Subba Raju
-
డ్రగ్స్ కేసులో నన్ను లోపలేసినా పోయేదేం లేదు: సుబ్బరాజు
'ఖడ్గం'తో తన కెరీర్‌ను మొదలుపెట్టాడు నటుడు సుబ్బరాజు. అమ్మానాన్న ఓ తమిళమ్మాయి, శ్రీ ఆంజనేయం, చంటి.. ఇలా అనేక చిత్రాలతో పాపులారిటీ దక్కించుకున్నాడు. పోకిరి, దేశముదురు.. వంటి సినిమాలతో టాప్ హీరోలతోనూ నటించాడు. తక్కువ కాలంలోనే ప్రధాన క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎదిగాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను గురించి పంచుకున్నాడు. ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లవుతోంది. ఫిట్నెస్ను కాపాడుకుంటూ మంచి పాత్రలు చేస్తున్నాను. రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేస్తూ ఫిట్‌గా ఉంటే మంచి రోల్స్ చేయొచ్చు, లేదంటే తండ్రి పాత్రలు చేయాల్సి వస్తుంది. భీమవరంలో నాన్న డీఎన్ఏ కాలేజీలో లెక్చరర్. సైకిల్ స్పీడ్‌గా తొక్కినా కూడా ఏంటి అంత వేగంగా తొక్కుతున్నావని అడిగేవారు. చిన్నప్పుడు గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారా? అని అడుగుతుంటారు. కానీ నాకు ఫ్రెండ్సే తక్కువ, అలాంటిది గర్ల్‌ఫ్రెండ్స్ కూడానా! ప్రేమించి కొన్నాళ్లు ఆరాధించడం తప్ప అంతకుమించేమీ లేదు. పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నాకు రాలేదు, అందుకే ఇంకా వివాహం చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయాను. నాకు మంచి పాత్రలివ్వమని డైరెక్టర్లను అడగబుద్ధి కాదు. నాకు మొహమాటం ఎక్కువ. డ్రగ్స్ కేసులో చాలా డిస్టర్బ్ అయ్యాను. నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనే దానికంటే నా పేరెంట్స్ ఎఫెక్ట్ అవుతారన్న బాధ ఎక్కువైంది. వాళ్లకు ఏం చెప్పి ధైర్యం చెప్పాలి? ఇంటి తలుపు తట్టి మరీ మీ అబ్బాయి డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడంటగా అని అడుగుతారు. అయినా నన్ను ఇరికించి లోపల పడేసినా పెద్ద పోయేదేం లేదు' అని చెప్పుకొచ్చాడు సుబ్బరాజు. చదవండి: తండ్రి వైద్యం కోసం అభిమాని ఎదురుచూపులు, ఆదుకున్న బన్నీ -
తెరవెనుక మహేశ్, ప్రభాస్ అలా ఉంటారు : సుబ్బరాజు
కార్తిక్ సుబ్బరాజు.. టాలీవుడ్ టాప్ హీరోల సినిమాల్లో నటిస్తూ.. సక్సెఫుల్ యాక్టర్‌గా కొనసాగుతున్న నటుల్లో ఒకడు. పాజిటివ్, నెగెటివ్ రోల్ అని తేడా లేకుండా ఏ పాత్ర ఇచ్చినా అందులో ఒదిగిపోతాడు కార్తిక్. ఎన్టీఆర్, మహేశ్‌బాబు, ప్రభాస్, అల్లు అర్జున్‌ల సినిమాల్లో నెగెటివ్ రోల్ చేసి.. టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. దాదాపు 18 ఏళ్లుగా టాలీవుడ్ లో కొనసాగుతున్న ఈ యాక్టర్ తాజాగా సూపర్ స్టార్ మహేశ్‌బాబు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌లు తెరవెనుక ఎలా ఉంటారో వెల్లడించాడు. ఇటీవల ఓ క్లబ్‌హౌస్ సెషన్లో భాగంగా సుబ్బరాజు ఈ స్టార్ హీరోల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. మహేశ్‌బాబు చూడడానికి చాలా సున్నితంగా కనిపిస్తాడు కానీ ఆయన కచ్చితత్వం ఉన్న నటుడు అని కొనియాడాడు.ప్రతి విషయంలోనూ ఆయన స్పష్టత కోరుకుంటాడని, ఏ పని చేసినా ఫర్ఫెక్ట్గా చేయాలని కోరుకుంటాడని చెప్పాడు. ఇక ప్రభాస్ గురించి చెబుతూ.. ‘ఆయన చూడడానికి కఠినంగా కనిపించినా.. చాలా సున్నితమైన వ్యక్తిత్వం ఉన్న మంచి మనిషి. ఆయనతో కలిసి పని చేయడం సరదాగా ఉంటుంది’అని సుబ్బరాజు అన్నాడు. కాగా, మహేశ్‌బాబుతో కలిసి సుబ్బరాజు ‘పోకిరి’,‘దూకుడు’,‘బిజినెస్‌మేన్’, ‘శ్రీమంతుడు’చిత్రాల్లో నటించాడు. అలాగే ప్రభాస్‌తో కలిసి బాహుబలి, బుజ్జిగాడు, మిర్చి చిత్రాలలో నటించాడు. -
ఈ చూపుల్లో శూలాలున్నాయి!
కొన్నిసార్లు అతని మాట పదునుగా ఉంటుంది. కొన్ని సార్లు అతని చూపు పదునుగా ఉంటుంది. వీటన్నిటికంటే కొన్నిసార్లు అతని మౌనం కూడా అత్యంత పదునుగా ఉంటుంది. సుబ్బరాజు అంటే ‘యువ విలన్’ అనేదానికి నిలువెత్తు సంతకం. ‘‘మనలో సహజమైన ప్రతిభ ఏదో ఉండాలి. అలా లేకుంటే...ఎంత గొప్ప ఇన్స్టిట్యూట్లో చదువుకున్నా...మనతో ఉండేది డిప్లొమో తప్ప ప్రతిభ కాదు’’ అంటారు ప్రసిద్ధ విలన్ ప్రాణ్. సుబ్బరాజులో ఇన్స్టిట్యూట్ వారి డిప్లొమో పవర్ కంటే, సహజ నటన అనే పవరే ఎక్కువగా ఉంది. అదే ఆయన్ను కంప్యూటర్ ఫీల్డ్ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీకి తీసుకువచ్చింది. భీమవరంలోని డీయన్ఆర్ కాలేజీలో చదువుకున్న సుబ్బరాజు, ఆ తరువాత కంప్యూటర్ కోర్సు చేసి ౖహైదరాబాద్లోని డెల్ కంప్యూటర్స్‌లో చేరారు. మంచి ఉద్యోగం, మంచి శాలరీ... అయినా మనసులో ఏదో తెలియని అసంతృప్తి. ‘వర్క్ అంటే ప్రతి క్షణం ఎంజాయ్ చేసేలా ఉండాలి. కొత్త ప్రదేశాలు తిరగాలి. కొత్త వ్యక్తులతో మాట్లాడాలి. ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా ఆలోచించాలి... జీవితంలోని తాజాదనాన్ని ఎప్పటికప్పుడు ఆస్వాదించాలి’’ అనుకున్నారు సుబ్బరాజు.ఇంతకీ అదేమిటి? టైమ్ కోసం ఎదురుచూడడం తప్ప ఏమో ఇప్పటికైతే తెలియదు. ఆ టైమ్ రానే వచ్చింది. ఒకసారి దర్శకుడు కృష్ణవంశీ ఇంట్లోని కంప్యూటర్‌కు ఏదో సమస్య వచ్చినప్పుడు, చేయిచేసుకోవడానికి మిత్రుడితో కలిసి వెళ్లాడు సుబ్బరాజు. ఆ కొద్ది సమయంలోనే సుబ్బరాజుకు నటన అంటే ఇష్టమని తెలుసుకొని తన చిత్రంలో చిన్న పాత్ర ఒకటి ఇచ్చారు కృష్ణవంశీ. కనిపించీ కనిపించనట్లు ఉండే ఆ టెర్రరిస్ట్ పాత్ర తనకేమీ పెద్దగా గుర్తింపు తేలేదు. అయితే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘అమ్మా నాన్న ఒక తమిళ అమ్మాయి’ సినిమాలో వేసిన ఆనంద్ పాత్రతో సుబ్బరాజు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ‘అమ్మ నాన్న ఒక తమిళ అమ్మాయి’ సినిమాలో కిక్–బాక్సింగ్ ఛాంపియన్ రఘువీర్ (ప్రకాష్‌రాజ్) ప్రియ శిష్యుడు ఆనంద్‌గా, గురువును మోసం చేసిన శిష్యుడి పాత్రను అద్భుతంగా పోషించారు సుబ్బరాజు. ‘ఆర్య’ ‘పోకిరి’ ‘నేనున్నాను’ ‘దూకుడు’ ‘నమో వెంకటేశ’ ‘పరుగు’... ఇలా చెప్పుకుంటే పోతే సుబ్బరాజుకు పేరు తెచ్చిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. శత్రువుల తలలు తీసే ఫ్యాక్షనిస్ట్‌కు కుడిభుజంలాంటి సేవకుడి నుంచి, అమ్మాయిలను మోసం చేసే ‘చీటింగ్ లవర్’ వరకు రకరకాల పాత్రలు పోషించి ‘ఉత్తమ విలన్’ అనిపించుకున్నారు సుబ్బరాజు.