
ఆ దర్శకుడు సారీ చెప్పాలి : మాజీ మంత్రి
‘ఇక సె.. లవ్’ సినిమాలో మన సాంప్రదాయాలు, వివాహవ్యవస్థను అపహాస్యం చేసేలా ఉందని మాజీ మంత్రి, భారతీయ జనతాపార్టీ అధికార ప్రతినిధి పుష్పలీల అన్నారు.
హైదరాబాద్:
‘ఇక సె.. లవ్’ సినిమా భారతీయ సాంప్రదాయాలు, వివాహవ్యవస్థను అపహాస్యం చేసేలా ఉందని మాజీ మంత్రి, భారతీయ జనతాపార్టీ అధికార ప్రతినిధి పుష్పలీల అన్నారు. భారతీయ వివాహవ్యవస్థ అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో గౌరవం ఉందని తెలిపారు. వెంటనే చిత్ర దర్శకుడు నాగరాజు మహిళలకు క్షమాపణ చెప్పాలని, బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. చిత్ర దర్శకునిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు.
గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో పుష్పలీల మాట్లాడారు. వృద్దాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఇంట్లో పెట్టుకుంటే తమ పిల్లల చదువులకు ఆటంకం కలుగుతుందని, వృద్ధాప్యం రాగానే ఆశ్రమాల్లో వేసేయాలని చిత్రంలో చూపించినట్లు వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాహ వ్యవస్థను కించపరుస్తూ ఎన్నో డైలాగులు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.