
త్రివిక్రమ్, ఎన్టీఆర్
‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా కోసం దర్శకుడు త్రివిక్రమ్, హీరో ఎన్టీఆర్ తొలిసారి కలిశారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. మరోసారి ఈ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుంది. హారికా హాసినీ, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై యస్. రాధాకృష్ణ, కల్యాణ్‌రామ్ ఈ సినిమాను నిర్మించనున్నారు. మే నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. 2021 ఏప్రిల్‌లో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఎన్టీఆర్ కెరీర్‌లో ఇది 30వ చిత్రం. ఈ సినిమాకు ‘అయిననూ పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని సమాచారం. కాంబినేషన్ కలవబోతున్న సంగతిని బుధవారం అధికారికంగా ప్రకటించారు. మరి టైటిల్ ఇదే షురూ అవుతుందా? వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment