different traditions
-
వేరేవాళ్ల భార్యలను ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకోవచ్చు.. అది అక్కడి సంప్రదాయం
ఒక్కరి జీవితంలోనూ పెళ్లి అనేది ఒక అందమైన వేడుక. ఒక్కో దేశంలో ఒక్కో విధంగా పెళ్లిళ్లు చేసుకుంటుంటారు. మన దేశంలోనూ కులం, మతం, ప్రాంతాన్ని బట్టి ఆచార వ్యవహారాలు మారిపోతుంటాయి. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం పెళ్లిళ్లు ఎవరూ ఊహించని విధంగా జరుగుతాయి. ఆడవాళ్లు ఒక్కసారే స్నానం చేయాలి, పెళ్ళిలో విష సర్పాలను మామ అల్లుడికి కానుకగా ఇవ్వడం, వేరొకరిని భార్యను దొంగలించి పెళ్లి చేసుకోవడం ..లాంటి చిత్రవిచిత్రమైన సంప్రదాయాలు ఉన్నాయి. అలా ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దిక్కుమాలిన, వింతైన ఆచారాలు ఏంటన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ► పశ్చిమ ఆఫ్రికాలో వోడబ్బే అనే తెగ ప్రజలు పెళ్లి చేసుకోవాలనుకుంటే,లేదా అప్పటికే వివాహం అయినప్పటికీ.. వేరే వారి భార్యలను ఎత్తుకెళ్లి మరీ పెళ్లి చేసుకుంటారట. ఇదెక్కడి దిక్కుమాలిన ఆచారాం అనుకుంటున్నారా? వినడానికి వింతగా అనిపించినా ఇది అక్కడి ఆచారమట. పూర్వీకుల కాలం నాటినుంచి దీన్ని ఆచరిస్తున్నారట. ఆఫ్రికాలోని వోడాబ్బే తెగ ప్రజలు ప్రతి ఏడాది గారెవోలు అనే పండుగను నిర్వహిస్తారు. ► ఈ వేడకలో వేరొకరి భార్య ఇంకొకరితో పారిపోతే.. దానికి ఎటువంటి అభ్యంతరం చెప్పరు. అందరి ఆమోదంతో మళ్లీ వివాహం చేస్తారు. ఈ పండుగలో అబ్బాయిల ముఖం మీద పెయింట్ వేసుకుంటారట. ఈ సమయంలోనే వివాహిత మహిళలను ఆకర్షించడానికి శతవిధాలా ప్రయత్నిస్తారట.అలా వారి ప్రయత్నాలకు ఎవరైతే ఆకర్షితులై వేరొకరితో పారిపోతే.. దానికి ఎటువంటి అభ్యంతరం చెప్పరు. ► చైనాలో ఓ వింత ఆచారం ఉంది. పెళ్లికి నెల రోజుల ముందు నుంచిపెళ్లి కూతురు రోజుకో గంట తప్పకుండా ఏడ్వాల్సిందేనట. అంతేకాదు, పది రోజుల తర్వాత ఆ నవ వధువుకు తోడుగా వాళ్ల అమ్మ కూడా ఆ ఏడుపులో పాలు పంచుకోవాలి. మరో పది రోజుల తర్వాత ఆమెకు వాళ్ల అమ్మమ్మ తోడవుతుంది. నెల చివర్లో అమ్మాయి కుటుంబ సభ్యుల్లో మహిళలంతా ఆమెకు సహాయంగా ఏడుస్తారు. అలా ఆడవారి ఏడుపుతో వచ్చే వివిధ రాగాలను పెళ్లి వారంతా ఆనందిస్తారట. ► ఇంకో వింతైన ఆచారం ఏంటంటే..పెళ్లి తంతు ముగిసే వరకు పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు నవ్వకూడదట. అలా నవ్వితే అరిష్టంగా భావించి వివాహమే రద్దు చేస్తారట. ► ఇండోనేసియాలోని సుంబా దీవిలో ఏ కుర్రాడికైనా అమ్మాయి నచ్చితే కిడ్నాప్ చేసి తరువాత ఆమెను పెళ్లి చేసుకుంటాడట. ► మన దేశంలో బీహార్‌లోని కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ వింతైన ఆచారాన్ని పాటిస్తున్నారు. దాని పేరే ‘రాక్షస వివాహం‘. ఈ ఆచారం ప్రకారం వరుడిని దొంగతనంగా ఎత్తుకెళ్లి వధువుతో తాళి కట్టిస్తారట. ఒకవేళ ఆ వరుడికి ఇష్టం లేకపోతే బలవంతంగా బెదిరించి మరీ పెళ్లి చేస్తారట. ► మౌంట్ అబు పెళ్లి ఆచారం గమ్మత్తుగా ఉంటుంది. ఇక్కడ పెళ్లైన తరువాత అబ్బాయిలు ఇల్లరికం వస్తారు. అబ్బాయి అత్తవారింటికి వచ్చి అక్కడే స్థిరపడతాడు. అంతేకాదు అక్కడే పనులు చూసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటాడు. ► ఇక దక్షిణ సూడాన్‌లో పాటించే ఆచారాలు గురించే తెలిస్తే.. ముక్కున వేలు వేసుకుంటారు. వార్ని.. ఇదేం దిక్కుమాలిన ఆచారంరా బాబు అని తలలు పట్టుకుంటారు. అక్కడి అమ్మాయిలను శవాలకు ఇచ్చి పెళ్లి చేసే సంప్రదాయం ఉందట. వినడానికి వింతగా ఉన్నా ఇంకా అక్కడి ప్రజలు ఈ ఆచారాన్ని ఫాలో అవుతున్నారు. ►ఇటలీ పెళ్లిళ్లలో ప్రత్యేకంగా నిర్వహించే ఒక కార్యక్రమంలో వధూవరులు ఉద్దేశపూర్వకంగా అద్దాలు పగలకొడతారు. ఆ అద్దం ఎన్ని ముక్కలయితే అంత ఆనంద పడతారు. ఆ అద్దం ఎన్ని ముక్కలుగా పగిలిందో అంత కాలం ఈ దంపతులు ఆనందంగా జీవిస్తారని నమ్ముతారు. పగిలిన అద్దం ముక్కలను లెక్కబెడుతూ సంతోషంతో నృత్యం చేస్తారు. ► జపాన్‌లో పెళ్లి పూర్తికాగానే ఆ జంట చేత మూడు గ్లాసుల్లో ఉండే వైన్‌ను తాగిస్తారు. రెండు కుటుంబాలు ఏకం అయ్యారని ప్రకటించటమే ఈ సంప్రదాయమట. -
అపురూప సంగమం
తెలుగింటే కాదు... భారతమంతా సంక్రాంతి సంబరమే. భిన్న సంసృతులు మిళితమై... విభిన్న సంప్రదాయాల సంగమమై... మినీభారత్‌గా వెలిగిపోతున్న ఈ భాగ్యనగరంలో ఇది ఒక అపురూప వేడుక. దశాబ్దాలుగా నగరంతో మమేకమైన రాజస్థానీ, గుజరాతీ, పంజాబీ, మరాఠీలు ఎంతో ఉత్సాహంగా ఈ సంబరాన్ని జరుపుకొంటున్నారు. వారికిది లోహ్రీ... పంజాబీల సంక్రాంతికి ఓ ప్రత్యేకత ఉంది. మన కంటే ఒక రోజు ముందుగానే జరుపుకుంటారు. సంక్రాంతి పండుగనే లోహ్రీ ఉత్సవ్ అంటారు. భోగి కంటే ముందు రోజు సాయంత్రం కొత్త బట్టలు ధరిస్తారు. మహిళలు ఆభరణాలు అలంకరించుకుంటారు. భోగి మంటలు వేస్తారు. అగ్ని దేవుడిని పూజిస్తారు. నువ్వులతో చేసిన మిఠాయిలను అగ్నికి ఆహుతి చేస్తారు. భోగి మంటల చుట్టూ తిరుగుతూ... భజనలు చేస్తూ రాత్రంతా గడుపుతారు. నువ్వులు, పల్లీలు, మొక్కజొన్న, నువ్వుల, బెల్లంతో తయారు చేసిన ఐదు రకాల స్వీట్లను తయారు చేసి ప్రసాదంగా పంచుతారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందంగా ఉత్సవం చేసుకుంటారు. సికింద్రాబాద్ ప్రాంతంలో ఉన్న పంజాబీలు ఈ వేడుకను వైభవంగా జరుపుకున్నారు. భోగి పూజ మరాఠీయులు దీన్ని సంక్రాత్రి అంటారు. భోగి రోజు భోగి కూర, సజ్జ రొట్టెలు నువ్వులతో కలిపి చేస్తారు. ఇంటి ముందు ముగ్గులు వేసి, చెరకు గడలు, రేగు పండ్లు, గెనుసు గడ్డలు, చిలకడ దుంపలు, తమలపాకులు, నవధాన్యాలు, చిన్న చిన్న మట్టి కుండలు పెట్టి భోగి పూజ చేస్తారు. సంక్రాంతినాడు మహిళలందరూ విఠలేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. నువ్వులు, బెల్లం, పసుపు, కుంకుమ, తమలపాకులతో వాయనాలు ఇచ్చిపుచ్చుకుంటూ, సందడిగా గడుపుతారు. రకరకాల మిఠాయిలతో పాటు నువ్వుల లడ్డు తప్పనిసరి. ఆత్మీయ పండగ పాతనగరంలో రాజస్థానీయులు అత్యంత ఉత్సాహంగా సంక్రాంతి జరుపుకొంటారు. వీరికిది ఒకరోజు పండుగ. పెళ్లయిన మహిళలు పుట్టింటికి వెళతారు. తల్లిదండ్రులు, సోదరులు ఆత్మీయ బహుమతులు ఇస్తారు. కొత్త బట్టలతో పాటు గేవర్గనీ, నువ్వుల లడ్డు వంటి స్వీట్లు ఆడపడచులకు ఇచ్చి దీవిస్తారు. అదే రోజు మట్టి కుండలో బియ్యం, పెసరలు, చెరకు గడలు, రేగి పండ్లు, ముల్లంగి, గెనుసుగడ్డ వేసి... రంగవల్లుల్లో ఉంచుతారు. దార్ల వెంకటేశ్వరరావు