'ఖడ్గం'తో తన కెరీర్‌ను మొదలుపెట్టాడు నటుడు సుబ్బరాజు. అమ్మానాన్న ఓ తమిళమ్మాయి, శ్రీ ఆంజనేయం, చంటి.. ఇలా అనేక చిత్రాలతో పాపులారిటీ దక్కించుకున్నాడు. పోకిరి, దేశముదురు.. వంటి సినిమాలతో టాప్ హీరోలతోనూ నటించాడు. తక్కువ కాలంలోనే ప్రధాన క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎదిగాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను గురించి పంచుకున్నాడు.
ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లవుతోంది. ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ మంచి పాత్రలు చేస్తున్నాను. రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్ చేస్తూ ఫిట్‌గా ఉంటే మంచి రోల్స్ చేయొచ్చు, లేదంటే తండ్రి పాత్రలు చేయాల్సి వస్తుంది. భీమవరంలో నాన్న డీఎన్‌ఏ కాలేజీలో లెక్చరర్. సైకిల్ స్పీడ్‌గా తొక్కినా కూడా ఏంటి అంత వేగంగా తొక్కుతున్నావని అడిగేవారు. చిన్నప్పుడు గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారా? అని అడుగుతుంటారు. కానీ నాకు ఫ్రెండ్సే తక్కువ, అలాంటిది గర్ల్‌ఫ్రెండ్స్ కూడానా! ప్రేమించి కొన్నాళ్లు ఆరాధించడం తప్ప అంతకుమించేమీ లేదు.
పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నాకు రాలేదు, అందుకే ఇంకా వివాహం చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయాను. నాకు మంచి పాత్రలివ్వమని డైరెక్టర్లను అడగబుద్ధి కాదు. నాకు మొహమాటం ఎక్కువ. డ్రగ్స్ కేసులో చాలా డిస్టర్బ్ అయ్యాను. నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనే దానికంటే నా పేరెంట్స్ ఎఫెక్ట్ అవుతారన్న బాధ ఎక్కువైంది. వాళ్లకు ఏం చెప్పి ధైర్యం చెప్పాలి? ఇంటి తలుపు తట్టి మరీ మీ అబ్బాయి డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడంటగా అని అడుగుతారు. అయినా నన్ను ఇరికించి లోపల పడేసినా పెద్ద పోయేదేం లేదు' అని చెప్పుకొచ్చాడు సుబ్బరాజు.
చదవండి: తండ్రి వైద్యం కోసం అభిమాని ఎదురుచూపులు, ఆదుకున్న బన్నీ
Comments
Please login to add a commentAdd a comment