సాక్షి, హైదరాబాద్: రైతు భరోసా విధివిధానాలపై మంత్రివర్గ ఉపసంఘం ఈ నెల 16వ తేదీన మరోసారి భేటీ కానుంది. రైతుల నుంచి అభిప్రాయాలను సేకరించనుంది. ఈ నెల 11 నుంచి 16 వరకు అన్ని జిల్లాలో రైతుల అభిప్రాయాలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రోజుకు మూడు సమావేశాలు చొప్పున జిల్లా మంత్రుల ఆధ్వర్యంలో రైతులతో కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. 5 ఎకరాల కటాప్ పెట్టాలనే అంశంపై కేబినెట్ సబ్ కమిటీలో చర్చించనున్నారు. 92 శాతం చిన్న, సన్నకారు రైతులు 5 ఎకరాల లోపు ఉన్నారని మంత్రివర్గానికి అధికారుల నివేదిక అందజేసినట్లు సమాచారం.
గత ప్రభుత్వంలో రైతు బంధు, నిధుల విడుదలలో రూ. 26 వేల కోట్లు దుర్వినియోగానికి గురి అయినట్లు సబ్ కమిటీకి వ్యవసాయ శాఖ అధికారులకు నివేదిక అందజేశారు. ఇప్పటికే రైతు నివేదికల ద్వారా తీసుకున్న రైతుల అభిప్రాయాన్ని సబ్ కమిటీ ముందు అధికారులు పెట్టారు. రాష్ట్రంలో సాగు భూమి లెక్కలను మంత్రివర్గానికి అధికారులు అందించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment