
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టయిన టాలీవుడ్ నటి హేమపై మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) సస్పెషన్ వేటు వేసింది. హేమను ‘మా’ నుంచి సస్పెండ్ చేయడానికి సభ్యుల అభిప్రాయాలు కోరుతూ ప్రెసిడెంట్ మంచు విష్ణు బుధవారం మా అసోసియేషన్ గ్రూప్ లో మెసేజ్ పెట్టారు. అయితే సభ్యులంతా హేమను సస్పెండ్ చేయాల్సిందే అంటూ రిప్లయ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
దీంతో హేమను సస్పెండ్ చేయాలని మంచు విష్ణు నిర్ణయం తీసుకున్నారు. హేమకు క్లీన్ చిట్ వచ్చేవరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని ప్రకటించారు. కాగా.. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమ దొరికిపోయారు. వైద్య పరీక్షల్లోనూ ఆమెకు పాజిటివ్‌గా తేలింది. ఇటీవలే ఆమెను అరెస్ట్ చేసిన బెంగళూరు పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

Comments
Please login to add a commentAdd a comment