prawn
-
రొయ్య రైతుల సమాఖ్య ఆవిర్భావం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రొయ్య రైతుల సమాఖ్య (ఏపీ పీఎఫ్ఎఫ్) ఆవిర్భవించింది. విజయవాడలో మంగళవారం జరిగిన రాష్ట్ర రొయ్య రైతుల సమావేశంలో జాతీయ రొయ్య రైతుల సమాఖ్యకు అనుబంధంగా దీనిని ఏర్పాటు చేశారు. ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా) కో–వైస్ చైర్మన్ వడ్డి రఘురామ్ సమక్షంలో నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. సమాఖ్య అధ్యక్షునిగా కె.భాస్కరరాజు (కృష్ణా), ప్రధాన కార్యదర్శిగా జీవీ సుబ్బరాజు (పశ్చిమ గోదావరి), ఉపాధ్యక్షులుగా ఎం.వెంకటేశ్వరరావు (కృష్ణా), ఆర్.నానిరాజు (అంబేడ్కర్ కోనసీమ), ఆర్గనైజింగ్ కార్యదర్శిగా డి.గోపీనాథ్ (ప్రకాశం), కోశాధికారిగా వై.వెంకటానందం (అంబేడ్కర్ కోనసీమ), సహాయ కార్యదర్శులుగా ఇ.ఇమ్మానియేల్ (బాపట్ల), యు.రాంబాబు (పశ్చిమ గోదావరి) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సమాఖ్య గౌరవ అధ్యక్షునిగా అప్సడా వైస్ చైర్మన్ వడ్డి రఘురామ్, సలహాదారులుగా జాతీయ రొయ్య రైతుల సమాఖ్య అధ్యక్షుడు ఐపీఆర్ మోహనరాజు, శ్రీనాథ్‌రెడ్డి, నాగభూషణం, సీహెచ్ సూర్యారావు, డీవీ లక్ష్మీపతిరాజు వ్యవహరిస్తారు. గతంలో ఎన్నడూలేని విధంగా గడిచిన నాలుగేళ్లుగా ఆక్వా రంగానికి, ఆక్వా రైతులకు అన్ని విధాలుగా చేయూతనిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఏపీ రొయ్య రైతుల సమాఖ్య నూతన కార్యవర్గం కృతజ్ఞతలు తెలిపింది. కాగా, రొయ్యల స్థానిక వినియోగం పెంచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే ఫ్రాన్ ఫెస్టివల్స్‌కు జిల్లా రొయ్య రైతు సంఘాల ఆధ్వర్యంలో ఉచితంగా రొయ్యలు సరఫరా చేయాలని నిర్ణయించారు. -
‘తమ్మిలేరు’ తగాదా
చింతలపూడి : తమ్మిలేరు రిజర్వాయర్‌లో కొన్నేళ్లుగా అనధికారికంగా రొయ్య ల సాగు చేస్తుండటం వివాదాలకు తావిస్తోంది. ప్రాజెక్టుపై రాజకీయ నాయకుల ప్రాబల్యం పెరగడంతో దళారులు మత్స్యకారుల నోళ్లు మూ యిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏటా కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల మ త్స్యకారుల సంఘాల మధ్య వివా దం చోటు చేసుకుంటోంది. నాగిరెడ్డిగూడెం సమీపంలోని తమ్మిలేరు ప్రాజెక్టు, కృష్ణాజిల్లా మంకొల్లు వద్ద నిర్మించిన గోనెలవాగులో గతేడాది సెప్టెంబర్‌లో అనధికారికంగా రొయ్య పిల్లలను వేశా రు. ఇప్పుడు వాటిని పట్టి అమ్ముకునే విషయంలో మరోసారి వివాదం తలెత్తింది. ప్రాజెక్టులో రొయ్య పిల్లలను మేము వేశామంటే, మేము వేశామని రొయ్యలు మాకే అమ్మాలని రెండు జిల్లాలకు చెందిన వ్యాపారులు వివా దాన్ని రగిల్చారు. దీంతో ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో రొయ్యల వేటను నిషేధిస్తూ కృష్ణాజిల్లా చాట్రాయి తహసీల్దార్ 144 సెక్షన్ విధించారు. దీంతో ప్రాజెక్టుపై ఆధారపడి బతుకుతున్న సుమారు 400 మత్స్యకార కుటుంబా లు ఆందోళన చెందుతున్నాయి. దళారుల కన్ను మత్స్యశాఖ ఏటా తమ్మిలేరులో చేప పిల్లలను వేసి, అవి పెరిగాక వాటిని మత్స్యకారులు పట్టుకుని అమ్ముకునేలా ఏర్పాట్లు చేసింది. అయితే రొయ్య ల సాగు ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుండటంతో రెండు జిల్లాలకు చెందిన దళారుల కన్ను ప్రాజెక్టుపై పడింది. రాజకీయ పలుకుబడితో జలాశయంలో రొయ్యలు పెంచుతూ కోట్లు గడిస్తున్నారు. ఇందుకోసం మ త్స్యకార సంఘాలతో ముందుగానే ఒప్పందం చేసుకుని పట్టిన రొయ్యలను తమకే విక్రయించాలని నిబంధన విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల పట్టిన రొయ్యలను తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి కృష్ణా జిల్లాకు చెందిన వ్యాపారి ప్రయత్నించగా మత్స్యకారులు గిట్టదని చెప్పడంతో వివాదం చోటు చేసుకుంది. దీంతో స్థానిక మత్స్యకారులు విషయాన్ని మంత్రి పీతల సుజాత దృష్టికి తీసుకువెళ్లారు. మంత్రి ఆదేశాలతో జిల్లాకు చెందిన మత్స్యశాఖ డీడీ ఎం.యాకూబ్‌పాష, తహసీల్దార్ టి.మైఖేల్‌రాజ్ గ త శనివారం ప్రాజెక్టును పరిశీలించా రు. మత్స్యకార సంఘాలతో సంప్రదిం పులు జరిపారు. త్వరలోనే రెండు జి ల్లాల అధికారులు, మత్స్యకార సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని అప్పటి వరకు రొయ్యల వేటకు వెళ్లవద్దని అధికారులు ఆదేశించారు. రొయ్యల సాగు నిషేధం తమ్మిలేరు ప్రాజెక్టులో రొయ్యల సాగు నిషేధం. అయినా దళారులు ఏటా రొయ్య పిల్లలను జలాశయంలో వేసి పెంచడం, పట్టుకుని అమ్మడం చేస్తున్నారు. ఇదంతా ఇరిగేషన్, మత్స్యశాఖ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం తమ్మిలేరు ప్రాజెక్టుపై రూ.10 కోట్లతో తాగునీటి పథకం నిర్మిస్తోంది. దీని ద్వారా చింతలపూడి, ప్రగడవరం పంచాయతీలకు తాగునీరు అందించనున్నారు. ప్రాజెక్టులో రొయ్యల సాగు చేపడితే నీరు కలుషితమై తాగడానికి పనికిరావని, అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. దీనిపై ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సీహెచ్ అమరేశ్వరరావును వివరణ కోరగా తమ్మిలేరులో రొయ్యల సాగు చేస్తున్న వారికి నోటీసులు ఇస్తున్నామని, విషయాన్ని కలెక్టర్ భాస్కర్ దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
రొయ్యకు రోగం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: గతనెలలో వచ్చిన వరదలు ఆక్వా రంగానికి తీవ్ర నష్టాలను మిగిల్చాయి. మిగిలిన రొయ్యల సాగును ప్రస్తుతం వ్యాధులు వెంటాడుతున్నాయి. అంతుబట్టని వ్యాధులతో రొయ్య పిల్లలు చనిపోతుండటం, పెరుగుదల లేకపోవటం చూసి ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు. వాతావరణంలో వస్తున్న మార్పులు, తల్లి రొయ్యల ద్వారా సోకుతున్న వ్యాధులపై అధికారులు రైతులకు అవగాహన కల్పించడం లేదు. దీంతో రొయ్యకు వచ్చిన రోగం ఒకటైతే.. రైతులు వైరస్ అంటూ రూ. లక్షలు వెచ్చించి తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్రంలో నెల్లూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఆక్వా కల్చర్ సాగవుతుంది. అత్యధికంగా వెనామీ నెల్లూరు జిల్లాలోనే ఉంది. సముద్ర తీరాన 54 వేల ఎకరాల్లో రైతులు రొయ్యల సాగు చే పట్టారు. అయితే నవంబర్‌లో కురిసిన భారీవర్షాలకు సుమారు 30 వేల ఎకరాల్లో రొయ్యల గుంతలు వరదలకు కొట్టుకుపోయాయి. పంట చేతికొచ్చే సమయంలో విపత్తు సంభవించ డంతో ఆక్వారైతులు రూ. కోట్లు నష్టపోయారు. వరదలకు ముందు ‘వైట్‌గట్’ వైరస్ కారణంగా కూడా నష్టపోయారు. తల్లి రొయ్య నుంచే ఈహెచ్‌పీ వ్యాధి రొయ్యకు సోకిన ఎంటిరో సైటోజోన్ హెపిటోప్ పెయినీ (ఈహెచ్‌పీ) వ్యాధి తల్లి రొయ్య నుంచే సోకిందని శాస్త్రవేత్తలు, అధికారులు చెబుతున్నారు. ఆక్వాసాగుకు సంబంధించి గుర్తింపుపొందిన కంపెనీ నుంచే హెచరీలు తల్లిరొయ్యలను కొనుగోలు చేయాల్సి ఉంది. కానీ కొన్ని హెచరీల వారు స్థానికంగా తక్కువ ధరకు దొరికే తల్లిరొయ్యల వైపు మొగ్గుచూపుతున్నారు. తద్వారా ఏహెచ్‌పీ, ఈహెచ్‌పీ వ్యాధులు సోకుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈహెచ్‌పీ వ్యాధి సోకిన రొయ్యపిల్ల ఎదుగూ బొదుగూ లేకుండా ఉండిపోతుంది. ఆహారం తీసుకుంటుంది కానీ పెరుగుదల కనిపించదు. అయితే చనిపోయినట్లు కనిపిస్తూ కదలకుండా ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిశోధనలు ప్రారంభ దశలోనే ఉన్నాయి. మరో నాలుగేళ్ల తర్వాత మందు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ లోపు రైతులు యాజమాన్య పద్ధతుల ద్వారా వ్యాధి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చూచిస్తున్నారు. - కోస్టల్ అథారిటీ గుర్తింపు పొందిన సంస్థల నుంచే హేచరీలు తల్లి రొయ్యలను కొనుగోలు చేయాలి. - రొయ్యల గుంట చుట్టూ వల ఏర్పాటు చేయాలి (వేరొకచోట నుంచి చేపపిల్లలు, ఇతరత్రా వాటిని తెచ్చి గుంతల్లో పడేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. - ఎకరం గుంతలో లక్ష పిల్లలను మాత్రమే వేయాలి. రెండు నెలలైనా రొయ్యలు పెరగలేదు రెండు నెలల క్రితం గుంతలో రొయ్య పిల్లలు పోశా ను. ఇప్పటికి దాదాపుగా 12 గ్రాముల వరకు పెరగాల్సి ఉంది. కానీ నాలుగు, ఐదు గ్రాముల బరువు మాత్రమే పెరి గాయి. పిల్లల్లో తేడా.. లేదా ఇంకేమైనా వ్యాధా అనేది తెలియడం లేదు. - శ్రీహరికోట వెంకటేశ్వర్లు(మైపాడు) వైరస్‌తో తీవ్రంగా నష్టపోయాం స్నేహితులం భాగస్వాములుగా చేరి పది ఎకరాల వరకు వెనామీ సాగు చేశాం. రెండు నెలలు అయిన రొయ్య ఎదుగదల లేదు. వర్షాలు ఆగిపోయిన తర్వాత వైరస్ సోకి రొయ్యలు చనిపోయాయి. ఈ వైరస్‌తో తీవ్రంగా నష్టపోయాం. - ఎస్కే రఫి (గంగపట్నం) -
రొయ్యకు కొత్త రోగం
ఇందుకూరుపేట: ఆక్వా రంగాన్ని వైరస్లు వెంటాడుతున్నాయి. వైరస్‌లను తట్టుకునే కొత్త రకాలను తెచ్చినా కొద్దిరోజులకే కొత్త రకం వైరస్ ఆక్వాను చిన్నాభిన్నం చేస్తోంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దశాబ్ద కాలానికి పైగా రారాజుగా నిలిచి డాలర్ల వర్షం కురిపించి ఆక్వా రైతుల జీవితాలనే మార్చేసిన ‘టైగర్’ రొయ్యను వైట్‌స్పాట్, బ్లాక్‌స్పాట్, విబ్రియో వంటి వైరస్లు ఉనికే లేకుండా చేశాయి. తాజాగా మనుగడ సాగిస్తూ.. టైగర్‌తో రెండోదశలో దెబ్బతిన్న ఆక్వా రైతులను ఆదుకుంటున్న ‘వెనామీ’ని ప్రస్తుతం ‘వైట్‌గట్’ అనే కొత్త వైరస్ వణికిస్తోంది. జిల్లాలో తీరం వెంబడి కావలి నుంచి చిట్టమూరు వరకు ప్రస్తుతం 25 వేల ఎకరాల్లో వెనామీ సాగవుతోంది. నాసిరకం సీడ్.. ప్రధానంగా నాసిరకం సీడ్ వల్లే ఆక్వా రంగం కుదేలవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా పుట్టగొడుగుల్లా ఏర్పాటవుతున్న హేచరీలు స్థానికంగా రైతుల చెరువుల్లో నుంచి తల్లి రొయ్యలను సేకరించి సీడ్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. అనుమతులున్న హేచరీలకు ఎంపెడా తల్లి రొయ్యలను సరఫరా చేస్తోంది. జిల్లాలో 140కి పైగా హేచరీలున్నాయి. వీటిలో 30 హేచరీలకే ఎంపెడా అనుమతి ఉంది. ఈ వైరస్ సోకిన రొయ్యలు మేత సరిగా తినకపోవడంతో లూజ్‌షెల్‌కు గురవుతున్నాయి. లోలోపలే రొయ్యలు మృ త్యువాత పడుతున్నాయి. సీడ్ సర్వైవల్ శాతం తగ్గిపోతోం ది. పంట కాలపరిమితి పెరుగుతోంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న తల్లి రొయ్యల నుంచే ఈ వైరస్ వ్యాపిస్తోందని ఆక్వా నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నష్టాలబాటలో రైతులు వెనామీ సాగులో ఆశించిన ఫలితాలు లేకపోవడంతో రైతులకు దిక్కుతోచడంలేదు. రెండేళ్ల కిందట 30 కౌంట్ ధర రూ.600 నుంచి రూ.650 పలికింది. ప్రస్తుతం అదే కౌంట్ ధర ఇప్పుడు సగానికి పడిపోయింది. పంట చేతికి వచ్చినా నష్టాలు తప్పడం లేదు. సాగులో వ్యయ ప్రయాసలు పెరగడం, లాభాలు తగ్గుముఖం పట్టడంతో వెనామీ సాగు తగ్గుముఖం పట్టింది. ఇందుకూరుపేట మండలంలోని కుడితిపాళెం, రాముడుపాళెం, గంగపట్నం, మైపాడు, కొరుటూరు గ్రామాల్లో కొందరు రైతులు ఇప్పటికే స్వస్తి పలికారు. డాలర్ల పంట పండిస్తున్న వెనామీ సాగులో వైరస్‌ను అరికట్టే ప్రయత్నం చేయపోతే.. టైగర్, స్కాంపి రొయ్యల సాగుకు పట్టినగతే దీనికీ పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తల్లి రొయ్యల నుంచే వైట్‌గట్ ప్రస్తుతం వెనామీ రొయ్యలకు వైట్‌గట్ సోకి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సీడ్లో ఎక్కువ శాతానికి ఈ వైరస్ ఉంది. ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతున్న తల్లి రొయ్యల నుంచి ఇది వ్యాప్తి చెందుతోందని నిపుణులు చెబుతున్నారు. దీన్ని అరికట్టేందుకు ల్యాబ్‌ల ద్వారా పరీక్షలు నిర్వహించిన తల్లి రొయ్యలనే దిగుమతి చేసుకోవాలి. నాణ్యమైన సీడ్‌నే రైతులకు అందజేయాలి. - హనుమంతునాయుడు, రైతు -
రొయ్య... అదిరిందయ్యా!
విశాఖతీరంలో మత్స్యకారుల పంట పండింది. ఆదివారం రొయ్యలు విరివిగా వలకు చిక్కడమే కాకుండా మామూలు కంటే భిన్నంగా ఒక్కొక్క రొయ్య రెండు, మూడు కిలోలు ఉన్నవి లభించడంతో మత్స్యకారులు ఆనందంలో మునిగితేలారు. కిలో రూ.650 నుంచి రూ.1100లకు విక్రయించారు. -విశాఖపట్నం