marriage system
-
‘వేధింపుల’ చట్టానికి కళ్లెం?
మానసిక ఒత్తిళ్లకు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తారని హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాన్ కెస్లర్ చాన్నాళ్ల క్రితం ఒక అధ్యయనం సందర్భంగా తేల్చారు. మహిళలు ఆ ఒత్తిళ్ల పర్యవసానంగా విషాదంలో మునిగితే మగవాళ్లూ, పిల్లలూ ఆగ్రహావేశాలకు లోనవుతారని చెప్పారు. ఒత్తిళ్లకు స్పందించే విషయంలో పిల్లలూ, మగవాళ్లూ ఒకటేనని ఆమె నిశ్చితాభిప్రాయం. ఈ ధోరణికామె ‘ఇరిటబుల్ మేల్ సిండ్రోమ్’ అని పేరు పెట్టారు. అయితే ప్రతి ఒక్కరూ ఇలాగే ఉంటారని చెప్పలేం. బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ తన భార్యతో వచ్చిన తగాదాకు సంబంధించిన కేసుల్లో తనకూ, తన తల్లిదండ్రులకూ ఎదురైన చేదు అనుభవాలను ఏకరువు పెడుతూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. దానికి ముందు విడుదల చేసిన 90 నిమిషాల వీడియో, 24 పేజీల లేఖ ఇప్పుడు న్యాయవ్యవస్థలో సైతం చర్చనీయాంశమయ్యాయి. తనపైనా, తనవాళ్లపైనా పెట్టిన 8 తప్పుడు కేసుల్లో, వాటి వెంబడి మొదలైన వేధింపుల్లో యూపీలోని ఒక ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి ఉన్నారన్నది ఆ రెండింటి సారాంశం.బలహీనులకు జరిగే అన్యాయాలను నివారించటానికీ, వారిని కాపాడటానికీ కొన్ని ప్రత్యేక చట్టాలూ, చర్యలూ అవసరమవుతాయి. అలాంటి చట్టాలు దుర్వినియోగమైతే అది సమాజ పురోగతికి ఆటంకం కలిగిస్తుంది. ఎందుకంటే ఆ వంకన అసలైన బాధితులకు సకాలంలో న్యాయం దక్కదు సరికదా... బలవంతులకు ఆయుధంగా మారే ప్రమాదం ఉంటుంది. మహిళలపై గృహ హింస క్రమేపీ పెరుగుతున్న వైనాన్ని గమనించి 1983లో భారతీయ శిక్షాస్మృతిలో సెక్షన్ 498ఏ చేర్చారు. అనంతర కాలంలో 2005లో గృహహింస చట్టం వచ్చింది. 498ఏ సెక్షన్ గత ఏడాది తీసు కొచ్చిన భారతీయ న్యాయసంహిత (బీఎన్ఎస్)లో సెక్షన్ 84గా ఉంది. అయితే అటుతర్వాత కుటుంబాల్లో మహిళలపై హింస ఆగిందా? లేదనే చెప్పాలి. సమాజంలో కొనసాగే ధోరణులకు స్పందన గానే ఏ చట్టాలైనా వస్తాయి. ఎన్నో ఉదంతాలు చోటుచేసుకున్నాక, మరెన్నో ఉద్యమాలు జరిగాక, నలుమూలల నుంచీ ఒత్తిళ్లు పెరిగాక మాత్రమే ఎంతో ఆలస్యంగా ఇలాంటి చట్టాలు వస్తాయి. బల హీనులకు ఉపయోగపడే అటువంటి చట్టాల్ని దుర్వినియోగం చేసే వారుండటం నిజంగా బాధాకరమే.జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం 498ఏ వంటి చట్టాలు ఈమధ్యకాలంలో దుర్వినియోగమవుతున్న ఉదంతాలు పెరగటంపై ఆందోళన వ్యక్తం చేసింది. వ్యక్తిగత కక్షతో అత్తింటివారిపైనా, భర్తపైనా తప్పుడు కేసులు పెట్టే తీరువల్ల వివాహ వ్యవస్థ నాశన మవుతున్నదని వ్యాఖ్యానించింది. ఇప్పుడే కాదు... 2014లో కూడా సుప్రీంకోర్టు ఒక సంద ర్భంలో ఇలాంటి వ్యాఖ్యానమే చేసింది. ‘భర్తలపై అలిగే భార్యలకు సెక్షన్ 498ఏ రక్షణ కవచంగా కాక ఆయుధంగా ఉపయోగపడుతోంద’ని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇకపై శిక్షాస్మృతిలోని సెక్షన్ 41కి అనుగుణంగా వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే తదుపరి చర్యలకు ఉపక్రమించాలని కూడా సూచించింది. నిజమే... ఎలాంటి చట్టాలైనా నిజమైన బాధితులకు ఉపయోగపడినట్టే, అమాయకులను ఇరికించడానికి కూడా దోహదపడుతాయి. చట్టాన్ని వినియోగించేవారిలో, అమలు చేసేవారిలో చిత్తశుద్ధి కొరవడితే జరిగేది ఇదే. ఆ తీర్పు తర్వాత గత పదేళ్లుగా వేధింపుల కేసులు నత్తనడక నడుస్తున్నాయి. అందులో నిజమైన కేసులున్నట్టే అబద్ధపు కేసులు కూడా ఉండొచ్చు. మనది పితృస్వామిక సమాజం కావటంవల్ల పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్దయి కుటుంబ బాధ్యతలు మీద పడేవరకూ ఏ దశలోనూ ఆడవాళ్లపై హింస మటుమాయమైందని చెప్పలేం. వాస్తవానికి ఇందులో చాలా రకాల హింసను మన చట్టాలు అసలు హింసగానే పరిగణించవు. ఆర్థిక స్తోమత, సమాజంలో హోదా వంటివి కూడా మహిళలను ఈ హింస నుంచి కాపాడలేకపోతున్నాయన్నది వాస్తవం. ఒకనాటి ప్రముఖ నటి జీనత్ అమన్, భారత్‌లో మొట్టమొదటి లేడీ ఫిట్నెస్ ట్రైనర్‌గా గుర్తింపు సాధించిన నవాజ్ మోదీలు ఇందుకు ఉదాహరణ. వీరిద్దరూ తమ భర్తల నుంచి తీవ్రమైన గృహహింసను ఎదుర్కొన్నారు. జీనత్‌కు కంటి కండరాలు దెబ్బతిని కనుగుడ్డు బయటకు రాగా, దాన్ని య«థాస్థితిలో ఉంచటానికి గత నలభైయేళ్లలో ఎన్ని సర్జరీలు చేయించుకున్నా ఫలితం రాలేదు. నూతన శస్త్ర చికిత్స విధానాలు అందుబాటులోకొచ్చి నిరుడు ఆమెకు విముక్తి దొరికింది. ఒకప్పుడు కట్టుబాట్లకు జడిసి, నలుగురిలో చులకనవుతామన్న భయంతో ఉండే మహిళలు ఉన్నత చదువుల వల్లా, వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడే అవకాశం రావటం వల్లా మారారు. వరకట్న వేధింపులు, ఇతర రకాల హింసపై కేసులు పెడుతున్నారు. ప్రశ్నిస్తున్నారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే అదే సమయంలో కొందరు దుర్వినియోగం చేస్తున్న మాట కూడా వాస్తవం కావొచ్చు. అలాంటివారిని గుర్తించటానికీ, వారి ఆట కట్టించటానికీ దర్యాప్తు చేసే పోలీసు అధికారుల్లో చిత్తశుద్ధి అవసరం. ఈ విషయంలో న్యాయస్థానాల బాధ్యత కూడా ఉంటుంది. లోటుపాట్లు తప్పనిసరిగా సరిచేయాల్సిందే. కానీ ఆ వంకన అలాంటి కేసుల దర్యాప్తులో జాప్యం చోటు చేసు కోకుండా ఇతరేతర మార్గాలపై దృష్టి సారించాలి. ఎందుకంటే ఏటా ప్రతి లక్షమంది మహిళల్లో దాదాపు ముగ్గురు వరకట్న హింసకు ప్రాణాలు కోల్పోతున్నారని నేషనల్ క్రైమ్ రికార్డుల బ్యూరో గణాంకాలు చెబుతున్నాయి. ఇది ఎంతో ఆందోళన కలిగించే విషయం. వరకట్న నిషేధ చట్టం వచ్చి 63 ఏళ్లవుతున్నా ఇదే స్థితి ఉన్న నేపథ్యంలో ప్రస్తుత చట్టాలను నీరగార్చకుండానే ఎలాంటి జాగ్రత్తలు అవసరమో ఆలోచించాలి. -
సహజీవనం పేరుతో సీజన్కొక భాగస్వామి. ఇదేం పధ్ధతి?
లక్నో: సహజీవనం పేరిట పాశ్చాత్య సంస్కృతి వెర్రితలలు వేసి భారత సంస్కృతిని వివాహ వ్యవస్థను నాశనం చేస్తోందని వ్యాఖ్యానించింది అలహాబాద్ హైకోర్టు. ఈ సందర్బంగా సీజన్ల వారీగా భాగస్వాములను మార్చుకుంటూ పోవడం ఆరోగ్యకరమైన సమాజానికి మంచిది కాదని తెలిపింది కోర్టు. అన్నీ అయిపోయాక.. అలహాబాద్‌లో అద్నాన్ అనే ఓ వ్యక్తి పరస్పర అంగీకారంతో యూపీలోని సహరాన్‌పూర్‌కు చెందిన ఓ యువతితో సహజీవనం చేశాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెతో శారీరక సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. అయితే ఆ యువతి అనూహ్యంగా గర్భం దాల్చడంతో అద్నాన్ పెళ్ళికి నిరాకరించాడు. దీంతో ఆ యువతి అలహాబాద్ హై కోర్టును ఆశ్రయించగా విచారణ సమయంలో అలహాబాద్ కోర్టు నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ సహజీవనంపై కీలక వ్యాఖ్యలు చేసింది. అంత సులువు కాదు.. ఒక వ్యక్తికి వివాహ వ్యవస్థ కల్పించినంత భద్రత కానీ సామాజిక అంగీకారం కానీ సహజీవనం కల్పించలేదని తెలిపారు అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిద్ధార్థ్. దీర్ఘకాలిక పరిణామాలపైఅవగాహనలేక యువత ఇలాంటి తప్పటడుగు వేస్తోంది. వివాహ వ్యవస్థ మనుగడలో లేని దేశాల్లో సహజీవనం సర్వసాధారణంగా మారిపోయింది కానీ ఇపుడు వారు ఈ సమస్య నుండి బయటపడి వివాహ వ్యవస్థను కాపాడటానికి నానా అవస్థలు పడుతున్నాయని అన్నారు. అయినా సీజన్ల వారీగా భాగస్వామిని మార్చడం సమాజపురోగతికి చేటు అని తెలిపారు. ఇది కూడా చదవండి: దీప్తిది హత్యే! కొలిక్కి వచ్చిన కోరుట్ల టెక్కీ కేసు -
వేరేవాళ్ల భార్యలను ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకోవచ్చు.. అది అక్కడి సంప్రదాయం
ఒక్కరి జీవితంలోనూ పెళ్లి అనేది ఒక అందమైన వేడుక. ఒక్కో దేశంలో ఒక్కో విధంగా పెళ్లిళ్లు చేసుకుంటుంటారు. మన దేశంలోనూ కులం, మతం, ప్రాంతాన్ని బట్టి ఆచార వ్యవహారాలు మారిపోతుంటాయి. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం పెళ్లిళ్లు ఎవరూ ఊహించని విధంగా జరుగుతాయి. ఆడవాళ్లు ఒక్కసారే స్నానం చేయాలి, పెళ్ళిలో విష సర్పాలను మామ అల్లుడికి కానుకగా ఇవ్వడం, వేరొకరిని భార్యను దొంగలించి పెళ్లి చేసుకోవడం ..లాంటి చిత్రవిచిత్రమైన సంప్రదాయాలు ఉన్నాయి. అలా ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దిక్కుమాలిన, వింతైన ఆచారాలు ఏంటన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ► పశ్చిమ ఆఫ్రికాలో వోడబ్బే అనే తెగ ప్రజలు పెళ్లి చేసుకోవాలనుకుంటే,లేదా అప్పటికే వివాహం అయినప్పటికీ.. వేరే వారి భార్యలను ఎత్తుకెళ్లి మరీ పెళ్లి చేసుకుంటారట. ఇదెక్కడి దిక్కుమాలిన ఆచారాం అనుకుంటున్నారా? వినడానికి వింతగా అనిపించినా ఇది అక్కడి ఆచారమట. పూర్వీకుల కాలం నాటినుంచి దీన్ని ఆచరిస్తున్నారట. ఆఫ్రికాలోని వోడాబ్బే తెగ ప్రజలు ప్రతి ఏడాది గారెవోలు అనే పండుగను నిర్వహిస్తారు. ► ఈ వేడకలో వేరొకరి భార్య ఇంకొకరితో పారిపోతే.. దానికి ఎటువంటి అభ్యంతరం చెప్పరు. అందరి ఆమోదంతో మళ్లీ వివాహం చేస్తారు. ఈ పండుగలో అబ్బాయిల ముఖం మీద పెయింట్ వేసుకుంటారట. ఈ సమయంలోనే వివాహిత మహిళలను ఆకర్షించడానికి శతవిధాలా ప్రయత్నిస్తారట.అలా వారి ప్రయత్నాలకు ఎవరైతే ఆకర్షితులై వేరొకరితో పారిపోతే.. దానికి ఎటువంటి అభ్యంతరం చెప్పరు. ► చైనాలో ఓ వింత ఆచారం ఉంది. పెళ్లికి నెల రోజుల ముందు నుంచిపెళ్లి కూతురు రోజుకో గంట తప్పకుండా ఏడ్వాల్సిందేనట. అంతేకాదు, పది రోజుల తర్వాత ఆ నవ వధువుకు తోడుగా వాళ్ల అమ్మ కూడా ఆ ఏడుపులో పాలు పంచుకోవాలి. మరో పది రోజుల తర్వాత ఆమెకు వాళ్ల అమ్మమ్మ తోడవుతుంది. నెల చివర్లో అమ్మాయి కుటుంబ సభ్యుల్లో మహిళలంతా ఆమెకు సహాయంగా ఏడుస్తారు. అలా ఆడవారి ఏడుపుతో వచ్చే వివిధ రాగాలను పెళ్లి వారంతా ఆనందిస్తారట. ► ఇంకో వింతైన ఆచారం ఏంటంటే..పెళ్లి తంతు ముగిసే వరకు పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు నవ్వకూడదట. అలా నవ్వితే అరిష్టంగా భావించి వివాహమే రద్దు చేస్తారట. ► ఇండోనేసియాలోని సుంబా దీవిలో ఏ కుర్రాడికైనా అమ్మాయి నచ్చితే కిడ్నాప్ చేసి తరువాత ఆమెను పెళ్లి చేసుకుంటాడట. ► మన దేశంలో బీహార్‌లోని కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ వింతైన ఆచారాన్ని పాటిస్తున్నారు. దాని పేరే ‘రాక్షస వివాహం‘. ఈ ఆచారం ప్రకారం వరుడిని దొంగతనంగా ఎత్తుకెళ్లి వధువుతో తాళి కట్టిస్తారట. ఒకవేళ ఆ వరుడికి ఇష్టం లేకపోతే బలవంతంగా బెదిరించి మరీ పెళ్లి చేస్తారట. ► మౌంట్ అబు పెళ్లి ఆచారం గమ్మత్తుగా ఉంటుంది. ఇక్కడ పెళ్లైన తరువాత అబ్బాయిలు ఇల్లరికం వస్తారు. అబ్బాయి అత్తవారింటికి వచ్చి అక్కడే స్థిరపడతాడు. అంతేకాదు అక్కడే పనులు చూసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటాడు. ► ఇక దక్షిణ సూడాన్‌లో పాటించే ఆచారాలు గురించే తెలిస్తే.. ముక్కున వేలు వేసుకుంటారు. వార్ని.. ఇదేం దిక్కుమాలిన ఆచారంరా బాబు అని తలలు పట్టుకుంటారు. అక్కడి అమ్మాయిలను శవాలకు ఇచ్చి పెళ్లి చేసే సంప్రదాయం ఉందట. వినడానికి వింతగా ఉన్నా ఇంకా అక్కడి ప్రజలు ఈ ఆచారాన్ని ఫాలో అవుతున్నారు. ►ఇటలీ పెళ్లిళ్లలో ప్రత్యేకంగా నిర్వహించే ఒక కార్యక్రమంలో వధూవరులు ఉద్దేశపూర్వకంగా అద్దాలు పగలకొడతారు. ఆ అద్దం ఎన్ని ముక్కలయితే అంత ఆనంద పడతారు. ఆ అద్దం ఎన్ని ముక్కలుగా పగిలిందో అంత కాలం ఈ దంపతులు ఆనందంగా జీవిస్తారని నమ్ముతారు. పగిలిన అద్దం ముక్కలను లెక్కబెడుతూ సంతోషంతో నృత్యం చేస్తారు. ► జపాన్‌లో పెళ్లి పూర్తికాగానే ఆ జంట చేత మూడు గ్లాసుల్లో ఉండే వైన్‌ను తాగిస్తారు. రెండు కుటుంబాలు ఏకం అయ్యారని ప్రకటించటమే ఈ సంప్రదాయమట. -
పాణిగ్రహణం.. దేశానికో సంప్రదాయం.. విదేశాల్లోని వింత సంప్రదాయాలివీ!
భారతదేశంలో వివాహం అనేది ఓ పవిత్ర కార్యం. రెండు హృదయాలను ఆలుమగలుగా మలిచే మనోహర ఘట్టం. వధూవరులు జీవితాంతం కలిసికట్టుగా ముందుకు సాగుతామని ఒకరికొకరు హామీ ఇచ్చుకునే వివాహ సంప్రదాయాలు ప్రపంచవ్యాప్తంగా బలంగా ఉన్నాయి. వీటిలో కొన్ని పురాతనమైనవి కాగా.. మరికొన్ని ఆధునికమైనవి. కొన్ని తెగల్లో ఇప్పటికీ బహుభార్యత్వం కొనసాగుతోంది. కొన్ని తెగల్లో బహుభర్తృత్వం కూడా ఉంది. కొన్నిచోట్ల వివాహానికి ముందే కాపురం చేసి పిల్లల్ని కూడా కనడం.. ఆ తరువాత నచ్చితే పెళ్లి లేదంటే మరొకరితో సహజీవనం వంటి పద్ధతులూ ఉన్నాయి. కాగా.. విదేశాల్లో అమలులో ఉన్న కొన్ని వింత సంప్రదాయాలివీ... సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు భారతీయ వివాహ సంప్రదాయాన్నీ, వివాహ వ్యవస్థను గౌరవిస్తుంటారు. అంత గొప్పది మన సంస్కృతి. అయితే జాతకాలను విశ్వసించే మన దేశంలో వధూవరులు పుట్టిన జాతకం (చార్ట్ మ్యాచింగ్) ఆధారంగా వివాహాలను నిశ్చయిస్తారు. వధువుకు కుజ దోషం ఉంటే.. భర్త చనిపోతాడనే నమ్మకం భారతదేశంలో ఉంది. దీనికి పరిహారంగా అమ్మాయికి చెట్టుతో పెళ్లి చేసి.. ఆ తరువాతే వరుడితో ముడిపెట్టడం ఆచారం. ఈ ప్రకారమే మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ అభిషేక్ బచ్చన్‌ను వివాహం చేసుకునే ముందు ఆమె మొదట ఒక చెట్టును వివాహం చేసుకుంది. ఒకవేళ వధువు ‘మంగ్లిక్’ అయితే శపించబడుతుందని నమ్ముతారు. కాగా.. వరుడి పాదరక్షల్ని దొంగిలించే (షూ గేమ్) విధానం భారతీయ వివాహ వేడుకల్లో ఒక సరదా. వధువు తరఫున యువతులు వరుడి పాదరక్షల్ని దొంగిలించడానికి ప్రయత్నిస్తారు. వరుడి సహచరులు వాటిని కాపాడతారు. ఒకవేళ వధువు సోదరీమణులు పాదరక్షల్ని దొంగిలించడంలో విజయం సాధిస్తే.. వాటిని తిరిగి పొందడానికి వరుడు డబ్బులివ్వాలి. భారతీయ వివాహాల్లో హెన్నాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. వధువు చేతికి ఎర్రగా పండే హెన్నా ఆమె భర్త ప్రేమను, ఆప్యాయతను ప్రతిబింబిస్తుంది. భారతీయ పెళ్లి తంతులో జీలకర్ర, బెల్లం ఒకరి తలపై ఒకరు ఉంచుకోవడం.. వధువు మెడలో వరుడు తాళి కట్టడం అనే సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. వధువును విడిపించాలి రొమేనియాలో కొన్ని వివాహాల్లో వధువును స్నేహితులు, కుటుంబ సభ్యులు దాచడానికి ప్లాన్ చేస్తారు. భర్తను బెదిరించడానికి.. వధువును విడిపించడానికి డబ్బు డిమాండ్ చేస్తారు. వరుడు ఆ మొత్తం చెల్లిస్తాడు. ‘టై’ ముక్కల వేలం స్పానిష్ వివాహ రిసెప్షన్ పార్టీలో వరుడి టైని ముక్కలుగా కోయడం కొందరు సంప్రదాయంగా పాటిస్తారు. ఆ ముక్కలను వేలం వేస్తారు. వాటిని పాడుకున్న వ్యక్తి ఆ క్షణం నుంచి అదృష్టవంతుడవుతాడని భావిస్తారు. ముద్దాడాలి మరి స్వీడన్లో కొన్ని పెళ్లిళ్లలో వధువు గది నుంచి బయటకు వచ్చిన వెంటనే వరుడిని ముద్దాడటానికి ఒంటరి మహిళలు క్యూలో ఉంటారు. వరుడు గదిని వధువు విడిచిపెట్టినప్పుడు యువకులు ముద్దాడుతారు. తెల్లటి డ్రెస్‌తో.. జపాన్‌లో అయితే.. పెళ్లి రోజున పైనుంచి కింది వరకు వధువు తెల్లటి డ్రెస్ ధరిస్తుంది. మహిళలు తెల్లని కిమోనోస్ ధరించి.. మేకప్ వేసుకుని.. వైట్ హుడ్ ధరిస్తారు. బరువు పెరిగితేనే.. పెళ్లికి ముందు అమ్మాయిలు స్లిమ్‌గా, ట్రిమ్గా కనిపించాలని రకరకాల ప్రయత్నాలు చేయడం సాధారణం. కానీ.. మారిషస్‌లో మాత్రం కొందరు బరువు తగ్గడానికి బదులుగా.. లావు పెరగాలి. వధువు ఎంత లావుగా కనిపిస్తే అంత ధనవంతులుగా కనిపిస్తారని నమ్ముతారు. అలాంటి వారినే వరుడు వరిస్తాడు. ఫ్రెంచ్ పద్ధతి ఇలా.. ఫ్రెంచ్ దేశస్తుల్లో కొందరు వివాహ విందులో టాయిలెట్ బౌల్ నమూనా ఏర్పాటు చేస్తారు. బంధుమిత్రులు తాము తినగా మిగిలిన ఆహారాన్ని అందులో పడేస్తే.. వధూవరులు ఆ ఆహారాన్నే ఆల్కహాల్ కలుపుకుని విందు భోజనంగా తినాలి. గుండుగీసి.. కెన్యా దేశస్తుల్లో కాబోయే భార్యను వరుడు ఎంచుకోవడానికి కొందరి కుటుంబ సభ్యులు అంగీకరించరు. అతని కుటుంబమే అన్ని నిర్ణయాలూ తీసుకుంటుంది. పెళ్లి రోజున వధువు జుట్టు పూర్తిగా తీసేసి గుండుగీసి, తలపై గొర్రె కొవ్వుతో రుద్దుతారు. స్కాట్లాండ్లో ఇదీ పద్ధతి కొత్తగా వివాహం చేసుకున్న స్కాటిష్ వధువులను బంధువులు కట్టేసే సంప్రదాయం కొందరు పాటిస్తారు. సాస్, చేపలు, గుడ్లు, పిండి మొదలైన వాటిని వారికి పూసి స్నానం చేయిస్తారు. శుభ్రం చేయాలి మరి.. జర్మనీలో అయితే.. కొన్ని పెళ్లిళ్లలో స్నేహితులకు బ్యాచిలర్ పార్టీ ఏర్పాటు చేస్తారు. దీనికి హాజరైన వారు నేలపై పింగాణీ పాత్రల్లో ఉన్న వంటకాలను నాశనం చేసి ప్లేట్లు పగులగొడతారు. వధూవరులిద్దరూ కలిసి దానిని శుభ్రం చేయాలి. నెలపాటు ఏడవాలి మరి వధువును బాణంతో కొట్టడం చైనా వివాహ సంప్రదాయంలో ఒకటి. పెళ్లి కూతుర్ని కొట్టడానికి పెళ్లికొడుకు మూడుసార్లు బాణాలను ప్రయోగిస్తాడు. పెళ్లిలో కాకున్నా వరుడు జీవితకాలంలో ఒకసారి వధువును ఇలా కొట్టవచ్చు. మరో ఆచారం ఇక్కడ ఉంది. పెళ్లి కుదిరిన తరువాత వధువు ఒక నెల పాటు క్రమం తప్పకుండా రోజూ ఓ గంటపాటు ఏడవాలి. మూడు వారాల ముందు ఆమె తల్లి, వారం గ్యాప్‌లో సోదరి, అమ్మమ్మ ఏడుపు మొదలు పెడతారు. -
‘భార్యంటే.. వాడుకుని వదిలేసే వస్తువు కాదు’
ఆయనకు పెళ్లైంది. ముగ్గురు పిల్లలు. కానీ, మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని భార్యను మానసికంగా హింసించాడు. అయితే ఇది ఇంతటితో ఆగలేదు. భార్యను శాశ్వతంగా వదిలించుకుని ప్రియురాలికి దగ్గరయ్యేందుకు ‘విడాకుల’నే మాస్టర్ ప్లాన్ వేశాడు. పైగా భార్య తనపై దాడి చేసిందంటూ ‘వైవాహిక క్రూరత్వం’ కారణంగా చూపించాడు. మరి న్యాయస్థానం ఈ కేసులో ఎలాంటి తీర్పు ఇచ్చిందంటే.. వివాహ బంధం.. ఏదో వస్తువును కొనుక్కున్నట్లు కాదు. భార్యంటే వాడుకుని వదిలేసే వస్తువు కాదు. మన సంప్రదాయం అది కానే కాదు. ఇప్పటి యువతరం మనస్తత్వాన్ని, పాటిస్తున్న ఆచార వ్యవహారాలను, సంప్రదాయపు అంశాలను పరిగణనలోకి తీసుకునే మేం ఈ వ్యాఖ్యలు చేస్తున్నాం. కొత్త తరం దాదాపుగా.. పెళ్లంటే ఒక అరిష్టంగా భావిస్తోంది. సహజీవన సంప్రదాయం పెరిగిపోతోంది. ఇది సమాజపు మనస్సాక్షిని ఇబ్బందికి గురి చేస్తోంది. WIFE అంటే.. ఈరోజుల్లో.. అంతా పెళ్లిని ఒక ‘చేదు’ అనుభవంగా భావిస్తున్నారు. వ్యక్తిగతంగా స్వేచ్ఛ జీవితానికి, బాధ్యతలకు, విధులకు పెళ్లి ఒక ఆటంకంగా మారిపోయినట్లు ఫీలైపోతున్నారు. ఒకప్పుడు వైఫ్ అంటే Wise Investment For Ever అనే అర్థం ఉండేది. ఇప్పుడది Worry Invited For Everగా మారిపోయింది. 'యూజ్ అండ్ త్రో' అనే వినియోగదారుల సంస్కృతి మన వివాహ సంబంధాలను కూడా ప్రభావితం చేసినట్లు కనిపిస్తోంది. విడిపోయినప్పుడు వీడ్కోలు చెప్పుకోవడానికే.. లివ్-ఇన్-రిలేషన్షిప్స్ అన్నచందాన మారిపోయింది పరిస్థితి. విడాకులతో నాశనం కాబడ్డ కుటుంబాల ఆర్తనాదాలు మొత్తం సమాజం మనస్సాక్షిని కదిలించే శక్తి ఉంది. విడాకుల కోసం కోర్టుకెక్కిన జంటలు, విడాకుల తర్వాత పిల్లలను విడిచిపెడుతున్నవాళ్లు, విడాకులు తీసుకున్నవారు.. పెరిగిపోతున్నప్పుడు.. కచ్చితంగా అది సామాజిక జీవితంలోని ప్రశాంతతను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందనడంలో సందేహం లేదు అని కేరళ హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేసు ఏంటంటే.. కేరళ అలపుజ్జాకు చెందిన జంటకు సౌదీ అరేబియాలో స్థిరపడింది. 2009లో వివాహం జరగ్గా.. 2018లో విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టుకు వెళ్లాడు భర్త. తన భార్య తనపై దాడి చేసిందని, క్రూరత్వం కింద తనకు విడాకులు ఇప్పించాలని కోరాడతను. అయితే.. 2017 నుంచి ఓ మహిళతో తన భర్త వివాహేతర సంబంధం నడిపిస్తున్నాడని, ప్రశ్నించినందుకే ఇలా తన నుంచి విడిపోవాలనుకుంటున్నాడని సదరు భార్య వాదనలు వినిపించింది. ఈ క్రమంలో భార్య క్రూరత్వాన్ని నిరూపించే సాక్ష్యాలు, ఆధారాలు లేకపోవడంతో క్ట్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్.. డైవోర్స్ యాక్ట్ 1869 ప్రకారం.. ఫ్యామిలీ కోర్టు ఆ భర్త దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను కొట్టేసింది. ఈ నేపథ్యంలో ఆ భర్త హైకోర్టును ఆశ్రయించాడు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ట్విస్ట్ ఏంటంటే.. అతని తల్లి మాత్రం కోడలి వైపే నిలబడింది. తన కొడుకు కోడలు, వాళ్ల పిల్లలతో మంచిగా బతకాలని పోరాడింది. మరోవైపు భార్య(38) కూడా తన భర్త వివాహేతర సంబంధాన్ని వదులకుని తనతో సంతోషంగా ఉంటే చాలనుకుంటోంది. దీంతో ఈ మొత్తం అంశాలను పరిగణనలోకి తీసుకున్న కేరళ హైకోర్టు బెంచ్.. పైన చెప్పిన విధంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ జంటకు ముగ్గురు పిల్లలు ఉన్న విషయాన్ని నొక్కి మరీ చెప్పి.. విడాకుల పిటిషన్‌ను తిరస్కరించింది. అంతేకాదు.. భార్యతో సజావుగా కాపురం చేసుకోవాలని సదరు భర్తకు సూచిస్తూ డివిజన్ బెంచ్ జస్టిస్ ముహమ్మద్ ముస్తాక్యూ, జస్టిస్ సోఫీ థామస్‌లు కీలక వ్యాఖ్యలతో ఆగస్టు 24వ తేదీన తీర్పు ఇచ్చారు. ఇదీ చదవండి: డాక్టర్ కోసం పడిగాపులు.. కన్నతల్లి ఒడిలోనే పసికందు మృతి -
స్వతంత్ర భారతి: హిందూ వివాహ చట్టం
హిందూ వివాహ చట్టం 1955కి రూపకల్పన జరిగింది. అయితే ఈ చట్టం స్త్రీల పట్ల వివక్ష చూపుతోందనే విమర్శలూ ఉన్నాయి. భారత రాజ్యాంగం ఆర్టికల్ 14 కింద సమానత్వానికి, ఆర్టికల్ 15 కింద వివక్షా రాహిత్యానికి హామీ ఇచ్చింది కానీ కుటుంబం లోపల వివాహ వ్యవస్థలో స్త్రీపై పురుషుడి ఆధిక్యత కొనసాగుతూనే ఉందన్నది కొందరు స్త్రీవాదుల పరిశీలన. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత రూపొందిన 1955 నాటి హిందూ వివాహ చట్టాన్ని మనం పరిశీలించినప్పుడు వివక్ష అన్నది స్పష్టంగా కనిపిస్తుంది అని మహిళా హక్కుల న్యాయవాదుల అభిప్రాయం. ‘‘వివాహ వ్యవస్థ లోపల మహిళల ప్రతిపత్తి పురుషులతో పోలిస్తే చాలా వ్యత్యాసంతో ఉంటుంది. పురుషుడు సంపాదనాపరుడు, అతడి సంపాదనను ఆర్థిక పదబంధాలతో కొలుస్తారు. మహిళ గృహిణి. అంతే కాకుండా వివాహ వ్యవస్థ లోపల ఆమె అధీనురాలి స్థితిలో ఉంటుంది. ఆమె కుటుంబం, సమాజానికి చెందిన సాంస్కృతిక నియమాలను నిలబెట్టే స్థానంలో ఉంటుంది. అయితే వివాహ చట్టాల్లోపల వధూవరుల మధ్య ఉంటున్న ఈ అసమానతా స్థితిని ఎవరూ గుర్తించరు. ఇక విడాకులకు ప్రయత్నిస్తున్నప్పుడు స్త్రీపురుషులిరువురూ తమ పిటిషన్లను ఒకే నిర్దిష్ట భూమికపై సమర్పించాల్సి ఉంటుంది. అవేమిటంటే– వ్యభిచారం, పారిపోవడం, క్రూరత్వం! ఇందులో ఔచిత్యం లేదనిపిస్తుంది’’ అనే కోణం కూడా వారి అభిప్రాయంలో కనిపిస్తుంది. ఏమైనా హిందూ వివాహ చట్టంలో కొన్ని మార్పులైతే తప్పనిసరిగా జరగవలసి ఉందని ఇటీవలి కొన్ని కేసులలో మహిళల తరఫున వాదించే న్యాయవాదులు స్పష్టం చేశారు. అడ్డుపడుతున్న సెక్షన్ : విడాకుల పిటిషన్ కోర్టులో అపరిష్కృతంగా ఉన్న సమయంలో జరిగిన రెండో వివాహం చెల్లుబాటు అవుతుందని సుప్రీంకోర్టు 2018లో స్పష్టతనిచ్చింది. హిందూ వివాహ చట్టంలోని ‘వివాహ అనర్హత’ నిబంధన ద్వారా రెండో వివాహాన్ని రద్దుచేయలేమని ఆ కేసులో జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావుల ధర్మాసనం తెలిపింది. విడాకుల పిటిషన్ పరిష్కృతమయ్యే వరకు రెండో వివాహంపై ఆంక్షలు విధించిన హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 15ను ఈ సందర్భంగా బెంచ్ ప్రస్తావించింది. ఇరు వర్గాలు (భార్యాభర్తలు) కోర్టు బయట సమస్యను పరిష్కరించుకుని, ఇక కేసును కొనసాగించొద్దని నిర్ణయించుకున్న సందర్భంలో సెక్షన్ 15 వర్తించదని తెలిపింది. అంతేకాదు, విడాకుల పిటిషన్ పెండింగ్‌లో ఉండగా జరిగిన వివాహం చెల్లదని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. తన భార్యతో విడాకులు కోరుతూ దాఖలుచేసిన పిటిషన్ ఢిల్లీ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న సమయంలోనే పిటిషన్ దారుడు మరో వివాహం చేసుకున్నారు. తొలి భార్యతో సమస్యను పరిష్కరించుకున్నానని, తమకు విడాకులకు అనుమతివ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. తన అప్పీల్‌ను వెనక్కి తీసుకోవడానికి అనుమతించాలని కోరారు. కానీ, విడాకుల పిటిషన్ పెండింగ్‌లో ఉండగా జరిగిన వివాహం చెల్లబోదని హైకోర్టు తీర్పునివ్వడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
సిగ్గు పడాల్సిన భారత జాతీయ నేరం వధూహత్య
‘వరకట్నమరణ’ నేరాన్ని మెకాలే కనిపెట్టలేదు. భారతదేశ భర్తలు, అత్తమామలు, ఆడపడచుల అనేక ఘోరనేరాల వల్ల భారత సమాజమే స్వతంత్రదేశంలో దీన్ని కొత్త నేరంగా నిర్వచించింది. సాక్ష్యాలు లేని నాలుగు గోడల మధ్య కుటుంబ సభ్యులే, అంటే పాత నేరగాళ్లు కాదు, సాగించే దారుణమైన హత్యలకు సరైన శిక్షలు విధించడానికి కావలసిన నియమాలు, విధానాలు పార్లమెంటు రూపొందించింది. మనం గొప్పగా చెప్పుకునే అద్భుతమైన వారసత్వ సంస్కృతి, మనమంతా పిలుచుకునే గొప్ప నాగరికత, అంతరిస్తున్న ప్రేమలు, విజృంభిస్తున్న ద్వేషాలు, ధనాశ, క్రౌర్యం నుంచి పుట్టిన కుటుంబ నేరం ఈ ఘోరం. సిగ్గుపడవలసిన సరికొత్త భారత జాతీయనేరం. (చదవండి: తప్పు చేసినా శిక్షకు అతీతులా?) జార్ఖండ్ రాష్ట్రంలో ఒక భర్త రామ్‌సహాయ్ మహతో, అత్త పార్వతీదేవి, మామ నేమా మహతో కలిసి కోడలు ఫుల్వాదేవిని వరకట్నం తేలేదని చంపిన సంఘటన ఇది. రాజ్‌దూత్ మోటార్ సైకిల్, 20 వేలరూపాయల వరకట్నం కోసం వధువును హింసించారు. వేరే అమ్మాయితో పెళ్లి చేస్తామని బెదిరించారు. తండ్రి అంత డబ్బు తేలేడని కాళ్లావేళ్లా పడ్డా కనికరించలేదు. 1997లో పెళ్లి అయిన కొద్ది నెలలకే ఆమె జీవితం ముగించారు. ఆమెను నదీ తీరానికి తీసుకువచ్చి నదిలోకి తోసి చంపేశారు. కూతురు కనిపించడం లేదని తండ్రి బోధి మహతో ఫిర్యాదు చేశారు. (చదవండి: ‘ట్యాక్స్ పేయర్స్ మనీ’ అంటూ ‘సోషల్ ఆడిట్’!) 1997లో వధువును చంపేశారు. కేసు రిజిస్టర్ అయింది. 20వ తేదీ సెప్టెంబర్ 1999 గిరిడిత్ అడిషనల్ సెషన్‌జడ్జి నేరం రుజువైందని పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. మరో నేరంలో మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. ఈ రెండు శిక్షలు ఏకకాలంలో అమలు కావాలని తీర్పులో పేర్కొన్నారు. అంటే కేవలం పదేళ్లే శిక్ష అని అర్థం. 2007లో అంటే ఏడేళ్ల తరువాత హైకోర్టు శిక్షలను నిర్ధారించింది. 14 సంవత్సరాల తరువాత సుప్రీంకోర్టు శిక్షలను సమర్థించింది. ఈలోగా నేమా మహతో (మామ) 2009 సుప్రీం కోర్టులో అప్పీలు కోసం ఎస్ఎల్పీ వేశాడు. కానీ అంతలో మరణించాడు. కనుక ఆయనపై కేసులేవీ ఉండవు. అత్తమీద ఆరోపణలు స్పష్టంగా లేకపోవడం, రుజువులు సరైనన్ని లేకపోవడం వల్ల ఆమెను విడుదల చేశారు. 21 సంవత్సరాల తరువాత సుప్రీంకోర్టు తీర్పుతో ఈ సుదీర్ఘ అన్యాయాలస్యం తరువాత న్యాయం జరిగింది. ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కొహ్లి ఈ అప్పీలు విచారించారు. కొన్ని దేశాల్లో అయితే ఒక శిక్ష తరవాత మరొక శిక్ష అమలవుతుంది. అంటే ఇదే అమెరికాలో అయితే కోడలిని చంపిన ఈ హంతకులకు 13 ఏళ్ల జైలు శిక్ష పడేది. నేర విచారణ దశలో తమ ఇంట్లోంచి వధువు ఏ విధంగా మాయమైపోయిందో చెప్పలేకపోయారు అత్త మామలు, భర్త. ఆమె తనతో నివసించడం లేదని వారు చెప్పినవన్నీ అబద్ధాలని కోర్టు భావించింది. తమతో కాకుండా తన బావతో ఆమె నివసించేదని చెప్పడానికి వారు విఫల ప్రయత్నం చేశారు. ఇంట్లోంచి వెళ్లిపోయిందనీ తరువాత దొరకలేదనే మాటలు కూడా నమ్మశక్యంగా లేవు. వెతకడానికి ఏం ప్రయత్నాలు చేశారో చెప్పలేకపోయారు. నిజంగా ఆమె ఇంటినుంచి మాయమైపోతే ఆమె తల్లిదండ్రులకు చెప్పకపోవడం, పోలీసులకు ఫిర్యాదు చేయక పోవడం చూస్తే వారి ప్రవర్తనపై అనుమానాలు ధృవపడుతున్నాయి. వరకట్న హత్యలకు ప్రత్యక్ష సాక్షులు ఉండరు. నేరగాళ్లే సాక్షులు. వారి ప్రవర్తన, పరిస్థితులు, ముందు వెనుక వారి వ్యవహారాలు, అంతకుముందు జరిగిన సంగతులు వారి నేరాన్ని పట్టి ఇస్తాయి. మామూలు హత్యలకు ఈ హత్య లకు ఇదీ తేడా. హత్య జరిగిందని చెప్పే సాక్షులు ఉండని పరిస్థితులలో, వీరే హత్య చేసి ఉంటారు అని భావించడానికి తగిన పరిసర సాక్ష్యాలు కోర్టు ముందుంచడం ఒక సవాల్. దీనికిగానూ ప్రాసిక్యూషన్ వారు నీతిమంతంగా, న్యాయంగా, చాలాశ్రద్ధతో కృషి చేయవలసి వస్తున్నది. సెక్షన్ 304 బి ఇండియన్ పీనల్ కోడ్ కింద, నిందితులే నేరం చేసి ఉంటారని భావించడానికి కొన్ని సూత్రాలను ఈ తాజా తీర్పు వివరిస్తున్నది. 1. సాధారణ పరిస్థితుల్లో కాకుండా మరోరకంగా మరణం సంభవించి ఉండటం, కాలిన గాయాలో మరోరకం శారీరక గాయాలో అయి ఉండాలి. 2. పెళ్లయిన ఏడేళ్లలోగా అసాధారణ మరణం జరిగి ఉండాలి. 3. మరణానికి ముందు అప్పుడప్పుడే ఆమె హింసకు గురై ఉండాలి. 4. ఆ హింస, క్రౌర్యం వరకట్నం కోసమో లేక దానికి సంబంధించినదై ఉండాలి. ఇందులో వధువు తండ్రి ఒక్కడే ప్రత్యక్ష సాక్షి. నిందితుడు తన కూతురికి హాని చేస్తానని బెదిరించినట్టు సాక్ష్యం చెప్పాడు. తండ్రి, తమ్ముడు, బావ చేసిన ప్రయత్నాల వల్ల ఆమె శరీర భాగాలు లభించాయి గానీ పోలీసులేమీ చేయలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో దర్యాప్తు అంత పకడ్బందీగా లేదు. కానీ 304బి కింద పరిస్థితుల సాక్ష్యం నిందితుల నేరాన్ని రుజువు చేస్తోంది. ఫుల్వాదేవి పెళ్లయిన కొద్ది నెలలకే కట్నం కోసం హింసకు గురికావడం, కొద్దిరోజులకే అత్తవారింటి నుంచి మాయం కావడం (ఆరోపణ స్థాయిలో కూడా నమ్మలేని మాట), తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకపోవడం, వధువు సోదరుడు వచ్చినపుడు ఇంటిల్లిపాదీ లేకపోవడం, ఇంటికి తాళం వేయడం, పోలీసులకు ఫిర్యాదు చేయక పోవడం, ఆమె అస్తిపంజరం నదీ తీరంలో దొరకడం, భర్త, అత్త మామల మాటలు పొంతనలేకుండా ఉండటం వంటి వన్నీ నేరాన్ని పట్టి ఇస్తున్నాయి. ఇది హత్య. సాక్ష్యాలు దొరికితే హత్య అని నిరూపించి సెక్షన్ 302 కింద శిక్షించే వీలుంది. సెక్షన్ 304బి హత్యల వర్గంలోనే ఒక కొత్తరకం నేరం. దీన్ని చట్టం హత్య అనకుండా వరకట్న మరణం అని పేరుపెట్టినంత మాత్రాన ఇది హత్య కాకుండా పోదు. వివాహ వ్యవస్థను నాశనం చేస్తున్నది కుటుంబపెద్దల క్రూర స్వార్థ మనస్తత్వం. (చదవండి: వధువు కంటే వరుడు పెద్దవాడయి వుండాలా!) - మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త డీన్, స్కూల్ ఆఫ్ లా, మహీంద్రా యూనివర్సిటీ -
వధువు కంటే వరుడు పెద్దవాడయి వుండాలా!
రామాయణ కాలం నుంచీ వధూవరులు సమానమైన వయస్సు, నడవడి, శీలము, ఉత్తమ గుణాలు కలిగిన వారై ఉండాలని సీతారాముల అన్యోన్యార్హతను వివరిస్తూ వాల్మీకి రచించిన ‘తుల్యశీల వయో వృత్తాం...’ అనే శ్లోకం వల్ల తెలుస్తోంది. ఆ మాటకొస్తే సీత... రాముడి కంటే పెద్దదని జనశ్రుతి. కానీ ధర్మశాస్త్రాలలో వరుడు వధువు కంటే పెద్దవాడయి వుండాలనీ, వరహీనమైతే పురుషుడికి ఆయుఃక్షీణమనీ చెప్పారు. ఈ నియమం మన వివాహ వ్యవస్థలో అన్ని కులాలలోనూ పాటింపబడుతోంది. పెళ్లికూతురు కంటే పెళ్లికొడుకు కనీసం అయిదేళ్లయినా పెద్దగా ఉండాలనే ఆచారాన్ని నిన్నటి పురుషా ధిక్య సమాజం స్వార్థంతో దుర్వినియోగం చేసింది. ‘అష్ట వర్షాత్ భవేత్ కన్యా’ అని కన్యా లక్షణానికి హద్దుల్ని నిర్ణయించి ఆడపిల్లలకు ఎనిమిదేళ్ల లోపే పెళ్లి చేస్తే పుణ్యం వస్తుందని భావించారు. అలాంటి మూఢ విశ్వాసంతో శారదా చట్టం (1929లో బాలికల వివాహ వయస్సు 14 సంవత్సరాలు) అమలులో ఉన్న కాలంలో కూడా ఆ చట్టం వర్తించని ప్రదేశాలకు తీసుకెళ్లి బాలికలకు వివాహాలు చేశారు. ఇదే అదనుగా ముసలివాళ్లు కూడా కన్యాశుల్కాన్ని చెల్లించి ముక్కు పచ్చలారని పసిపిల్లలకు మూడుముళ్లు వేసి వాళ్ల భవిష్యత్తులను అంధకారమయం చేశారు. అలాంటి అభాగినులకు బాసటగా గురజాడ, కందుకూరి మొదలైన కవులూ, సంస్కర్తలూ నిలిచి బాల్య వివాహాలను రూపుమాపడానికీ, వితంతు వివాహాలను ప్రోత్సహించడానికీ కృషి చేశారు. బాల్య వివాహాల దురాచార దశ దాటిన తర్వాత కూడా ఆడపిల్లల అగచాట్లు అంతం కాలేదు. 1978లో ప్రభుత్వం అబ్బాయిలకు 21 ఏళ్లు, అమ్మాయిలకు 18 ఏళ్లు కనీస వివాహ వయస్సులుగా నిర్ణయించినా అమ్మాయిలు మైనర్లుగా ఉండగానే వాళ్ల ఇష్టా నిష్టాలతో సంబంధం లేకుండానే చాలామంది తల్లి దండ్రులు వాళ్లకు మూడుముళ్లు వేయించి బాధ్యత తీరిపోయిందనుకునేవారు. వయోభేదం కంటే జాత కాలకు ప్రాధాన్యాన్నిచ్చి పెళ్లికూతురు కంటే రెట్టింపు వయసున్న పెళ్లికొడుకులకు కూడా కట్టబెట్టేవాళ్లు. ‘కన్యాశుల్కం’ నాటకంలో అగ్నిహోత్రా వధాన్లు చెప్పినట్టు పెళ్లి కోసం యిచ్చే ఆ జాతకాల్లో కూడా నిజాలు ఉండేవి కావు. ఆస్తులు బయటకు పోకుండా ఉండాలని బలవంతంగా కట్టబెట్టిన మేనరికాలు... అక్క చనిపోతే వయసుతో తేడాను లెక్క చేయకుండా పిల్లల తండ్రి అయిన బావకు ముడిపెట్టిన రెండో పెళ్లిళ్లు... రెండో పెళ్లి వాడయినా మూడో పెళ్లి వాడయినా సంపన్నుడయిన అల్లుడు ముందుకొస్తున్నాడని అతని కూతురు వయసు కూడా లేని పడుచు పిల్లను కన్యాదానం చేసే పేద తల్లిదండ్రుల దీనావస్థకు చెందిన పెళ్లిళ్లు– ఇలా అనేక సందర్భాలలో గత్యం తరం లేక కన్నె పిల్లలు బలి పశువులయ్యేవారు! పైన పేర్కొన్న అన్ని రకాల పెళ్లిళ్లలోనూ వయస్సులో పెద్దవాళ్లయిన ‘మొగుళ్ల’ను కట్టుకుని ముద్దు ముచ్చట లేకుండా ‘అరిటాకు – ముల్లు’ సామెతగా జీవితంలో వసంతం లాంటి యవ్వనానికి దూరమైంది ఆడ పిల్లలే! కాలం మారింది. కన్యాశుల్కమే కాదు, వరకట్నం కూడా తగ్గుముఖం పట్టింది. ఆడపిల్లలు చదువుకొని మగవాళ్లతో సమంగా ఉద్యోగాలు చేస్తున్న వర్తమాన సమాజంలో సంప్రదాయ వివాహాలతో పాటు ప్రేమ వివాహాలు, కులాంతర, మతాంతర వివాహాలు కూడా గణనీయంగానే జరుగుతున్నాయి. ‘జగత్తులో నేడు సగం దగాపడుట మానుకొంది’ అని దాశరథి గారన్నట్టు జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో ఆడపిల్ల అభిప్రాయం తెలుసుకోవలసిన అవసరమేమిటి అనే రోజులు పోయాయి. వివాహానంతరం కూడా భర్తతో సరిపడకపోతే నవ వధువు రాజీ ధోరణి విడిచి, విడాకుల కోసం కోర్టును ఆశ్రయిస్తోంది. ఈలోగా అవసరమైతే పోలీస్ స్టేషన్‌కు వెళ్లడానికి కూడా వెనకాడటం లేదు. డేటింగులూ, సహజీవనాలూ కూడా మన వివాహ వ్యవస్థలో చొరబడిన ఈ కాలంలో ప్రేమ వివాహాలకు సంబంధించినంతవరకూ అమ్మాయి అబ్బాయి పుట్టిన తేదీ తెలుసుకుని ప్రేమించడం లేదు. పెద్దలు ఏర్పాటు చేస్తున్న పెళ్లిళ్లలో కూడా పెళ్లి కూతురు తన కంటే ఒకటి రెండేళ్లు మాత్రమే పెద్ద వాడయిన వరుణ్ణి కోరుకుంటోంది. పెద్దలు అంగీకరిస్తే అన్ని విధాలా అనుకూలమైన సంబంధమైతే పెళ్లికొడుకు ఒకటి రెండేళ్లు చిన్నయినా చేసుకోవడానికి సిద్ధమంటోంది. శాస్త్రీయ దృక్పథంతో ఆలోచిస్తే కొన్ని సందర్భాలలో జంట మధ్య స్వల్పమైన వయోభేదం వల్ల వచ్చే నష్టమేమీ లేదనిపిస్తోంది. ఆడపిల్ల అబ్బాయి కంటే శారీరకంగానూ, మానసికంగానూ త్వరగా ఎదుగుతుంది. ఇల్లు చక్కదిద్దుకునే నేర్పు, పరిణతి ఆడపిల్లకు తక్కువ వయస్సులోనే అలవడ తాయి గనుక పెళ్లికొడుకు కంటే పెళ్లికూతురు చిన్నదిగా ఉండాలనే నియమాన్ని మన పెద్దలు ఏర్పరిచి ఉండొచ్చు. వెయ్యి అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయాలనే ఆలోచనలకు కాలం చెల్లి, దాంపత్య జీవితంలో అపస్వరాలు వినిపించకుండా వివాహానికి ముందే అన్ని నిజాలూ చెప్పడం మంచిదనే అభిప్రాయాలు నేడు ఇరుపక్షాల్లోనూ వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం మహిళల వివాహ వయసును మగవారితో సమంగా 21 ఏళ్లకు పెంచుతూ సవరణ బిల్లును తీసుకురావడం హర్షదాయకం. ప్రభుత్వం ఆదేశంతో పెద్దలు కూడా మారి వైవాహిక జీవితానికి ఈడూ జోడూ ముఖ్యమనే ఆడపిల్లల అభిప్రాయంతో ఏకీభవించి, వారిని ఆశీర్వ దిస్తారని ఆశిద్దాం. – పి. మానసారెడ్డి సామాజిక విశ్లేషకులు, దుబాయ్ (కేంద్ర ప్రభుత్వం ఆడపిల్లల కనీస వివాహ వయసును 21 ఏళ్లకు పెంచేలా బిల్లు తెచ్చిన సందర్భంగా) -
పెళ్లిపై కామెంట్స్.. నచ్చావ్ సుబ్బరాజు
వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ టాలీవుడ్లో తన కంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న నటుడు సుబ్బరాజు. 2003లో తెరంగేట్రం చేసిన ఈయన తొలి ఏడాదే ఖడ్గం, అమ్మనానా ఓ తమిళ అమ్మాయి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓ వైపు నెగటీవ్ రోల్స్ చేసుకుంటూనే మరోవైపు విభిన్న పాత్రలతో ఆకట్టుకుంటున్నాడు. బాహుబలిలో కుమార వర్మగా అభిమానుల గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోయే పాత్ర చేశాడు. అయితే ఆయన రియల్ లైఫ్ విషయానికొస్తే అందరికీ తెలియని నిజం ఒకటుంది. 43 ఏళ్ల వయసున్న సుబ్బరాజు ఇంకా పెళ్లి మాత్రం చేసుకోకుండా బ్యాచిలర్ గానే ఉండి పోయాడు. దీంతో అతడి పెళ్లి గురించి టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుబ్బరాజు తన పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘పెళ్లి చేసుకోవాలంటే కేవలం వయసు మాత్రమే ఆధారం కాదు. 25ఏళ్లు వచ్చాక అందరూ పెళ్లి చేసుకోవాలని అనుకుంటుండటంతో నేను కూడా అలా చేసుకోవాలి అనుకోవడం సరికాదు. జీవిత భాగస్వామికి నేను బెస్ట్ ఇవ్వగలను, ఎలాంటి లోటు రాకుండా చూసుకోగలనని నాకు అనిపించినప్పుడ మాత్రమే పెళ్లి చేసుకుంటా’అని సుబ్బరాజు పేర్కొన్నాడు. ఇక పెళ్లిపై సుబ్బరాజు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ‘ఈ వ్యాఖ్యలతో మీరు ఇంకా నచ్చారు సుబ్బరాజు గారు’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ప్రస్తుతం అనుష్క, మాధవన్, అంజలి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘నిశ్శబ్దం’ చిత్రంలో సుబ్బరాజు కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: నిఖిల్ పెళ్లి మరోసారి వాయిదా.. రాఘవ.. నువ్వు రియల్ హీరోవి var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_691245605.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆ యాప్ ద్వారా రెండు కోట్ల పెళ్లిళ్లు జరిగాయి!
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో యువతీ యువకులు ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఇప్పటికీ పది శాతానికి మించడం లేదు. మిగతా 90 శాతం పెళ్లిళ్లు పెద్దలు నిశ్చియించన ‘అరేంజ్డ్ మ్యారేజెస్’ లేదా ‘సెమీ అరెంజ్డ్ మ్యారేజెస్’ జరుగుతున్నాయి. అరేంజ్డ్ మ్యారేజెస్ అంటే ముఖ పరిచయం కూడా లేకుండా పెద్దలు, మధ్యవర్తులు కుదుర్చిన పెళ్లిళ్లు కాగా, మిత్రుల ద్వారానో, పెద్దల ద్వారానో పరిచయమై ఒకరికొకరు కొంత అర్థం చేసుకుని చేసుకొనే పెళ్ళిళ్లను సెమీ అరేంజ్డ్ మ్యారేజెస్గా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో ఇదివరకు పెళ్లిళ్లు కుదుర్చే ఏజెన్సీలు, సంస్థలు ప్రధాన పాత్ర వహించగా, నేటి ఆధునిక టెలికామ్ కాలంలో డేటింగ్ యాప్‌లు, వెబ్సైట్లు ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. భారత్, ఇతర దక్షిణాసియా దేశాల యువతీ యువకుల కోసం శాన్ఫ్రాన్సిస్కో కేంద్రంగా ఏర్పాటయిన ‘దిల్ మిల్’ యూప్ యమ స్పీడ్‌గా దూసుకుపోతోంది. అమెరికా, కెనడా, బ్రిటన్ దేశాల్లో కోట్ల మంది యూజర్లు ఉన్నారు. ఇప్పటికే ఈ యాప్ ద్వారా రెండు కోట్లకు పైగా పెళ్లిళ్లు జరిగాయట. రోజుకు కనీసం ఒక్క పెళ్లి చేయడం తమ విజయానికి ప్రధాన కారణమని ‘దిల్ మిల్’ వ్యవస్థాపకులు, సీఈవో కేజే దలివాల్ ఇటీవల ఓ మీడియాతో వ్యాఖ్యానించారు. నామ మాత్రపు పెట్టుబడితో మొదలైన ఈ యాప్ ఇప్పుడు భారతీయ కరెన్సీలో 357 కోట్ల రూపాయలకు చేరుకుంది. తమ యాప్ విజయానికి ‘డేటింగ్ డాట్ కామ్, డేట్మైఏజ్, లవింగ్ఏ, టుబిట్, అనస్థేసియా డేట్, చైనాలవ్...’ తదితర డేటింగ్ వెబ్సైట్లు ఎంతో కారణమని కూడా దలివాల్ పేర్కొన్నారు. అమెరికా, కెనడాలతోపాటు బ్రిటన్, ఇతర యూరప్ దేశాల్లో నివసిస్తున్న దక్షిణాసియా దేశాలకు చెందిన యువతీ, యువకుల కోసమే ఈ ‘దిల్ మిల్’ యాప్‌ను అభివృద్ధి చేశారు. దక్షిణాసియా దేశాలకు చెందిన యువతీ యువకుల్లో 80 శాతం మంది దక్షిణాసియా దేశాలకు చెందిన వారిని పెళ్లి చేసుకోవడానికే ఇష్ట పడుతున్నారట. ప్రపంచవ్యాప్తంగా మూడు కోట్లకుపైగా భారతీయులు స్థిరపడ్డారని, ఇప్పుడు వారిని తమ యాప్ ప్రధానంగా ఆకర్షిస్తోందని దలివాల్ తెలిపారు. 2040 సంవత్సరం నాటికి ప్రతి పది మందిలో ఏడుగురు ఈ యాప్ ద్వారా కలసుకుంటారని దిల్ మిల్ అంచనా వేస్తోంది. ఈ యాప్‌ను 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ప్రాయం వారు ఉపయోగిస్తున్నప్పటికీ వారిలో 25 ఏళ్ల వారే ఎక్కువగా ఉన్నారు. అమెరికాలో స్థిరపడిన దక్షిణాసియాకు చెందిన తొలి, రెండో తరంలో ఈ యాప్‌కు ఎక్కువ మార్కెట్ ఉంది. మహిళల కేంద్రంగా ఏర్పడిన ‘బంబుల్’ తరహాలోనే ఈ దిల్ మిల్‌ను ఏర్పాటు చేసినప్పటికీ ఈ యాప్ ద్వారా మహిళలు కేవలం ఎన్ఆర్ఐలనే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ ద్వారా సొంత సామాజిక వర్గాలను చెందిన వారిని ఎంపిక చేసుకునే అవకాశం కూడా ఉంది. ఈ యాప్‌కు మరో ప్రత్యేకత ఉంది. ఒకరితో షేర్ చేసుకునే సమాచారం, ఫొటోలు వారిద్దరు మినహా మరొకరు చూసే అవకాశం, షేర్ చేసుకునే ఆస్కారం అసలు ఉండదు. యువతీ యువకులు ముఖాముఖి కలుసుకుని ముచ్చటించుకునేందుకు సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను కూడా యాప్ యాజమాన్యం నిర్వహిస్తోంది. ఇటీవల న్యూయార్క్ సిటీలో అలాంటి ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. సంగీతం పట్ల యువతీ, యువకులకు ఆసక్తి కలిగించడంతోపాటు నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో, ఎలా ఉండాలో కూడా బాలీవుడ్ నటి శిల్పాశెట్టితో ఓ వీడియాను, ప్రేమంటే ఏమిటో చెప్పడానికి ‘లవ్ ఈజ్’ పేరుతో మరో వీడియోను విడుదల చేసింది. -
ఆ దర్శకుడు సారీ చెప్పాలి : మాజీ మంత్రి
హైదరాబాద్: ‘ఇక సె.. లవ్’ సినిమా భారతీయ సాంప్రదాయాలు, వివాహవ్యవస్థను అపహాస్యం చేసేలా ఉందని మాజీ మంత్రి, భారతీయ జనతాపార్టీ అధికార ప్రతినిధి పుష్పలీల అన్నారు. భారతీయ వివాహవ్యవస్థ అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో గౌరవం ఉందని తెలిపారు. వెంటనే చిత్ర దర్శకుడు నాగరాజు మహిళలకు క్షమాపణ చెప్పాలని, బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. చిత్ర దర్శకునిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో పుష్పలీల మాట్లాడారు. వృద్దాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఇంట్లో పెట్టుకుంటే తమ పిల్లల చదువులకు ఆటంకం కలుగుతుందని, వృద్ధాప్యం రాగానే ఆశ్రమాల్లో వేసేయాలని చిత్రంలో చూపించినట్లు వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాహ వ్యవస్థను కించపరుస్తూ ఎన్నో డైలాగులు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆ విషయం గురించి చెప్పలేను!
భవిష్యత్తు గురించి చాలామంది చాలా చాలా కలలు కంటారు. అలా ఉండాలని.. ఇలా ఉండాలని ఏవేవో ప్రణాళికలు వేసుకుంటారు. కానీ, కొంతమంది మాత్రం భవిష్యత్తులో ఎలా ఉండాలి? అనే విషయం గురించి అస్సలు ఆలోచించరు. ప్రస్తుతం బాగున్నామా? లేదా? అన్నదే వాళ్లకి ముఖ్యం. నయనతార రెండో టైప్. ఇటీవల ఓ సందర్భంలో ఐదేళ్ల తర్వాత మీరెలా సెటిల్ అవ్వాలనుకుంటున్నారు? అనే ప్రశ్న నయనతార ముందుంచితే - ‘‘పెళ్లి గురించి అడుగుతున్నారని అర్థమవుతోంది. అయితే, ఆ విషయం గురించి నేనేమీ ఆలోచించలేదు. ఐదేళ్లలోపే అయిపోవచ్చు... తర్వాత కూడా అవ్వొచ్చు. నాకు వివాహ వ్యవస్థ మీద అపారమైన నమ్మకం ఉంది. కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. కానీ, ఫలానా సమయంలో చేసుకుంటానని టైమ్ ఫిక్స్ చేసి చెప్పలేను. ప్రస్తుతం నా దృష్టంతా యాక్టింగ్ పైనే. రకరకాల పాత్రలు పోషిస్తూ, హ్యాపీగా ఉన్నా’’ అన్నారు. -
ప్రేమ ఉద్వేగం - వివాహం వ్యవస్థ
ఆసియా వాసులకు సెంటిమెంట్స్ ఎక్కువని పశ్చిమ దేశాలవాళ్లు అంటుంటారు. దాని అర్థం ఏమంటే, ఆసియా దేశాల్లో సాంస్కృతిక కప్పు దాదాపు ఇనప తెరలా ఉంటుంది. దాన్ని అధిగమించి అందులో దాగున్న ఆర్థిక కోణాన్ని కనిపెట్టడం దాదాపు అసాధ్యం. సమాజంలోని వ్యవస్థలన్నింటికీ ఆర్థికం, సాంస్కృతికం అనే రెండు కర్తవ్యాలుంటాయి. ఆర్థిక కార్యకలాపమే ఏ వ్యవస్థకైనా ప్రాణప్రద అంశం. అయితే మనుషులకుండే ఆదిమ భావోద్వేగాలకు ఆర్థిక కార్యకలాపాలకు పడదు. సమాజంలో భావోద్వేగాలు ముందు పుట్టి, ఆర్థిక కార్యకలాపాలు తరువాత వచ్చాయి. అందువల్లే, ప్రతి వ్యవస్థలోనూ ఆర్థిక కార్యకలాపాలకు ఆమోదాంశాన్ని కల్పించడానికి దానిమీద సాంస్కృతిక మూతనో, తెరనో కప్పుతుంటారు. ఆసియా వాసులకు సెంటిమెంట్స్ ఎక్కువని పశ్చిమ దేశాలవాళ్లు అంటుంటారు. దాని అర్థం ఏమంటే, ఆసియా దేశాల్లో సాంస్కృతిక కప్పు దాదాపు ఇనప తెరలా ఉంటుంది. దాన్ని అధిగమించి అందులో దాగున్న ఆర్థిక కోణాన్ని కనిపెట్టడం దాదాపు అసాధ్యం. మతాలన్నీ ఆసియా ఖండంలోనే ఆవిర్భవించడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు. ఉత్పత్తి పెరిగితే పేదరికం తగ్గుతుందని నమ్మేవాళ్లు కొందరుంటారు. నిజానికి ఉత్పత్తి పెరిగేకొద్దీ వ్యక్తిగత ఆస్తి పెరుగుతుంది. వ్యక్తిగత ఆస్తి పెరిగేకొద్దీ మనుషుల్లో స్వార్థం పెరుగుతుంది. స్వార్థం పెరిగేకొద్దీ సమాజంలో పేదరికం పెరుగుతుంది. భూతాపం పెరిగి ఓజోన్ పొరకు రంధ్రాలు పడి అతినీల కిరణాల ధార్మిక శక్తి విజృంభించినట్టు, మనుషుల్లో స్వార్థం పెరిగేకొద్దీ సాంస్కృతిక పొరలకు చిల్లులు పడి, వ్యవస్థల్లోని ఆర్థిక కార్యకలాపాలు నగ్నంగా బయటపడిపోతాయి. ప్రేమ వేరు, వివాహం వేరు. ప్రేమ ఉద్వేగం. వివాహం వ్యవస్థ. ప్రేమలో ఆదిమ భావోద్వేగాలు పుష్కలంగా ఉంటాయి. వివాహ వ్యవస్థలో వ్యక్తిగత ఆస్తి, అస్తిత్వాల పరిరక్షణ, వారసత్వాల భద్రత అనే నిర్దేశిత ఆర్థిక కార్యకలాపాలు ఉంటాయి. మరో మాటలో చెప్పాలంటే, సాంస్కృతిక వ్యవహారంగా కనిపించే పచ్చి ఆర్థిక కార్యకలాపం వివాహ వ్యవస్థ. ఇటీవలి కాలం వరకు భారతదేశంలో స్త్రీలకు ఆస్తి హక్కు లేదు. వ్యక్తిగత ఆస్తిని కూడబెట్టడం భర్త కర్తవ్యం అయితే, భర్తకు వారసుల్ని కనడం, భర్త కూడబెట్టిన వ్యక్తిగత ఆస్తిని అతని సంతానానికి సంక్రమంగా చేర్చడం భార్య కర్తవ్యం. ఈ రెండు కర్తవ్యాలను నెరవేర్చమనడం అంటే భార్య పాతివ్రత్యాన్ని పాటించాలని అర్థం. పాతివ్రత్యం అనేది వందల సంవత్సరాలు ఒక సాంస్కృతిక విలువగా కొనసాగినప్పటికీ మహిళలందరూ దాన్ని ఆమోదించారని కాదు. వీలు దొరికినప్పుడల్లా దాన్ని వాళ్లు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఖండిస్తూనే ఉన్నారు. ఆస్తి హక్కు, ఆర్థిక స్వేచ్ఛ వచ్చేకొద్దీ మహిళల నిరసనకు మార్గాలు పెరుగుతాయి. దానితో సాంస్కృతిక పొర పలచబారిపోతుంది. సాంస్కృతిక విభాగం బలంగా ఉన్నప్పుడు ఏ వ్యవస్థ అయినా ఉద్వేగభరితంగా కనిపిస్తుంది. అందులోని ఆర్థిక విభాగం బాహాటంగా బయటికి వచ్చినప్పుడు ఉద్వేగమంతా ఆవిరైపోతుంది. బయట చెలరేగిపోతున్న ఆర్థిక పోటీ, స్వార్థం ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు దాంపత్య కర్తవ్యాలను నిర్వర్తించడం భార్యకేకాక భర్తకు కూడా ఇబ్బందిగా మారుతుంది. భార్యకు భర్త ఒక అణిచివేత యంత్రంగా కనిపిస్తే, భర్తకు భార్య గుదిబండగా కనిపిస్తుంది. వివాహ వ్యవస్థలో తలెత్తే ఇలాంటి ఒత్తిళ్లు వివాహేతర సంబంధాలకు సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయి. సరిగ్గా ఇక్కడి వరకు వచ్చి ఆగుతుంది అపర్ణ తోట కథ ‘ప్రేమకథ రిఫైన్డ్’. పెళ్లయి భర్త, పిల్లలున్న ఒకామెకు, పెళ్లయి భార్యా పిల్లలున్న ఒకతనికి మధ్య ఏర్పడిన వివాహేతర ఆకర్షణ, అందులోని ఘర్షణని అపర్ణ బాగా చిత్రించింది. సరిగ్గా ఇక్కడే మొదలవుతుంది కుప్పిలి పద్మ కథ ‘సెకండ్ హజ్బెండ్’. ఆ కథలో, దక్షిణ - అనిల్ ఇద్దరికీ సెకండ్ మ్యారేజే. అనిల్ పూజగదిలో మొదటి భార్య గౌరిది పెద్ద ఫొటో ఉంటుంది. ఆమె పుట్టినరోజును అతను ఆడంబరంగా చేస్తుంటాడు. దక్షిణ మొదటి భర్త విశ్వాస్ పుట్టినరోజున అతని ఫొటోను కూడా పూజకు పెట్టడంతో వివాదం మొదలవుతుంది. భార్యకు బహుళ అస్తిత్వాలు ఉండటాన్ని వివాహ వ్యవస్థ ఒప్పుకోదు. ఆఫీసు, ఇల్లు మాత్రమే కాదు సమాజంలోని వ్యవస్థలన్నీ రాజ్యానికి ప్రతిరూపాలే. వివాహేతర సంబంధాలు వివాహంగా మారితే మళ్లీ ఒక వ్యవస్థ ఏర్పడుతుంది. ఆ వ్యవస్థలో మొదటి భర్త అయినా వందో భర్త అయినా పెద్దగా మార్పుండదు. - ఉషా యస్ డానీ -
మ్యారేజ్ కౌన్సెలింగ్
గతంలో పిల్లలెంతమంది? అని అడిగేవారు. ఇప్పుడు పిల్లలు ఎవరితో ఉంటున్నారు? అని అడిగే దురవస్థకు వివాహ వ్యవస్థ చేరిందా? స్త్రీ పురుషుల స్పర్థలు సంతానానికి తీవ్రమైన చేటు కలిగిస్తున్నాయి. అమ్మ కావాలా? నాన్న కావాలా? అనే ప్రశ్న ఏ చిన్నారికీ రాకూడదు. అలా వచ్చిందంటే అది కుటుంబం కాదు. ప్రశ్న - జవాబు మా పెళ్లయ్యి పద్నాలుగేళ్లయింది. మా మధ్య అన్యోన్యత ఏమాత్రం లేదు. చట్టప్రకారం విడాకులు తీసుకోలేదు కానీ నేను, నా భర్త చాలా ఏళ్లనుంచి విడివిడిగా జీవిస్తున్నాం. మా ఇద్దరు కూతుళ్లూ నా దగ్గరే ఉంటున్నారు. ఈ మధ్యే నా భర్త, పిల్లల కస్టడీ కోసం కోర్టులో కేసు వేశారు. నాకేమో పిల్లల్ని ఆయనకు ఇవ్వడం ఇష్టం లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి? - ప్రసన్న, భద్రాచలం పిల్లలు మీ ఇద్దరికీ పుట్టినవారు. మీరింకా లీగల్‌గా విడాకులు తీసుకోలేదు. నిజానికి చట్టప్రకారం మైనర్ పిల్లల సంరక్షణ బాధ్యత తండ్రికే ఉంటుంది. అయితే మైనర్లయిన మీ పిల్లలు ఎన్నో ఏళ్లుగా మీతోనే కలిసి ఉంటున్నారు, అదీగాక మైనర్ పిల్లలకు తల్లి అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల జడ్జిగారు పిల్లల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, దాని ప్రకారం నిర్ణయం తీసుకుని, తీర్పు ఇస్తారు. మీ పిల్లలిద్దరూ ఆడపిల్లలంటున్నారు కాబట్టి తండ్రికి కస్టడీ ఇచ్చే అవకాశం తక్కువ. ఎందుకంటే ఎదిగే ఆడపిల్లలకు తల్లి అవసరం ఎంతో ఉంటుంది కాబట్టి మీకే ఇస్తారు. అయితే తండ్రికి వారానికో పదిహేను రోజులకో ఒకసారి పిల్లలను చూసేందుకు విజిటేషన్ రైట్స్ ఇస్తారు. మీరు అందుకు అంగీకరించక తప్పదు. నాకు పెళ్లయి ఆరు నెలలవుతోంది. ఆయన సంసారానికి పనికిరారు. ఆ విషయం కప్పిపుచ్చి ఆయన నన్ను మోసపూరితంగా పెళ్లి చేసుకున్నారు. నా సవతి తల్లి పోరు భరించలేక మా నాన్న ఈ పెళ్లి చేశారు. ఎటువంటి సుఖమూ ఇవ్వలేని ఈ వైవాహిక బంధాన్ని కొనసాగించటం నాకు ఇష్టం లేదు. దీని నుంచి బయట పడాలంటే ఏం చేయాలి? - విరజ, విజయవాడ మీకు ఇష్టం లేకుండా బలవంతంగా జరిగిన పెళ్లి అంటున్నారు. పైగా ఆయన సంసారానికి పనికి రాడని కూడా అంటున్నారు. కాబట్టి మీరు ఈ విషయాలను వివరిస్తూ, మీ వివాహాన్ని రద్దు చేయవలసిందిగా కోరుతూ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేయండి. మీరు చెప్పిన విషయాలను కోర్టులో నిరూపించగలిగితే కోర్టు మీ పెళ్లిని నల్ అండ్ వాయిడ్‌గా డిక్లేర్ చేస్తూ, మీకు విడాకులు మంజూరు చేస్తుంది. తర్వాత మీకు నచ్చినట్లు జీవించవచ్చు. మా పెళ్లయి 15 సంవత్సరాలైంది. మాకు పదేళ్ల కొడుకు ఉన్నాడు. ఇన్నాళ్లూ అన్యోన్యంగానే ఉన్నాం. అయితే నా భార్య తన చిన్ననాటి స్నేహితుడితో సంబంధం పెట్టుకుంటున్నట్లు ఈ మధ్యే బయటపడింది. నేను అది జీర్ణించుకోలేకపోతున్నాను. నాకిక ఈ వైవాహిక బంధాన్ని కొనసాగించడం ఇష్టం లేదు. నేను ఏం చేయాలి? - ఉమాశంకర్, నిజామాబాద్ మీరు ఇప్పుడు చెప్పిన విషయాలను రుజువు చేస్తూ, కోర్టులో డైవోర్స్ ఆఫ్ క్రూయెల్టీ కింద కేసు వేసి, కోర్టులో అక్రమ సంబంధాన్ని ప్రధాన కారణంగా చూపిస్తూ విడాకులు తీసుకోవచ్చు. వివాహిత స్త్రీ, భర్త బతికుండగా వేరొకరితో అక్రమ సంబంధం నడపటం చట్టవ్యతిరేకం కాబట్టి మీకు కచ్చితంగా విడాకులు మంజూరవుతాయి. మాకు పెళ్లయి ఏడేళ్లయింది. ఆరు సంవత్సరాల బాబు, నాలుగు సంవత్సరాల పాప ఉన్నారు. నా భర్య నాతో గొడవ పెట్టుకుని, నా మీద అలిగి, ఏడాది క్రితం యూఎస్ వెళ్లిపోయింది. అప్పటినుంచి పిల్లలిద్దరూ ఆమె తలిదండ్రుల సంరక్షణలోనే ఉన్నారు. వృద్ధులైన నా అత్తమామలు నా పిల్లల్ని సరిగ్గా చూడలేకపోతున్నారు. నా పిల్లల బాధ వర్ణనాతీతం. వాళ్లంతా కలిసి పిల్లల్ని నాకు చూపించకుండా నన్ను నరకయాతనకు గురి చేస్తున్నారు. నా భార్య నాకు డైవోర్స్ ఇవ్వకుండా, నా అనుమతి లేకుండా ఇలా విదేశాలకు వెళ్లడం భావ్యమేనా? - జితేందర్, నెల్లూరు మీరన్నట్లు మీ అనుమతి లేకుండా మీ భార్య పిల్లల్ని తన తలిదండ్రుల సంరక్షణలో ఉంచి, విదేశాలకు వెళ్లిపోవడం, తన అడ్రస్ కూడా మీకు తెలియకుండా రహస్యంగా ఉంచటం చట్ట వ్యతిరేకమే. పిల్లలకు చట్టప్రకారం తండ్రే నేచురల్ గార్డియన్. మైనర్ పిల్లలు తల్లి లేదా తండ్రి సంరక్షణలో ఉండటం సహజం. కానీ ఈ కేసులో మీ భార్య తన బాధ్యతను విస్మరించి పిల్లల సంరక్షణను తీసుకోకపోవడమే గాక తన తలిదండ్రులకు ఇచ్చి వెళ్లిపోవడం చట్ట వ్యతిరేకం. కాబట్టి మీరు మీ పిల్లల కస్టడీ కోసం ఫ్యామిలీ కోర్టులో కేసు వేయండి. తల్లి మైనర్ పిల్లల సంరక్షణ సరిగా చేయలేకపోతోంది కాబట్టి తండ్రిగా మీకు పిల్లల కస్టడీ పొందే అధికారం, హక్కు న్యాయబద్దంగా దక్కవచ్చు. మీరు నాతో చెప్పినవన్నీ కోర్టులో జడ్జిగారికి కూడా వివరించండి. జడ్జిగారు మీ సమస్యను సానుభూతితో అర్థం చేసుకుని, మీ పిల్లల సంరక్షణను మీకు తప్పక అప్పగించే అవకాశం ఉంది. మీరు ప్రయత్నించి చూడండి. నిశ్చల సిద్ధారెడ్డి అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్ -
హృదయం: మలుపు మలుపులోనూ ఉన్నదొక్కటే... ప్రేమ!
పెళ్లి తంతు ముగించేసరికే ఓ జీవితం పూర్తయినంత గొప్ప అనుభూతి కలిగింది. ఇక మా జీవన పయనంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పరిష్కరించుకోగలమని, మేం కలకాలం సంతోషంగా జీవించగలమని నమ్మకం కుదిరింది. ఆమెది దక్షిణం. అతనిది ఉత్తరం. ఇద్దరూ పెళ్లి చేసుకుంటే! వినడానికి చాలా సింపుల్‌గా అనిపించొచ్చు! కానీ ఈ కథలో ఎన్నో మలుపులున్నాయి. ఆ చిత్రమైన అనుభూతుల్ని, అనుభవాల్ని తన మాటల్లో వివరిస్తోంది చెన్నై అమ్మాయి అపర్ణ చంద్ర. మాది తమిళ బ్రాహ్మణ కుటుంబం. సంప్రదాయాలకు పెద్దపీట వేసినా, నా స్వేచ్ఛకు ఏనాడూ అడ్డు చెప్పలేదు అమ్మానాన్న. అప్పటికి నాకు 20 ఏళ్లు కూడా నిండలేదు. ఇంజనీరింగ్ చదువుతూ ఓ ప్రాజెక్టులో భాగంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో పాల్గొనేందుకు ఛత్తీస్‌ఘడ్‌లోని భిలాయ్ స్టీల్ ప్లాంట్‌కు వెళ్లా. తొలి రెండు రోజులు అధికారులతో కలిసి పనిచేసేసరికి బోర్ కొట్టేసింది. మూడోరోజు... ఓ కుర్రాడు వచ్చాడు. అతని చురుకుదనం, పనితనం అన్నీ నాకు నచ్చాయి. అప్పటికిదాకా భారంగా గడుస్తున్న కాలం అతను రాగానే పరుగందుకుంది. కాసేపటి పరిచయం తర్వాత అతని పేరు వికాస్ అని, తనది జార్ఖండ్ అని తెలిసింది. ఎడారిలో ఒయాసిస్సులా కనిపించిన అతడితో పరిచయం కాగానే నేనే అడిగి నంబర్ తీసుకున్నా. సాయంత్రం నేనే ఫోన్ చేశా. మరుసటి రోజు లంచ్‌కు కలిశాం. తనకు తమిళం రాదు కానీ, నాకు హిందీ వచ్చు. దీంతో మా మధ్య మాటల ప్రవాహానికి అడ్డే లేకపోయింది. అక్కడున్నన్ని రోజులు ఎలా గడిచాయో తెలియదు. ఇద్దరం కలవని రోజు లేదు. మాట్లాడుకోని సమయం లేదు. కొన్ని రోజులకే మా బంధం చాలా బలపడిపోయింది. ఒకర్ని విడిచి ఒకరు ఉండలేని స్థితికి చేరుకున్నాం. అంతలోనే అతను నాకు ఐ లవ్యూ చెప్పాడు. పెళ్లి చేసుకుందామన్నాడు. అయితే నా వయసు మరీ తక్కువ కావడంతో అప్పుడే పెళ్లేంటని అనిపించింది. ఏం చెప్పాలో తెలియలేదు. అదే సమయంలో నాకు ఢిల్లీలో ఉద్యోగం వచ్చింది. అప్పుడు మొదలైంది నాలో అంతర్మథనం. వికాస్‌ను వదిలి వెళ్లడం నా వల్ల కాలేదు. అప్పుడే అర్థమైంది అతణ్ని విడిచి నేను ఉండలేనని. తననే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇద్దరం తల్లిదండ్రుల్ని ఒప్పించాలని ప్రయత్నించాం. మా ఇంటికి వెళ్లి విషయం చెప్పేశా. నేను ఇంత త్వరగా పెళ్లి చేసుకుంటాననడంపై మావాళ్లు ఆశ్చర్యపోయారు. వికాస్‌తో పెళ్లికి ముందు కాస్త తటపటాయించినా, అతనప్పటికే బాగా స్థిరపడి ఉండటంతో సరేనన్నారు. వికాస్ నన్ను తీసుకెళ్లి వాళ్ల తల్లిదండ్రులకు పరిచయం చేశాడు. నేను తమిళియన్ అయినా, చక్కగా హిందీలో మాట్లాడేసరికి వాళ్లు చాలా సంతోషించారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ, పెళ్లి సంగతి మాట్లాడేటప్పుడు మొదలయ్యాయి ఇబ్బందులు. మొదట నిశ్చితార్థం వరకు సింపుల్‌గా అయిపోయింది కానీ, పెళ్లి దగ్గరే వచ్చింది చిక్కు. మేం పెళ్లి మా సంప్రదాయం ప్రకారం చేయాలన్నాం. వాళ్లు ఒప్పుకోలేదు. బీహారి స్టైల్లోనే చేయాలన్నారు. మేం వెజిటేరియన్స్, పెళ్లిలో మాంసం అన్నది కలలోనూ ఊహించలేం. వాళ్లేమో అతిథులకు నాన్ వెజ్ తప్పనిసరి అన్నారు. మాకు భోజనాలు అరటాకులపై పెట్టడం అలవాటు. వాళ్లు బఫే అన్నారు. మేం తెల్లవారుజామున ముహూర్తం కావాలన్నాం. వాళ్లు రాత్రి ముహూర్తం చూసుకున్నారు. పెళ్లిలో మెహందీ అన్నారు, సంగీత్ అన్నారు, నా నుదుటిపై సిందూరం దిద్దారు, లక్క గాజులు తొడిగారు. మా వాళ్లంతా సిల్క్ చీరలు కడితే, వాళ్లు డిజైనర్ చీరల్లో వచ్చారు. నా కజిన్స్ పెళ్లికొడుక్కి షూ తొడిగి, డబ్బులడిగితే, వాళ్లు వింతగా చూశారు. ఇలా అంతా కొత్తకొత్తగా సాగిపోయింది మా పెళ్లి. అయితే ఇంత వైరుధ్యమున్నా, ఒకరి సంప్రదాయాల్ని ఒకరం గౌరవించాం. ఎక్కడా ఏ గొడవా రాకుండా పెళ్లి కానిచ్చాం. ఆశ్చర్యకరంగా అప్పగింతల సమయంలోనూ మా తల్లిదండ్రులు బెంగపడలేదు. పెళ్లి తంతు ముగించేసరికే ఓ జీవితం పూర్తయినంత గొప్ప అనుభూతి కలిగింది. ఇక మా జీవన పయనంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పరిష్కరించుకోగలమని, మేం కలకాలం సంతోషంగా జీవించగలమని నమ్మకం కుదిరింది. 2007లో పెళ్లి చేసుకున్న మాకు 2010లో బాబు పుట్టాడు. వాడి పేరు అక్షత్ చంద్ర. మేమిద్దరం పరస్పరం భాష, సంస్కృతి, సంప్రదాయాల్ని గౌరవించుకోవడం, సర్దుబాట్లు చేసుకోవడం నేర్చుకున్నాం. తనకు నచ్చింది తను తింటే, నాకు నచ్చింది నేను తింటా. మా బాబుకు నచ్చింది వాడికి పెడతాం. ఈ ఏడేళ్ల జీవితం నాకెన్నో అనుభవాల్ని మిగిల్చింది. మున్ముందు మరెన్నో గొప్ప అనుభూతుల్ని అందిస్తున్న ఆశ నాలో ఉంది. -
శ్రీవారి సాక్షిగా... కల్యాణమస్తు!
భారతీయ ఆశ్రమ ధర్మాలకు ఊపిరి వంటిది వివాహ వ్యవస్థ. పవిత్రమైన ఈ వివాహ బంధం పటిష్టతకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గట్టి పునాదులు వేసింది. పెళ్లి వేడుకల వల్ల పేద కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా కల్యాణమస్తు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏడుకొండల వాడి ఆశీస్సులతో ఇప్పటివరకూ ఏడడుగులు వేసిన జంటలు వేలల్లో ఉన్నాయి. సనాతన హైందవ ధర్మాలను విస్తృతం చేయటమే తిరుమల తిరుపతి దేవస్థానం లక్ష్యం. ఎప్పటికప్పుడు సరికొత్త కార్యక్రమాలను ఆరంభించి... ధర్మప్రచారం, శ్రీనివాసుని వైభవం, భక్తితత్వాన్ని జనబాహుళ్యంలోకి తీసుకెళ్లటంలో టీటీడీ సఫలీకృతమవుతోంది. కల్యాణమస్తు కార్యక్రమం ద్వారా హిందూ వివాహ వ్యవస్థకు గట్టి పునాది వేసింది. పెళ్లి వేడుకల పేరుతో పేద కుటుంబాలు ఆర్థికంగా మరింత కుంగిపోకూడదని భావించిన ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి... రాష్ట్రంలోని పేదల్ని వివాహ బంధంతో ఒక్కటి చేయాలని సూచన చేశారు. దాంతో అప్పటి టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి కల్యాణమస్తు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శ్రీవారి సాక్షిగా కలసిన బంధాలు! శ్రీవేంకటేశ్వరస్వామి దివ్యాశీస్సులతో 2007 ఫిబ్రవరి 22వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఆరు విడతల్లో 45,209 జంటలు వివాహ బంధంతో ఒక్కటయ్యాయి. 10 తెలంగాణ జిల్లాల్లో అత్యధికంగా 21,198 మంది ఒక్కటవగా, తొమ్మిది జిల్లాలు కలిగిన కోస్తాంధ్రలో 17,307 జంటలు, రాయలసీమ ప్రాంతంలో మొత్తం 6,704 జంటలు వివాహం చేసుకున్నారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 7 వేల వివాహాలు జరిగాయి. సామూహికంగా నిర్వహించిన ఈ కల్యాణమస్తులో ఒక్కో వివాహానికి టీటీడీ రూ.7 వేలు ఖర్చు చేసింది. పెళ్లికి అవసరమైన పూజా సామగ్రి నుంచి పసందైన విందు భోజనం వరకు అన్నీ ధార్మిక సంస్థే ఉచితంగా అందజేసింది. నూతన వధూవరులకు ఇచ్చిన బంగారు తాళిబొట్లు, వెండి మట్టెలు, కంకణాలు, వధూవరులకు నూతన వస్రాలు, పూజా సామగ్రి, ధార్మిక స్తోత్ర పుస్తకాలకు తిరుమల ఆలయంలోని గర్భాలయ మూలమూర్తి పాదాల వద్ద, ఆ తర్వాత లోకమాత తిరుచానూరు అలమేలుమంగమ్మ పాద పద్మాల చెంత పూజలు చేసి పంపిణీ చేశారు. రాష్ట్రంలోని 23 జిల్లాల్లోని టీటీడీ కల్యాణమండపాల్లోనూ, ఆలయాల్లోనూ వివాహ తంతును వేడుకగా నిర్వహించారు. వధూవరుల బంధువులకు ఉచిత విందు భోజనాన్ని స్వామి ప్రసాదంగా టీటీడీ సమకూర్చింది. తర్వాత వధూవరులు, వారి తల్లిదండ్రులకు శ్రీవారి దర్శనం కల్పించి ఆశీస్సులు అందించింది. పేద కుటుంబాల్లో ఆనందోత్సాహం పేదల పక్షపాతి అయిన దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆదరణ, తిరుమలేశుని ఆశీస్సులతో రాష్ట్రంలోని 23 జిల్లాల్లోనూ కల్యాణమస్తు ద్వారా ఒక్కటైన పేద కుటుంబాలు నేడు పిల్లాపాపలతో కళకళలాడుతున్నాయి. సంతానం, సౌభాగ్యం, ఆనందోత్సాహాలతో వారి జీవితాలు వర్థిల్లుతున్నాయి. శ్రీనివాసస్వామి, పద్మావతి అమ్మవారి దీవెనలతో పెళ్లి కావటం వల్ల తమకు పుట్టిన సంతానానికి శ్రీనివాసుడు, వేంకటేశ్వరుడు, మహాలక్ష్మి, పద్మావతి అంటూ వారి పేర్లు పెట్టుకుని మురిసిపోతున్నారు. మరికొందరైతే రాజశేఖరరెడ్డిపై ఉన్న అభిమానంతో తమ కొడుకులకు ఆయన పేరు పెట్టుకున్నామని ఆనంద వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఏడుకొండలవాడి ఆశీస్సులతో పెళ్లి చేసుకున్నాం. స్వామి పాదాల వద్ద ఉంచిన తాళిబొట్లు, మట్టెలు, బట్టలు కానుకగా అందాయి. మాకిప్పుడు ఇద్దరు పిల్లలు... షర్మిల, శ్రావణి’’ అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు పశ్చిమగోదావరి జిల్లా కాపవరంలో పేద వర్గానికి చెందిన వీర్రాజు, స్వాతి. ‘‘రాజన్న చల్లని దీవెనలతో మా పెళ్లి విశాఖపట్నం టీటీడీ కల్యాణమండపంలో జరిగింది. మాలాంటి వారు ఇబ్బంది పడకూడదనే రాజశేఖరరెడ్డిగారు ఈ కార్యక్రమాన్ని పెట్టించారు. మాకు కొత్త జీవితాన్ని ప్రసాదించిన ఆయనకు, ఏడుకొండలవాడికి రుణపడి ఉన్నాం’’ అన్నారు కొత్త పరదేశిపాళెం నివాసి, ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్‌లో క్యూరేటర్‌గా పనిచేస్తున్న కృష్ణారావు, ఆయన భార్య రామలక్ష్మి. వీళ్లు మాత్రమే కాదు... కళ్యాణమస్తు ద్వారా వైవాహిక బంధాన్ని ముడి వేసుకున్నవారు ఎందరో ఉన్నారు. వారందరూ చెప్పేది ఒక్కటే. ఏడుకొండలవాడి ఆశీర్వాదం, రాజన్న అండ లేకుంటే మేమిలా ఉండేవాళ్లం కాదు అని! శుభమస్తు... కళ్యాణమస్తు..! ఆరువిడతల్లో జరిగిన కల్యాణమస్తు వివరాలివి 1. 2007, ఫిబ్రవరి 22న 4658 2. 2007, ఆగస్టు 26న 8113 3. 2008, మార్చి 9న 6373 4. 2008, నవంబరు2న 7090 5. 2009- అక్టోబరు 28న 7724 6. 2011 మే 20న 11,251 మొత్తం 45,209