
గజిబిజి గడ్డి ఎముకలతో కూడిన ఓ వింత కీటకం చెట్టుపై పాకుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ వింత జీవి ఎంటో తెలుసుకోవడానిక నెటిజన్ల తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. పర్వీన్ కశ్వన్ ఓ అనే ఆటవీ అధికారి దీనికి సంబంధించిన ఫొటోలను, వీడియోను ట్విటర్‌లో సోమవారం షేర్ చేశారు. ‘ప్రకృతిలోని ఈ అద్భుతం చూడండి. ప్రతి జీవికి ఓ పేరుంటుంది. కానీ ఈ జీవిని మాత్రం ఎప్పుడూ మనం గమనించలేదు. అయితే నేను కచ్చితంగా చెప్పగలను.. దీనిని ఇంతకు ముందెన్నడూ మీరు చూసుండరు’ అంటూ ట్వీట్ చేశారు. ఈ వీడియోలో కీటకం చెట్టుపైకి మెల్లి మెల్లిగా పాకుతూ కనిపిస్తుంది. దీన్ని మిడతేమో అంటూ అందరూ అభిప్రాయపడుతున్నారు. అయితే సన్నని గడ్డిలాంటి ఎముకలతో ఉన్న ఈ కీటకం కదలడానికి కూడా కష్టపడుతుంది.
#Nature has filled every detail with precisel. Details which many a times we don't observe. Video by Maria Chacon. Believe me you have never seen such creature till now. #AmazingNature pic.twitter.com/jy0h9za8o0
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) March 16, 2020
కాగా.. 44 సెకన్ల నిడివి గల ఈ వీడియో షేర్ చేసిన గంటలోపే 3 వేలకు పైగా వ్యూస్‌ను సంపాందించింది. ఈ వింత జీవి ఎంటో తెలుసుకోవడానికి నెటిజన్లు పదే పదే గమనిస్తున్నప్పటికీ వారికి స్పష్టత రావడంలేదు. ఇది పాకుతున్న తీరును చూసి నెటిజన్లు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ‘ఆకు, కర్రల్లాంటి పురుగులను చూశాం. అవి చెట్లపై ఎగురడం, గెంతడం చేస్తాయి. కానీ ఇలాంటి గడ్డి పొరకలతో కూడి.. పాకుతున్న కీటకాన్ని మాత్రం ఎప్పుడూ చూడలేదు. ఇది చాలా వింతగా ఉంది’ అని ’ఇది నిజంగా అద్భుతం.. మిడత అస్థిపంజరంలా ఉంది, దీన్ని మొదటి సారి చూస్తున్నా.. ఇది ఎక్కడా ఉంది.. దీని పేరేంటి?’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment