
రాఘవా లారెన్స్ హీరోగా రమేశ్ వర్మ దర్శకత్వంలో ఓ యాక్షన్ అడ్వెంచరస్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఎ స్టూడియోస్ ఎల్‌ఎల్‌పీ, నీలాద్రి ప్రొడక్షన్స్, హవీష్ ప్రొడక్షన్స్‌పై కోనేరు సత్యానారాయణ నిర్మించనున్నారు. ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు కీర్తీ సురేష్, పూజా హెగ్డే, రకుల్‌ప్రీత్ సింగ్ వంటి వార్ల పేర్లు తెరపైకి వచ్చాయి.
(చదవండి: కంగువా రిలీజ్ వాయిదా.. రజనీకాంత్ కోసమే!)
అయితే పూజా హెగ్డే కన్ఫార్మ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. మరి... రాఘవా లారెన్స్‌తో పూజా హెగ్డే జోడీ కడతారా? అంటే కొంత సమయం వేచి చూడాల్సిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. నవంబరులో చిత్రీకరణ ప్రారంభించి, వచ్చే ఏడాది వేసవిలో సినిమాని రిలీజ్ చేయాలను కుంటున్నారు. అలాగే హిందీ హిట్ ఫిల్మ్ ‘కిల్’ సినిమాకు తమిళ రీమేక్‌గా రాఘవా లారెన్స్ 25వ చిత్రం రూపొందుతోందని కోలీవుడ్ టాక్.
Comments
Please login to add a commentAdd a comment