సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రొయ్య రైతుల సమాఖ్య (ఏపీ పీఎఫ్‌ఎఫ్) ఆవిర్భవించింది. విజయవాడలో మంగళవారం జరిగిన రాష్ట్ర రొయ్య రైతుల సమావేశంలో జాతీయ రొయ్య రైతుల సమాఖ్యకు అనుబంధంగా దీనిని ఏర్పాటు చేశారు. ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ (అప్సడా) కో–వైస్ చైర్మన్ వడ్డి రఘురామ్ సమక్షంలో నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది.
సమాఖ్య అధ్యక్షునిగా కె.భాస్కరరాజు (కృష్ణా), ప్రధాన కార్యదర్శిగా జీవీ సుబ్బరాజు (పశ్చిమ గోదావరి), ఉపాధ్యక్షులుగా ఎం.వెంకటేశ్వరరావు (కృష్ణా), ఆర్.నానిరాజు (అంబేడ్కర్ కోనసీమ), ఆర్గనైజింగ్ కార్యదర్శిగా డి.గోపీనాథ్ (ప్రకాశం), కోశాధికారిగా వై.వెంకటానందం (అంబేడ్కర్ కోనసీమ), సహాయ కార్యదర్శులుగా ఇ.ఇమ్మానియేల్ (బాపట్ల), యు.రాంబాబు (పశ్చిమ గోదావరి) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
సమాఖ్య గౌరవ అధ్యక్షునిగా అప్సడా వైస్ చైర్మన్ వడ్డి రఘురామ్, సలహాదారులుగా జాతీయ రొయ్య రైతుల సమాఖ్య అధ్యక్షుడు ఐపీఆర్ మోహనరాజు, శ్రీనాథ్‌రెడ్డి, నాగభూషణం, సీహెచ్ సూర్యారావు, డీవీ లక్ష్మీపతిరాజు వ్యవహరిస్తారు. గతంలో ఎన్నడూలేని విధంగా గడిచిన నాలుగేళ్లుగా ఆక్వా రంగానికి, ఆక్వా రైతులకు అన్ని విధాలుగా చేయూతనిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఏపీ రొయ్య రైతుల సమాఖ్య నూతన కార్యవర్గం కృతజ్ఞతలు తెలిపింది.
కాగా, రొయ్యల స్థానిక వినియోగం పెంచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే ఫ్రాన్ ఫెస్టివల్స్‌కు జిల్లా రొయ్య రైతు సంఘాల ఆధ్వర్యంలో ఉచితంగా రొయ్యలు సరఫరా చేయాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment