Ranveer Singh To Play Key Role In Allu Arjun Pushpa 2 Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Pushpa 2 Update:'పుష్ప-2'లో బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌? ఏ పాత్రలో అంటే..

Published Mon, May 22 2023 12:16 PM | Last Updated on Mon, May 22 2023 12:37 PM

Ranveer Singh To Play Key Role In Allu Arjun Pushpa 2 - Sakshi

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్‌ కాంబినేషన్‌లో ప్రస్తుతం 'పుష్ప-2: ది రూల్'రూపొందుతున్న సంగతి తెలిసిందే.  రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొట్టిన పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా పుష్ప-2 తెరకెక్కుతుంది. ఈ చిత్రం కోసం అల్లు అర్జున్‌ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతుంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది. పాన్‌ ఇండియా మూవీ కావడంతో తెలుగుతో పాటు కన్నడ, తమిళ పరిశ్రమలకు చెందిన పలువురు నటీనటులు పుష్ప-2 భాగస్వామ్యం కానున్నారు.

తాజాగా బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ పేరు తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో ఆయన పోలీస్‌ ఆఫీసర్‌గా కీలక పాత్రలో కనిపించనున్నారట. ఇందులో ఎంత నిజం ఉందన్నది త్వరలోనే తెలియనుంది.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement