'త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో బన్నీ'..కానీ సినిమా కోసం కాదు | Allu Arjun And Trivikram Shooting For An Ad | Sakshi
Sakshi News home page

Allu Arjun: మరోసారి అల్లు అర్జున్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌

Published Sun, Sep 19 2021 4:20 PM | Last Updated on Sun, Sep 19 2021 4:22 PM

Allu Arjun And Trivikram Shooting For An Ad - Sakshi

Allu Arjun -Trivikram For An Add Shooting: అల్లు అ‍ర్జున్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఇప్పటి వరకు జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి, అల వైకుంఠపురములో వంటి హిట్‌ చిత్రాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే. తాజాగా మాటల మాంత్రిక్రుడు త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో బన్నీ మరోసారి నటించారు. అయితే ఇది సినిమా కోసం కాదు.. ఓ యాడ్‌ షూట్‌ కోసం. రాపిడో బైక్‌ ఆన్‌లైన్‌ అగ్రిగేటర్‌ యూడ్‌ కోసం వీరిద్దరి కలిసి పనిచేశారు.

అన్నపూర్ణ స్టూడియోస్‌లో దీనికి సంబంధించిన షూటింగ్‌ పూర్తయింది. త్వరలోనే ఈ యాడ్‌ ప్రసారం కానుంది. కాగా త్రివిక్రమ్‌ బడా సినిమాలే కాకుండా పలు వాణిజ్య ప్రకటనలను కూడా రూపొందిస్తుంటారన్న విషయం తెలిసిందే. ఇక అల్లు అర్జున్‌ ప్రస్తుతం సుకుమార్‌ దర్వకత్వంలో పుష్ప సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది క్రిస్మస్‌ నాడు ఈ సినిమా ఫస్ట్‌ పార్ట్‌ థియేటర్స్‌లో విడుదల కానుంది.

చదవండి : కమెడియన్‌ అలీ ఇంటిని ఎప్పుడైనా చూశారా?
సల్మాన్‌తో ఇప్పటికీ టచ్‌లోనే ఉంటా : సల్లు భాయ్‌ మాజీ ప్రేయసీ


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement