pushpaleela
-
మళ్లీ కట్టెల వంటే గతి
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్వాకంతో రాష్ట్రంలోని మహిళలు కట్టెలతో వంట చేసుకునే రోజులు మళ్లీ దాపురించబోతున్నాయని మాజీ మంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు కె.పుష్పలీల ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె గురువారం గాంధీ భవన్లో విలేకరులతో టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు కోట నీలిమ, కల్వ సుజాతలతో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రూ.400 ఉన్న వంట గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు రూ.1200కు చేరడం శోచనీయమన్నారు. గ్యాస్ సిలిండర్ల ధరల పెంపే బీజేపీకి మహిళలపై ఉన్న నిబద్ధత తెలియజేస్తుందని విమర్శించారు. -
ఆ దర్శకుడు సారీ చెప్పాలి : మాజీ మంత్రి
హైదరాబాద్: ‘ఇక సె.. లవ్’ సినిమా భారతీయ సాంప్రదాయాలు, వివాహవ్యవస్థను అపహాస్యం చేసేలా ఉందని మాజీ మంత్రి, భారతీయ జనతాపార్టీ అధికార ప్రతినిధి పుష్పలీల అన్నారు. భారతీయ వివాహవ్యవస్థ అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో గౌరవం ఉందని తెలిపారు. వెంటనే చిత్ర దర్శకుడు నాగరాజు మహిళలకు క్షమాపణ చెప్పాలని, బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. చిత్ర దర్శకునిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో పుష్పలీల మాట్లాడారు. వృద్దాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఇంట్లో పెట్టుకుంటే తమ పిల్లల చదువులకు ఆటంకం కలుగుతుందని, వృద్ధాప్యం రాగానే ఆశ్రమాల్లో వేసేయాలని చిత్రంలో చూపించినట్లు వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాహ వ్యవస్థను కించపరుస్తూ ఎన్నో డైలాగులు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వివాహిత ఆత్మహత్యాయత్నం
గార్లదిన్నె: మండలంలోని కొట్టాలపల్లిలో పుష్పలీల అనే వివాహిత ఆదివారం ఆత్మహత్యాయత్నం చేసినట్లు స్థానికులు తెలిపారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆమె ఈ చర్యకు యత్నించినట్లు వివరించారు. వెంటనే ఆమెను 108లో అనంతపురం పెద్దాస్పత్రికి తరలించారు.