు నెగటీవ్‌ రోల్స్‌ చేసుకుంటూనే మరోవైపు విభిన్న పాత్రలతో ఆకట్టుకుంటున్నాడు. బాహుబలిలో కుమార వర్మగా అభిమానుల గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోయే పాత్ర చేశాడు. అయితే ఆయన రియల్‌ లైఫ్‌ విషయానికొస్తే అందరికీ తెలియని నిజం ఒకటుంది. 43 ఏళ్ల వయసున్న సుబ్బరాజు ఇంకా పెళ్లి మాత్రం చేసుకోకుండా బ్యాచిలర్ గానే ఉండి పోయాడు. దీంతో అతడి పెళ్లి గురించి‌ టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. 

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుబ్బరాజు తన పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘పెళ్లి చేసుకోవాలంటే కేవలం వయసు మాత్రమే ఆధారం కాదు. 25ఏళ్లు వచ్చాక అందరూ పెళ్లి చేసుకోవాలని అనుకుంటుండటంతో నేను కూడా అలా చేసుకోవాలి అనుకోవడం సరికాదు. జీవిత భాగస్వామికి నేను బెస్ట్‌ ఇవ్వగలను, ఎలాంటి లోటు రాకుండా చూసుకోగలనని నాకు అనిపించినప్పుడ మాత్రమే పెళ్లి చేసుకుంటా’అని సుబ్బరాజు పేర్కొన్నాడు. ఇక పెళ్లిపై సుబ్బరాజు చేసిన కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. ‘ఈ వ్యాఖ్యలతో మీరు ఇంకా నచ్చారు సుబ్బరాజు గారు’ అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశారు.  ప్రస్తుతం అనుష్క, మాధవన్‌, అంజలి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘నిశ్శబ్దం’ చిత్రంలో సుబ్బరాజు కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. 

చదవండి:
నిఖిల్‌ పెళ్లి మరోసారి వాయిదా..
రాఘవ.. నువ్వు రియల్‌ హీరోవి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement