
రాఘవ లారెన్స్.. గ్రూప్ డ్యాన్సర్ స్థాయి నుంచి నృత్య దర్శకుడిగా, ఆ తరువాత కథానాయకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఎదిగారు. ప్రస్తుతం హీరోగా బిజీగా ఉన్నారు. ఇటీవల ఈయన కథానాయకుడిగా నటించిన జిగర్‌తండ డబులెక్స్ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం.. దర్శకుడు లోకేష్ కనకరాజ్ కథను రాసి, సొంతంగా నిర్మిస్తున్న 'బెంజ్' చిత్రంలో లారెన్స్ కథానాయకుడిగా నటించడానికి సిద్ధం అవుతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే వెలువడింది. ఇందులో సూర్య అతిథి పాత్రలో కనిపించనున్నారట!
ప్రస్తుతం ఈయన కంగువ చిత్రంతో బిజీగా ఉన్నారు. అలాగే కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తన 44వ చిత్రాన్ని చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఈయన చేతిలో వాడివాసల్ తదితర చిత్రాలు ఉన్నాయి. కమల్ హాసన్ 'విక్రమ్' సినిమా చివరి ఘట్టంలో సూర్య రోలెక్స్ అనే అతిథి పాత్రలో మెరిసి పెద్ద ఇంపాక్ట్‌నే కలిగించారు.
ఇదే పాత్రతో సూర్య హీరోగా పూర్తి చిత్రాన్ని చేయనున్నట్లు లోకేష్ కనకరాజ్ పేర్కొన్నారు కూడా. తాజాగా ఈయన రాఘవ లారెన్స్ బెంజ్ మూవీలో రోలెక్స్ తరహా పాత్రలో అతిథిగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీని గురించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment