ప్రశంసాపత్రాన్ని అందుకుంటున్న సుబ్బరాజు నాట్య కళాపరిషత్ అధినేత సుబ్బరాజు
తిరుపతి కల్చరల్: చిత్తూరు జిల్లా తిరుపతి కళాకారులు ఆదివారం రాత్రి గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకు న్నారు. చరిత్రాత్మక ‘అహో ఆంధ్రభోజ’ పద్యనాటకాన్ని తిరుపతి మహతి కళాక్షేత్రంలో 120 మంది కళాకారులతో ప్రద ర్శించారు. సుబ్బరాజు నాట్యకళా పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నాటకం ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమై నిరాటంకంగా 4.20 గంటల పాటు సాగింది.
కార్యక్రమానికి వరల్డ్ రికార్డ్స్ ఇండియా కో–ఆర్డినేటర్ డాక్టర్ కేవీ.రమణారావు, సౌత్ ఇండియన్ కో–ఆర్డి నేటర్ డాక్టర్ తాళ్లపాక సందీప్‌కుమార్ రికార్డు ప్రతినిధులుగా వచ్చారు. తిరుపతి కళాకారుల నాటక ప్రదర్శన రికార్డును నమోదుచేశారు. అనంతరం కళాకారులకు ప్రశంసా పత్రాలు అందించారు
Comments
Please login to add a commentAdd a comment