'Jigarthanda Double X' locks Diwali release; director makes surprise announcement - Sakshi
Sakshi News home page

Jigarthanda Double X: ఎన్నో అవార్డులు తెచ్చిన జిగర్తాండ సీక్వెల్‌ రిలీజ్‌ ఎప్పుడంటే

Published Tue, Jul 4 2023 8:12 AM | Last Updated on Tue, Jul 4 2023 8:43 AM

Jigarthanda Double X locks Diwali Release - Sakshi

తమిళంలో సూపర్ హిట్ సాధించిన జిగర్తాండ సినిమాను ఇప్పటికే పలు భాషల్లో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో తమిళ హీరో సిద్ధార్థ్, బాబీ సింహా ప్రధాన పాత్రల్లో నటించగా.. బాక్సాఫీసు వద్ద ఈ మూవీ కాసుల వర్షం కురిపించడమే కాకుండా ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఇక ఇదే సినిమాను తెలుగులో వరుణ్ తేజ్ హీరోగా గద్దలకొండ గణేశ్ పేరుతో తెరకెక్కింది. హరీశ్ శంకర్ దీనిని రీమెక్ చేయగా.. టాలీవుడ్‏లో కూడా మంచి విజయాన్ని సాధించింది.

(ఇదీ చదవండి: అక్కడ మరొకరు ఉన్నా లిప్‌లాక్ చేసేదాన్ని:నటి)

తాజాగా దీనికి సిక్వెల్‌ రెడీ చేశారు డైరెక్టర్‌ కార్తీక్‌ సుబ్బరాజు. సుమారు 8 ఏళ్ల తర్వాత ఆ చిత్రానికి సీక్వెల్‌గా జిగర్తాండ డబుల్‌ ఎక్స్‌ రూపొందుతోంది. కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వం వహిస్తూ తన స్టోన్‌ బెంచ్‌ ఫిలింస్‌పై అలంకార్‌ పాండియన్‌కు చెందిన ఇన్వలియో ఆరిజిన్‌ సంస్థతో కలిసి నిర్మిస్తున్నారు. దీనికి కార్తికేయన్‌ సంతానం సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. లారెన్స్‌, ఎస్‌జే సూర్య ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంతోష్‌ నారాయణన్‌ సంగీతాన్ని, తిరు చాయాగ్రహణ అందిస్తున్నారు. జిగర్తాండ డబుల్‌ ఎక్స్‌ చిత్రం షూటింగ్‌ పూర్తి అయ్యిందని యూనిట్‌ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి.

(ఇదీ చదవండి:విజయ్‌ను డైరెక్ట్‌ చేసే లాస్ట్‌ ఛాన్స్‌ ఆ దర్శకుడికే..)

ఈ సందర్భంగా మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో చిత్రం సంతృప్తికరమైన అనుభవాన్ని కలిగించిందని దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌ తెలిపారు. చిత్రాన్ని పలు ప్రాంతాల్లో భారీ వ్యయంతో రూపొందించినట్లు చెప్పారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలకు సిద్ధం అవుతున్నట్లు తెలిపారు. జిగర్తాండ డబుల్‌ ఎక్స్‌ చిత్రాన్ని దీపావళికి థియేటర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. తెలుగులో కూడా ఈ సినిమా రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement