
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్వాకంతో రాష్ట్రంలోని మహిళలు కట్టెలతో వంట చేసుకునే రోజులు మళ్లీ దాపురించబోతున్నాయని మాజీ మంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు కె.పుష్పలీల ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె గురువారం గాంధీ భవన్‌లో విలేకరులతో టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు కోట నీలిమ, కల్వ సుజాతలతో మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రూ.400 ఉన్న వంట గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు రూ.1200కు చేరడం శోచనీయమన్నారు. గ్యాస్ సిలిండర్ల ధరల పెంపే బీజేపీకి మహిళలపై ఉన్న నిబద్ధత తెలియజేస్తుందని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment