Allu Arjun Sukumar Pushpa 2 Movie Gets Release Date, Deets Inside - Sakshi
Sakshi News home page

Pushpa 2 Release: క్రేజీ న్యూస్‌.. అల్లు అర్జున్‌ పుష్ప-2 రిలీజ్‌ డేట్‌ అప్పుడే

Published Mon, May 29 2023 3:54 PM | Last Updated on Mon, May 29 2023 4:28 PM

Allu Arjun Sukumar Pushpa 2 Gets Release Date - Sakshi

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్, నేషనల్‌ క్రష్ రష్మిక మందన్నా తాజాగా నటిస్తున్న చిత్రం 'పుష్ప-2: ది రూల్'. రెండేళ్ల క్రితం విడుదలైన సంచలన విజయం సాధించిన ‘పుష్ప’సినిమాకు సీక్వెల్‌ ఇది. ఇప్పటికే పుష్ప-2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం అల్లు అర్జున్‌ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు.

అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది.ఇప్పటికే షూటింగ్‌లో చాలాభాగం పూర్తయ్యింది. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా విడుదల కానుందనే టాక్‌ వినిపించింది. కానీ అంతకంటే ముందుగానే అంటే డిసెంబర్‌ చివరి వారంలోనే ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట.

త్వరలోనే రిలీజ్‌ డేట్‌ను ఖరారు చేయనున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్, అనసూయ భరద్వాజ్​, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement