ప్రయోగం.. కొంచెమైతే గోవిందా..! | Strange things, Experiment | Sakshi
Sakshi News home page

ప్రయోగం.. కొంచెమైతే గోవిందా..!

Published Sun, Jun 11 2017 1:13 AM | Last Updated on Tue, Sep 5 2017 1:17 PM

ప్రయోగం.. కొంచెమైతే గోవిందా..!

ప్రయోగం.. కొంచెమైతే గోవిందా..!

ప్రపంచంలో చాలా మంది తమ కిక్కు కోసం వింత వింత పనులు, ప్రయోగాలు చేస్తుండటం గమనించే ఉంటాం. కొందరు తమ మనసుకు ఉల్లాసం కలిగించేందుకు ఎలాంటి పర్యవసానాలనూ ఆలోచించకుడా అనిపించిందే తడువుగా ఆ పనిని పూర్తి చేస్తుంటారు. ఇందులో భాగంగా ఏదైనా తప్పు జరిగినట్లయితే ఎందుకు చేశాన్రా అని.. ఏ పొరపాటూ జరగకపోతే హమ్మయ్య అనుకొని ఊపిరి పీల్చుకుంటారు. ఇలాగే ఓ వ్యక్తి కూడా దాదాపు ఓ పిచ్చి ప్రయోగం చేసి రెప్పపాటులో ప్రాణ గండం నుంచి తప్పించుకున్నాడు. దాదాపు గుండె ఆగిపోయేంతటి ప్రమాదాన్ని స్వయంగా ఎదుర్కొన్నాడు. ఇప్పుడా వీడియో యూ ట్యూబ్‌లో వైరల్‌ అవుతోంది.

ఆ వీడియోలో చూపించిన ప్రకారం.. ఓ వ్యక్తి ఓ రిఫ్రిజిరేటర్‌ను కొంత మంది వ్యక్తుల సహాయంతో తీసుకొచ్చి ఓ మైదానంలో తనకు దూరంగా పెట్టాడు. ఆ రిఫ్రిజిరేటర్‌ నిండా కొన్ని రకాల పేలుడు పదార్థాలు నింపాడు. అనంతరం రెండు శాఖలుగా విడిపోయిన ఓ పెద్ద చెట్టు చాటుకు వెళ్లి నిలుచున్నాడు. చెట్టుకు ఉన్న రెండు శాఖల మధ్యలో నుంచి తుపాకీని ఎక్కుపెట్టి నేరుగా ఆ రిఫ్రిజిరేటర్‌కు గురి చూసి షూట్‌ చేశాడు. దాంట్లో పేలుడు పదార్థాలు ఉన్న కారణంగా... అది భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ పేలుడు ధాటికి రిఫ్రిజిరేటర్‌ డోర్‌ నేరుగా అతడి మీదకే దూసుకొచ్చింది. అదృష్టం కొద్దీ... అతడు చెట్టు చాటున ఉండటంతో ఆ డోర్‌ దూసుకొచ్చి చెట్టుకు బలంగా తగిలింది. దీంతో రెప్పపాటులో ప్రాణాలతో అతగాడు బయటపడ్డాడు. లేదంటే ప్రయోగమెలా ఉన్నా... అసలుకే ఎసరు వచ్చేది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement