సినీ దర్శకుడు రవిశంకర్ (63) చెన్నైలో ఆత్మహత్య చేసుకున్నారు. భాగ్య పత్రికలో కథారచయితగా జీవితాన్ని ప్రారంభించిన రవిశంకర్ ఆ తరువాత దర్శకుడు కె.భాగ్యరాజ్, దర్శకుడు విక్రమన్‌ల వద్ద సహాయదర్శకుడిగా పనిచేశారు. కాగా శరత్‌కుమార్, దేవయాని జంటగా విక్రమన్ దర్శకత్వంలో రూపొందిన సూర్యవంశం చిత్రానికి రవిశంకర్ సహాయ దర్శకుడిగా పనిచేయడంతోపాటు, అందులోని రోసాపూ అనే సూపర్‌హిట్ పాటను రాశారు.
కాగా నటుడు మనోజ్ భారతీరాజా హీరోగా నటించిన వర్షమెల్లామ్ వసంతం చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ చిత్రంలోని అన్ని పాటలను రవిశంకరే రాశారు. అయితే ఆ తరువాత ఈయనకు మరో అవకాశం రాలేదు. కాగా అవివాహితుడైన రవిశంకర్ స్థానిక కేకే.నగర్‌లోని ఒక చిన్న గదిలో అద్దెకు ఉంటున్నారు.
అయితే సినిమా అవకాశాలు లేక, పేదరికంలో జీవిస్తున్న ఈయన మానసిక వేదనతో ఉరి వేసుకుని బలవర్మణానికి పాల్పడినట్లు తెలిసింది. సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి వెళ్లి రవిశంకర్ భౌతికకాయాన్ని పోస్ట్‌మార్టానికి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈయన ఆత్మహత్యకు కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. రవిశంకర్ మర ణం కోలీవుడ్‌ను దిగ్భ్రాంతికి గురిచేసింది.
Comments
Please login to add a commentAdd a comment