Strange things
-
వేరేవాళ్ల భార్యలను ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకోవచ్చు.. అది అక్కడి సంప్రదాయం
ఒక్కరి జీవితంలోనూ పెళ్లి అనేది ఒక అందమైన వేడుక. ఒక్కో దేశంలో ఒక్కో విధంగా పెళ్లిళ్లు చేసుకుంటుంటారు. మన దేశంలోనూ కులం, మతం, ప్రాంతాన్ని బట్టి ఆచార వ్యవహారాలు మారిపోతుంటాయి. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం పెళ్లిళ్లు ఎవరూ ఊహించని విధంగా జరుగుతాయి. ఆడవాళ్లు ఒక్కసారే స్నానం చేయాలి, పెళ్ళిలో విష సర్పాలను మామ అల్లుడికి కానుకగా ఇవ్వడం, వేరొకరిని భార్యను దొంగలించి పెళ్లి చేసుకోవడం ..లాంటి చిత్రవిచిత్రమైన సంప్రదాయాలు ఉన్నాయి. అలా ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దిక్కుమాలిన, వింతైన ఆచారాలు ఏంటన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ► పశ్చిమ ఆఫ్రికాలో వోడబ్బే అనే తెగ ప్రజలు పెళ్లి చేసుకోవాలనుకుంటే,లేదా అప్పటికే వివాహం అయినప్పటికీ.. వేరే వారి భార్యలను ఎత్తుకెళ్లి మరీ పెళ్లి చేసుకుంటారట. ఇదెక్కడి దిక్కుమాలిన ఆచారాం అనుకుంటున్నారా? వినడానికి వింతగా అనిపించినా ఇది అక్కడి ఆచారమట. పూర్వీకుల కాలం నాటినుంచి దీన్ని ఆచరిస్తున్నారట. ఆఫ్రికాలోని వోడాబ్బే తెగ ప్రజలు ప్రతి ఏడాది గారెవోలు అనే పండుగను నిర్వహిస్తారు. ► ఈ వేడకలో వేరొకరి భార్య ఇంకొకరితో పారిపోతే.. దానికి ఎటువంటి అభ్యంతరం చెప్పరు. అందరి ఆమోదంతో మళ్లీ వివాహం చేస్తారు. ఈ పండుగలో అబ్బాయిల ముఖం మీద పెయింట్ వేసుకుంటారట. ఈ సమయంలోనే వివాహిత మహిళలను ఆకర్షించడానికి శతవిధాలా ప్రయత్నిస్తారట.అలా వారి ప్రయత్నాలకు ఎవరైతే ఆకర్షితులై వేరొకరితో పారిపోతే.. దానికి ఎటువంటి అభ్యంతరం చెప్పరు. ► చైనాలో ఓ వింత ఆచారం ఉంది. పెళ్లికి నెల రోజుల ముందు నుంచిపెళ్లి కూతురు రోజుకో గంట తప్పకుండా ఏడ్వాల్సిందేనట. అంతేకాదు, పది రోజుల తర్వాత ఆ నవ వధువుకు తోడుగా వాళ్ల అమ్మ కూడా ఆ ఏడుపులో పాలు పంచుకోవాలి. మరో పది రోజుల తర్వాత ఆమెకు వాళ్ల అమ్మమ్మ తోడవుతుంది. నెల చివర్లో అమ్మాయి కుటుంబ సభ్యుల్లో మహిళలంతా ఆమెకు సహాయంగా ఏడుస్తారు. అలా ఆడవారి ఏడుపుతో వచ్చే వివిధ రాగాలను పెళ్లి వారంతా ఆనందిస్తారట. ► ఇంకో వింతైన ఆచారం ఏంటంటే..పెళ్లి తంతు ముగిసే వరకు పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు నవ్వకూడదట. అలా నవ్వితే అరిష్టంగా భావించి వివాహమే రద్దు చేస్తారట. ► ఇండోనేసియాలోని సుంబా దీవిలో ఏ కుర్రాడికైనా అమ్మాయి నచ్చితే కిడ్నాప్ చేసి తరువాత ఆమెను పెళ్లి చేసుకుంటాడట. ► మన దేశంలో బీహార్‌లోని కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ వింతైన ఆచారాన్ని పాటిస్తున్నారు. దాని పేరే ‘రాక్షస వివాహం‘. ఈ ఆచారం ప్రకారం వరుడిని దొంగతనంగా ఎత్తుకెళ్లి వధువుతో తాళి కట్టిస్తారట. ఒకవేళ ఆ వరుడికి ఇష్టం లేకపోతే బలవంతంగా బెదిరించి మరీ పెళ్లి చేస్తారట. ► మౌంట్ అబు పెళ్లి ఆచారం గమ్మత్తుగా ఉంటుంది. ఇక్కడ పెళ్లైన తరువాత అబ్బాయిలు ఇల్లరికం వస్తారు. అబ్బాయి అత్తవారింటికి వచ్చి అక్కడే స్థిరపడతాడు. అంతేకాదు అక్కడే పనులు చూసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటాడు. ► ఇక దక్షిణ సూడాన్‌లో పాటించే ఆచారాలు గురించే తెలిస్తే.. ముక్కున వేలు వేసుకుంటారు. వార్ని.. ఇదేం దిక్కుమాలిన ఆచారంరా బాబు అని తలలు పట్టుకుంటారు. అక్కడి అమ్మాయిలను శవాలకు ఇచ్చి పెళ్లి చేసే సంప్రదాయం ఉందట. వినడానికి వింతగా ఉన్నా ఇంకా అక్కడి ప్రజలు ఈ ఆచారాన్ని ఫాలో అవుతున్నారు. ►ఇటలీ పెళ్లిళ్లలో ప్రత్యేకంగా నిర్వహించే ఒక కార్యక్రమంలో వధూవరులు ఉద్దేశపూర్వకంగా అద్దాలు పగలకొడతారు. ఆ అద్దం ఎన్ని ముక్కలయితే అంత ఆనంద పడతారు. ఆ అద్దం ఎన్ని ముక్కలుగా పగిలిందో అంత కాలం ఈ దంపతులు ఆనందంగా జీవిస్తారని నమ్ముతారు. పగిలిన అద్దం ముక్కలను లెక్కబెడుతూ సంతోషంతో నృత్యం చేస్తారు. ► జపాన్‌లో పెళ్లి పూర్తికాగానే ఆ జంట చేత మూడు గ్లాసుల్లో ఉండే వైన్‌ను తాగిస్తారు. రెండు కుటుంబాలు ఏకం అయ్యారని ప్రకటించటమే ఈ సంప్రదాయమట. -
హాట్ టాపిక్‌గా పుతిన్ ఆరోగ్యం.. ఇంజెక్షన్లతో నల్లగా మారిన చేతులు
మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం దిగినప్పటి నుంచి పాశ్చాత్య దేశాలన్ని పుతిన్ ఆరోగ్యంపై దృష్టి సారించాయి. పుతిన్ ఆరోగ్యం విషమంగా ఉందని ఇక ఆయన ఎన్నోరోజులు బతకరు అంటూ పలు వార్తలు హల్చల్ చేశాయి. ఆ తర్వాత యూకే ఇంటెలిజెన్స్ పుతిన్‌కి క్యాన్సర్ అంటూ ఒక నివేదికలో పేర్కొంది. ఆ తర్వాత గతేడాది మార్చిలో ఆయనపై హత్యయత్నం జరిగిందని త్రుటిలో తప్పించుకున్నట్లు వార్తలు కూడ వచ్చాయి. ఇప్పడు మళ్లీ ఆయన ఆరోగ్యం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు గుప్పుమంటున్నాయి. పుతిన్ ఆరోగ్యం బాగోలేదంటూ ఫోటో ఒకటి సామాజిక మాధ్యమంలో వైరల్ అవ్వడంతో పుతిన్ శరీరం రంగుమారిందని, వింత వింత గుర్తులు ఉన్నాయంటూ పలు వార్తలు గుప్పుమన్నాయి. అంతేగాక రిటైర్డ్ బ్రిటీష్ ఆర్మీ అధికారి, హౌస్ లార్డ్స్ సభ్యుడు రిచర్డ్ డానాట్ ఒక మీడియా సమావేశంలో పుతిన్ ఆరోగ్యం గురించి మాట్లాడారు. పుతిన్ ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడో తెలుసుకోవడం అత్యంత ముఖ్యం అని చెప్పారు. అతని చేతులు ఒక్కసారిగా నల్లగా మారిపోయి ఉన్నాయని, ఇలా ఏవైనా ఇంజెక్షన్ తీసుకున్నప్పుడూ శరీరం కమిలి ఇలా రంగు మారుతుందని తెలిపారు. ఇతర భాగాల నుంచి ఇంజెక్షన్ తీసుకోలేనప్పుడూ ఇలా జరుగుతుందని చెబుతున్నారు. నిపుణులు కూడా పుతిన్ ఇంజెక్షన్లు తీసుకుంటున్నారు అనడానికి ఇదే సంకేతం అని తేల్చి చెప్పారు. పుతిన్ ఇటీవలె 70 ఏళ్ల వయసులో అడుగుపెట్టారు. వయసు రీత్యా సమస్యలు ఉండటం అత్యంత సహజం. గానీ ఈ రష్యా ఏ ముహర్తానా ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిందో అప్పటి నుంచి పుతిన్ ఆరోగ్యం పెద్ద హాట్‌టాపిగా మారిపోయింది. (చదవండి: పుతిన్ ప్లాన్ అట్టర్ ప్లాప్...71 వేల మంది రష్యా సైనికులు మృతి) -
‘ఈ వింత జీవిని ముందెన్నడూ చూసుండరు!’
గజిబిజి గడ్డి ఎముకలతో కూడిన ఓ వింత కీటకం చెట్టుపై పాకుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ వింత జీవి ఎంటో తెలుసుకోవడానిక నెటిజన్ల తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. పర్వీన్ కశ్వన్ ఓ అనే ఆటవీ అధికారి దీనికి సంబంధించిన ఫొటోలను, వీడియోను ట్విటర్లో సోమవారం షేర్ చేశారు. ‘ప్రకృతిలోని ఈ అద్భుతం చూడండి. ప్రతి జీవికి ఓ పేరుంటుంది. కానీ ఈ జీవిని మాత్రం ఎప్పుడూ మనం గమనించలేదు. అయితే నేను కచ్చితంగా చెప్పగలను.. దీనిని ఇంతకు ముందెన్నడూ మీరు చూసుండరు’ అంటూ ట్వీట్ చేశారు. ఈ వీడియోలో కీటకం చెట్టుపైకి మెల్లి మెల్లిగా పాకుతూ కనిపిస్తుంది. దీన్ని మిడతేమో అంటూ అందరూ అభిప్రాయపడుతున్నారు. అయితే సన్నని గడ్డిలాంటి ఎముకలతో ఉన్న ఈ కీటకం కదలడానికి కూడా కష్టపడుతుంది. #Nature has filled every detail with precisel. Details which many a times we don't observe. Video by Maria Chacon. Believe me you have never seen such creature till now. #AmazingNature pic.twitter.com/jy0h9za8o0 — Parveen Kaswan, IFS (@ParveenKaswan) March 16, 2020 కాగా.. 44 సెకన్ల నిడివి గల ఈ వీడియో షేర్ చేసిన గంటలోపే 3 వేలకు పైగా వ్యూస్‌ను సంపాందించింది. ఈ వింత జీవి ఎంటో తెలుసుకోవడానికి నెటిజన్లు పదే పదే గమనిస్తున్నప్పటికీ వారికి స్పష్టత రావడంలేదు. ఇది పాకుతున్న తీరును చూసి నెటిజన్లు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ‘ఆకు, కర్రల్లాంటి పురుగులను చూశాం. అవి చెట్లపై ఎగురడం, గెంతడం చేస్తాయి. కానీ ఇలాంటి గడ్డి పొరకలతో కూడి.. పాకుతున్న కీటకాన్ని మాత్రం ఎప్పుడూ చూడలేదు. ఇది చాలా వింతగా ఉంది’ అని ’ఇది నిజంగా అద్భుతం.. మిడత అస్థిపంజరంలా ఉంది, దీన్ని మొదటి సారి చూస్తున్నా.. ఇది ఎక్కడా ఉంది.. దీని పేరేంటి?’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. -
ప్రయోగం.. కొంచెమైతే గోవిందా..!
ప్రపంచంలో చాలా మంది తమ కిక్కు కోసం వింత వింత పనులు, ప్రయోగాలు చేస్తుండటం గమనించే ఉంటాం. కొందరు తమ మనసుకు ఉల్లాసం కలిగించేందుకు ఎలాంటి పర్యవసానాలనూ ఆలోచించకుడా అనిపించిందే తడువుగా ఆ పనిని పూర్తి చేస్తుంటారు. ఇందులో భాగంగా ఏదైనా తప్పు జరిగినట్లయితే ఎందుకు చేశాన్రా అని.. ఏ పొరపాటూ జరగకపోతే హమ్మయ్య అనుకొని ఊపిరి పీల్చుకుంటారు. ఇలాగే ఓ వ్యక్తి కూడా దాదాపు ఓ పిచ్చి ప్రయోగం చేసి రెప్పపాటులో ప్రాణ గండం నుంచి తప్పించుకున్నాడు. దాదాపు గుండె ఆగిపోయేంతటి ప్రమాదాన్ని స్వయంగా ఎదుర్కొన్నాడు. ఇప్పుడా వీడియో యూ ట్యూబ్‌లో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో చూపించిన ప్రకారం.. ఓ వ్యక్తి ఓ రిఫ్రిజిరేటర్‌ను కొంత మంది వ్యక్తుల సహాయంతో తీసుకొచ్చి ఓ మైదానంలో తనకు దూరంగా పెట్టాడు. ఆ రిఫ్రిజిరేటర్ నిండా కొన్ని రకాల పేలుడు పదార్థాలు నింపాడు. అనంతరం రెండు శాఖలుగా విడిపోయిన ఓ పెద్ద చెట్టు చాటుకు వెళ్లి నిలుచున్నాడు. చెట్టుకు ఉన్న రెండు శాఖల మధ్యలో నుంచి తుపాకీని ఎక్కుపెట్టి నేరుగా ఆ రిఫ్రిజిరేటర్కు గురి చూసి షూట్ చేశాడు. దాంట్లో పేలుడు పదార్థాలు ఉన్న కారణంగా... అది భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ పేలుడు ధాటికి రిఫ్రిజిరేటర్ డోర్ నేరుగా అతడి మీదకే దూసుకొచ్చింది. అదృష్టం కొద్దీ... అతడు చెట్టు చాటున ఉండటంతో ఆ డోర్ దూసుకొచ్చి చెట్టుకు బలంగా తగిలింది. దీంతో రెప్పపాటులో ప్రాణాలతో అతగాడు బయటపడ్డాడు. లేదంటే ప్రయోగమెలా ఉన్నా... అసలుకే ఎసరు వచ్చేది.