
టాలీవుడ్‌లో మరో సీనియర్ నటుడు పెళ్లి చేసుకున్నాడు. ఎన్నో సినిమాల్లో విలన్, సహాయ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న సుబ్బరాజు.. ఓ ఇంటివాడయ్యాడు.

సడన్ సర్‌ప్రైజ్ అన్నట్లు ఏకంగా తన పెళ్లి ఫొటోని పోస్ట్ చేశాడు. బీచ్ దగ్గర పెళ్లి గెటప్‌లోని పిక్ షేర్ చేసి, ఫైనల్లీ పెళ్లయిపోయిందని చెప్పుకొచ్చాడు.

ఈ క్రమంలోనే సుబ్బరాజుకి నెటిజన్లు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు

అంతా బాగానే ఉంది కానీ అమ్మాయి ఎవరు? ఏంటనేది మాత్రం సుబ్బరాజు బయటపెట్టలేదు

చూస్తుంటే ఇది పెద్దల కుదిర్చిన పెళ్లిలా అనిపిస్తుంది. ఏదేమైనా 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవడం ఆసక్తికరంగా మారింది












