సూపర్ స్టార్ మహేశ్ బాబు తన తదుపరి చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేయబోతున్న సంగతి తెలిసిందే. మహేశ్ 28వ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం ప్రీప్రోడక్షన్, స్క్రిప్ట్ వర్క్‌ను జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి రానుంది. చెప్పాలంటే ఈ నెలలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలు కానుందని వినికిడి. ఇందుకు సంబంధించిన పనులు కూడా శరవేగంగా జరుతున్నాయట. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
చదవండి: రీసెంట్‌గా విడాకుల ప్రకటన.. ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్ చెప్పిన బాలీవుడ్ జంట
ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రకిగాను తివిక్రమ్ మలయాళ ఇండస్ట్రీకి చెందిన ఓ విలక్షణ నటుడిని రంగంలోకి దింపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఇప్పటికే ఈ సినిమాలో విలన్‌గా కొంతమంది పేర్లు బయటకు రాగా అందులో తెలుగు నటుడు తరుణ్ పేరు కూడా వినిపించింది. అయితే ఇందులో వాస్తవం లేదని తరుణ్ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మలయాళ నటుడు రోషన్ మాథ్యూను త్రివిక్రమ్ విలన్‌గా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. రోషన్ మాథ్యూ ఎవరో కాదు .. రీసెంట్‌గా విడుదలైన చియాన్ విక్రమ్ 'కోబ్రా' సినిమాలోని మెయిన్ విలన్.
చదవండి: విషాదం.. యువ నటి ఆత్మహత్య, వైరల్‌గా మారిన సూసైడ్ నోట్
2015లో మాలీవుడ్‌లో నటుడిగా కెరియర్ మొదలు పెట్టిన రోషన్ అనతి కాలంలోనే విలక్షణ నటుడిగా గుర్తింపు పొందాడు. ఇక 'కోబ్రా' సినిమాతో తమిళ, తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యాడు. నాని 'దసరా' సినిమాలోను రోషన్ మాథ్యూ ఓ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రోషన్‌ను మహేశ్ మూవీలో మెయిన్ విలన్ పాత్రకి గాను త్రివిక్రమ్ తీసుకున్నాడని ఫిలిం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై ప్రకటన కూడా వెలుడనుంది. మరి ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. కాగా ఈ సినిమా మహేశ్ సరసన పూజ హెగ్డే అలరించనున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment