AA22 Update: Allu Arjun And Trivikram The Dynamic Combo For Their 4th Film, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Allu Arjun -Trivikram AA22 Update: బన్నీ కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది

Published Mon, Jul 3 2023 11:11 AM | Last Updated on Mon, Jul 3 2023 11:30 AM

Allu Arjun And Trivikram Combo Reunite For The 4th Film - Sakshi

ఐకాన్‌ స్టార్‌ అల్లు అ‍ర్జున్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఇప్పటి వరకు జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి, అల వైకుంఠపురములో వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే. తాజాగా మాటల మాంత్రిక్రుడు త్రివిక్రమ్‌ కాంబోలో భారీ పాన్‌ ఇండియా చిత్రం రానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. చాలా రోజుల నుంచి వీరిద్దరి కాంబోలో నాలుగో చిత్రం రానుందని ప్రచారం జరిగింది.

(ఇదీ చదవండి: ఆమెకు దూరంగా ఉండాలంటూ సోనూసూద్‌కు సలహాలిస్తున్న ఫ్యాన్స్‌)

దీనిని నిజం చేస్తూ  తాజాగా  గీతా ఆర్ట్స్‌ , హారికా- హాసిని క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా అల్లు అ‍ర్జున్‌- త్రివిక్రమ్‌లతో సినిమా నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. నిర్మాత నాగవంశీ కూడా ఈ సినిమాకు సంబంధించి ట్వీట్‌ చేశారు.  నేడు (జులై 3)న ఉదయం 10 గంటల 8 ని.లకు వీడియో ద్వారా వారు మూవీకి సంబంధించి అప్‌డేట్‌ ఇచ్చారు. ఇప్పటికే పుష్ప సినిమాతో ఐకాన్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న బన్నీకి ఈ సినిమా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో అతిపెద్ద ప్రాజెక్టులలో  ఒకటిగా ఉంటుందని సమాచారం. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను చిత్రబృందం త్వరలో ప్రకటించనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement