8 Strange Marriage Traditions: Why Africa Wodaabe Tribe Men Steals Others Wives For Marriage - Sakshi
Sakshi News home page

Strange Marriage Traditions: పొరపాటున నవ్వినా పెళ్లి క్యాన్సిల్‌..ఈ వింతైన సంప్రదాయల గురించి తెలుసా?

Published Wed, Jul 5 2023 1:21 PM | Last Updated on Fri, Jul 14 2023 3:40 PM

Strange Traditions: Story On Why Africa Wodaabe Tribe Men Steals Others Wives For Marriage - Sakshi

ఒక్కరి జీవితంలోనూ పెళ్లి అనేది ఒక అందమైన వేడుక. ఒక్కో దేశంలో ఒక్కో విధంగా పెళ్లిళ్లు చేసుకుంటుంటారు. మన దేశంలోనూ కులం, మతం, ప్రాంతాన్ని బట్టి ఆచార వ్యవహారాలు మారిపోతుంటాయి. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం పెళ్లిళ్లు ఎవరూ ఊహించని విధంగా జరుగుతాయి.

ఆడవాళ్లు ఒక్కసారే స్నానం చేయాలి, పెళ్ళిలో విష సర్పాలను మామ అల్లుడికి కానుకగా ఇవ్వడం, వేరొకరిని భార్యను దొంగలించి పెళ్లి చేసుకోవడం ..లాంటి చిత్రవిచిత్రమైన సంప్రదాయాలు ఉన్నాయి. అలా ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దిక్కుమాలిన, వింతైన ఆచారాలు ఏంటన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

► పశ్చిమ ఆఫ్రికాలో వోడబ్బే అనే తెగ ప్రజలు పెళ్లి చేసుకోవాలనుకుంటే,లేదా అప్పటికే వివాహం అయినప్పటికీ.. వేరే వారి భార్యలను ఎత్తుకెళ్లి మరీ పెళ్లి చేసుకుంటారట. ఇదెక్కడి దిక్కుమాలిన ఆచారాం అనుకుంటున్నారా? వినడానికి వింతగా అనిపించినా  ఇది అక్కడి ఆచారమట.  పూర్వీకుల కాలం నాటినుంచి దీన్ని ఆచరిస్తున్నారట. ఆఫ్రికాలోని వోడాబ్బే తెగ ప్రజలు ప్రతి ఏడాది గారెవోలు అనే పండుగను నిర్వహిస్తారు.

► ఈ వేడకలో వేరొకరి భార్య ఇంకొకరితో పారిపోతే.. దానికి ఎటువంటి అభ్యంతరం చెప్పరు. అందరి ఆమోదంతో మళ్లీ వివాహం చేస్తారు. ఈ పండుగలో అబ్బాయిల ముఖం మీద పెయింట్ వేసుకుంటారట. ఈ సమయంలోనే వివాహిత మహిళలను ఆకర్షించడానికి శతవిధాలా ప్రయత్నిస్తారట.అలా వారి ప్రయత్నాలకు ఎవరైతే ఆకర్షితులై వేరొకరితో పారిపోతే.. దానికి ఎటువంటి అభ్యంతరం చెప్పరు. 

► చైనాలో ఓ వింత ఆచారం ఉంది. పెళ్లికి నెల రోజుల ముందు నుంచిపెళ్లి కూతురు రోజుకో గంట తప్పకుండా ఏడ్వాల్సిందేనట. అంతేకాదు, పది రోజుల తర్వాత ఆ నవ వధువుకు తోడుగా వాళ్ల అమ్మ కూడా ఆ ఏడుపులో పాలు పంచుకోవాలి. మరో పది రోజుల తర్వాత ఆమెకు వాళ్ల అమ్మమ్మ తోడవుతుంది. నెల చివర్లో అమ్మాయి కుటుంబ సభ్యుల్లో మహిళలంతా ఆమెకు సహాయంగా ఏడుస్తారు. అలా ఆడవారి ఏడుపుతో వచ్చే వివిధ రాగాలను పెళ్లి వారంతా ఆనందిస్తారట.

► ఇంకో వింతైన ఆచారం ఏంటంటే..పెళ్లి తంతు ముగిసే వరకు పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు నవ్వకూడదట. అలా నవ్వితే అరిష్టంగా భావించి వివాహమే రద్దు చేస్తారట.

► ఇండోనేసియాలోని సుంబా దీవిలో ఏ కుర్రాడికైనా అమ్మాయి నచ్చితే కిడ్నాప్ చేసి తరువాత ఆమెను పెళ్లి చేసుకుంటాడట.

► మన దేశంలో బీహార్లోని కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ వింతైన ఆచారాన్ని పాటిస్తున్నారు. దాని పేరే  ‘రాక్షస వివాహం‘.  ఈ ఆచారం ప్రకారం వరుడిని దొంగతనంగా ఎత్తుకెళ్లి వధువుతో తాళి కట్టిస్తారట. ఒకవేళ ఆ వరుడికి ఇష్టం లేకపోతే బలవంతంగా బెదిరించి మరీ పెళ్లి చేస్తారట. 

► మౌంట్ అబు పెళ్లి ఆచారం గమ్మత్తుగా ఉంటుంది. ఇక్కడ పెళ్లైన త‌రువాత అబ్బాయిలు ఇల్ల‌రికం వ‌స్తారు. అబ్బాయి అత్త‌వారింటికి వ‌చ్చి అక్క‌డే స్థిర‌ప‌డ‌తాడు. అంతేకాదు అక్క‌డే ప‌నులు చూసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటాడు.

► ఇక దక్షిణ సూడాన్‌లో పాటించే ఆచారాలు గురించే తెలిస్తే.. ముక్కున వేలు వేసుకుంటారు. వార్ని.. ఇదేం దిక్కుమాలిన ఆచారంరా బాబు అని తలలు పట్టుకుంటారు. అక్కడి అమ్మాయిలను శవాలకు ఇచ్చి పెళ్లి చేసే సంప్రదాయం ఉందట. వినడానికి వింతగా ఉన్నా ఇంకా అక్కడి ప్రజలు ఈ ఆచారాన్ని ఫాలో అవుతున్నారు. 

ఇటలీ పెళ్లిళ్లలో ప్రత్యేకంగా నిర్వహించే ఒక కార్యక్రమంలో వధూవరులు ఉద్దేశపూర్వకంగా అద్దాలు పగలకొడతారు. ఆ అద్దం ఎన్ని ముక్కలయితే అంత ఆనంద పడతారు. ఆ అద్దం ఎన్ని ముక్కలుగా పగిలిందో అంత కాలం ఈ దంపతులు ఆనందంగా జీవిస్తారని నమ్ముతారు. పగిలిన అద్దం ముక్కలను లెక్కబెడుతూ సంతోషంతో నృత్యం చేస్తారు.

► జపాన్‌లో పెళ్లి పూర్తికాగానే ఆ జంట చేత మూడు గ్లాసుల్లో ఉండే వైన్‌ను తాగిస్తారు. రెండు కుటుంబాలు ఏకం అయ్యారని ప్రకటించటమే ఈ సంప్రదాయమట.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement